pizza
Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Look Out
పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, క్రిష్ జాగర్లమూడి, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం `కొండ‌పొలం`... ఫ‌స్ట్ లుక్ విడుద‌ల
You are at idlebrain.com > news today >
Follow Us

20 August 2021
Hyderabad

Mega sensation Vaishnav Tej, creative director Krish Jagarlamudi and stunning diva Rakul Preet Singh are working together for the first time for Production No 8 of First Frame Entertainments and the film is making enough noise already.

A small glimpse to make announcement regarding title and first look created inquisitiveness on the project. Titled Kondapolam, the film’s first look poster is out. It’s a perfect title for a film set in forest backdrop and the title design too looks absorbing.

Sporting beard, Vaisshnav Tej looks very watchful and intense in the poster that presents him as a part of nature. While on top, few people are seen walking in forest region, the background sees sheep eating grass. The intriguing poster hikes the prospects on the film.

Coming to the video, Vaisshnav Tej appears ferocious as he is set to take on miscreants in the forest. While visuals look grand, background score builds up the emotion.

An Epic Tale Of ‘Becoming’ reads the poster. The makers have also announced officially that Kondapolam will release on October 8th.

Billed to be a spectacular adventurous film, adapted from the novel written by Sannapureddy Venkata Rami Reddy has a masterly technical team of MM Keeravani scoring the music, while Gnana Shekar VS cranks the camera.

Saibabu Jagarlamudi and Rajeev Reddy are producing the yet to be titled film presented by Bibo Srinivas. The film will also feature some prominent actors.

Cast: Panja Vaisshnav Tej, Rakul Preet Singh

Technical Crew:

Director: Krish Jagarlamudi
Producers: Saibabu Jagarlamudi and Rajeev Reddy
Banner: First Frame Entertainments
Music Director: MM Keeravani
Cinematography: Gnana Shekar VS
Story: Sannapureddi Venkata Rami Reddy
Editor: Shravan Katikaneni
Art: Raj Kumar Gibson
Costumes: Aishwarya Rajeev
Fights: Venkat
PRO: Vamsi-Shekar

పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, క్రిష్ జాగర్లమూడి, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం `కొండ‌పొలం`.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్‌, గ్లామ‌ర్ డాల్ ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌ల‌యిక‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రొడ‌క్ష‌న్‌.నెం.8గా రూపొందుతోన్న చిత్రానికి `కొండ‌పొలం` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను అనౌన్స్ చేస్తూ చిన్న గ్లింప్స్‌ను శుక్ర‌వారం రోజున చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ గ్లింప్స్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి `కొండ‌పొలం` అనే టైటిల్ డిజైన్‌, లుక్ ప‌ర్‌ఫెక్ట్‌గా అనిపిస్తుంది.

వైష్ణ‌వ్ తేజ్ గ‌డ్డం, ఇన్‌టెన్స్ లుక్‌తో చూడ‌టానికి చాలా హ్యండ్‌స‌మ్‌గా క‌నిపిస్తున్నాడు. త‌నే నేచుర‌ల్‌లో ఓ భాగ‌మ‌నే విష‌యాన్ని పోస్ట‌ర్ తెలియ‌జేస్తుంది. అలాగే కొంత మంది అడ‌విలో న‌డుచుకుని వెళుతున్న‌ట్లు తెలుస్తుంది. బ్యాగ్రౌండ్‌లో గొర్రెలు గ‌డ్డి తింటున్నాయి. టైటిల్ పోస్ట‌ర్‌, ఫ‌స్ట్ లుక్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఇక వీడియో చూస్తే అడ‌విలోని దుండ‌గులు అడ్డుకోవ‌డానికి వైష్ణ‌వ్ తేజ్ వ‌డిసె తిప్పుతూ క‌నిపించాడు. త‌న చూపుల్లో ఓ ఉగ్రం క‌నిపిస్తుంది. విజువ‌ల్స్ గ్రాండియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. నేప‌థ్య సంగీతం ఎమోష‌న్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతున్నాయి.

`ఎపిక్ టేల్ ఆఫ్ బిక‌మింగ్‌` అని పోస్ట‌ర్‌లో ఓ లైన్‌లో చూడొచ్చు. అలాగే నిర్మాత‌లు `కొండ‌పొలం` చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవలను ఆధారంగా చేసుకుని ఈ అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌రికొంత ప్ర‌ముఖ ఆర్టిస్టులు న‌టించారు.

న‌టీన‌టులు:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: క్రిష్ జాగ‌ర్ల‌మూడి
ప్రొడ్యూస‌ర్స్‌: సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి
బ్యాన‌ర్‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ: జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌
క‌థ‌: స‌న్న‌పురెడ్డి వెంక‌ట రామిరెడ్డి
ఎడిట‌ర్‌: శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేటి
ఆర్ట్‌: రాజ్ కుమార్ గిబ్స‌న్‌
కాస్ట్యూమ్స్‌: ఐశ్వ‌ర్య రాజీవ్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved