pizza
Vaisakham 3rd schedule from 20 June
జూన్‌ 20 నుండి జయ బి. 'వైశాఖం' మూడో షెడ్యూల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 June 2016
Hyderaba
d

'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో 'సూపర్‌హిట్‌' అధినేత బి.ఎ.రాజు, ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'వైశాఖం'. ఇటీవల కజక్‌స్థాన్‌ షెడ్యూల్‌తో 60 శాతం పూర్తయింది. ఇప్పుడు ఈనెల 20 నుండి మూడో షెడ్యూల్‌ 20 రోజుల పాటు జరుగుతుంది.

ఈ సందర్భంగా దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ - ''కథలో కీలకమైన కొన్ని ముఖ్య సన్నివేశాల్ని, నైట్‌ ఎఫెక్ట్‌లో ఓ ఫైట్‌ని ఈ షెడ్యూల్‌లో చేస్తున్నాం. ఒక కొత్త కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తీస్తున్న 'వైశాఖం' చిత్రం దర్శకురాలిగా నాకు ఓ ఛాలెంజ్‌. హీరోహీరోయిన్స్‌తో పాటు అన్ని క్యారెక్టర్స్‌కూ ఇంపార్టెన్స్‌ వున్న 'వైశాఖం' నాకు 'లవ్‌లీ' కంటే మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''యూత్‌ని, ఫ్యామిలీస్‌ని విశేషంగా ఆకట్టుకునే అంశాలతో తీస్తున్న 'వైశాఖం' 2016లో ఓ సూపర్‌హిట్‌ సినిమాగా ఆదరణ పొందుతుందన్న నమ్మకం వుంది. ఈ సినిమాలో సాంగ్స్‌ అన్నీ సూపర్‌గా వచ్చాయి. కథకు పూర్తి న్యాయం జరిగిలే ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అవకుండా హై బడ్జెట్‌లో 'వైశాఖం' చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మంచి చిత్రాల్ని ఆదరించే ప్రేక్షకులకు తప్పకుండా 'వైశాఖం' బాగా నచ్చుతుంది. మా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో 'లవ్‌లీ' కంటే పెద్ద హిట్‌ అవుతుంది ఈ 'వైశాఖం'. బిజినెస్‌పరంగా చాలా పెద్ద ఆఫర్స్‌ రావడం ఆల్‌రెడీ 'వైశాఖం' సినిమా పట్ల వున్న క్రేజ్‌కు ఓ నిదర్శనంగా చెప్పుకోవాలి. డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ 'వైశాఖం' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు'' అన్నారు.

హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, లతీష్‌, శృతినాయుడు, కళ్యాణి, కుమారి, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved