pizza
Varun Sandesh denies dengue fever rumors
తనకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందన్న వార్తల్లో నిజం లేదు - వరుణ్ సందేశ్
You are at idlebrain.com > news today >
Follow Us

01 December 2015
Hyderabad

ఈనెల 7వ తారీకున ఎంగేజ్ మెంట్ పెట్టుకున్న వరుణ్.... తన రెగ్యులర్ హెల్త్ చెకప్ లోభాగంగా... నేడు సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు వెళ్లాడు. అయితే అతను హాస్పిటల్ కు రావడం చూసిన కొందరు కుర్రాళ్లు.... తమ మీడియా మిత్రులకు వరుణ్ సందేశ్ హాస్పిటల్ కు వచ్చాడు అని చెప్పి ఊరుకోకుండా... వరుణ్ కు డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లుంది అందుకే వచ్చాడని అత్యుత్సాహం ప్రదర్శించారు.. అది నిజమో కాదో కూడా తెలియని కొందరు .... వరుణ్ కు లేని పోని డెంగ్యూని అంట గట్టేశారు.

విషయం తెలుసుకుని వెంటనే అలర్ట్ అయిన వరుణ్ సందేశ్ తాను రెగ్యులర్ జనరల్ చెకప్ కే వచ్చాను తప్ప... తనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved