pizza
VI Anand interview (Telugu) about Okka Kshanam
నా దృష్టి తెలుగుమీద! - వి.ఐ.ఆనంద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

24 December 2017
Hyderabad

అ్ల‌లు శిరీష్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సురభి, శీర‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `ఒక్క క్ష‌ణం`. ఈ సినిమా ఈ నెల 28న విడుద‌ల కానుంది. ఈ చిత్రం గురించి వి.ఐ.ఆనంద్ ఆదివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

ఒక్క క్ష‌ణం చిత్రం గురించి చెప్పండి?
- ఇది ప్యార‌ల‌ల్ లైఫ్ గురించి చెప్పే సినిమా. ప్యార‌ల‌ల్ లైఫ్ అనేది ఫిక్ష‌న్ కాదు. ఒక కాన్సెప్ట్. ఒక థియ‌రీ. 1800 నుంచి దీనికి ఒక థియ‌రీ ఉంది. ఆర్టిక‌ల్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ గా ప్యార‌ల‌ల్ లైఫ్ అనేది 100 ఏళ్ల క్రితం నుంచి ఉంది. నాకు తెలిసిన కొరియ‌న్ మూవీ ఒక‌టి ఉంది. కానీ మా కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే వేరు. దెయ్యాల సినిమా చేశా. అలాగ‌ని ఆత్మ‌ల చిత్రాల‌న్నీ నేనే చేయాల‌ని లేదు. ఆ కాన్సెప్ట్ తో ఆ సినిమా వ‌చ్చింది. అలాగే పున‌ర్జ‌న్మ గురించి ఓ సినిమా వ‌స్తోంద‌నుకుందాం. అదే కాన్సెప్ట్ తో ర‌క‌ర‌కాల క‌థ‌ల‌తో చాలా క‌థ‌లు వ‌స్తాయి. అలాగ ప్యార‌ల‌ల్ కాన్సెప్ట్ తో నేను ఈ సినిమా చేశాను.

మీకు ఇలాంటి సినిమాలు చేయాలని ఎందుకు అనిపించింది?
నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సైన్స్ ఫిక్ష‌న్ అంటే చాలా ఇష్టం. అలాంటి సినిమాల‌ను నేను ల‌వ్ చేస్తా. నేను త‌మిళంలో చేసిన `అప్పుచ్చి గ్రామం` కూడా సైన్స్ ఫిక్ష‌న్‌. మిడ్ రాయిడ్ ఆ గ్రామంలో ప‌డుతుంద‌ని తెలిసిన త‌ర్వాత అక్క‌డ ప్ర‌జ‌ల మాన‌సిక స్థితి ఎలా ఉంటుంది అనే క‌థ‌తో చేశాను.

ఒక్క క్ష‌ణం సినిమాను ప్యార‌ల‌ల్ లైఫ్‌తో చేద్దామ‌నుకున్నారా?
లేదండీ. నేను ఒక‌సారి రోడ్డు మీద వెళ్తున్న‌ప్పుడు కారులో ముందు ఓ వృద్ధ దంప‌తులు ఉన్నారు. వెనుక వాళ్ల‌బ్బాయి రిలాక్స్ అవుతున్నాడు. ఆ సీన్ నాకు ఎందుకో గుర్తుండిపోయింది. అత‌ను ముందు సీట్‌లో ఉండి, ఆ త‌ల్లిదండ్రులు వెనుక కూర్చుని రిలాక్స్ అయితే బావుంటుందేమో అనిపించింది. ఆ క్యార‌క్ట‌ర్‌ని బేస్ చేసుకుని ఈ సినిమా క‌థ‌ను అల్లుకున్నాను.

సినిమా టీజ‌ర్‌లో అగ్గిపుల్ల‌ల‌ను చూపించాల‌న్న కాన్సెప్ట్ ఎవ‌రిది?
నాదేనండీ. అగ్గిపుల్ల‌ల‌ను విసిరితే రెండు మాత్రం ఒకేలా ప‌డ‌తాయి. అలాగే ఇన్ని కోట్ల జ‌నాభాలో ఒకే ర‌కంగా ఆలోచించేవాళ్లు, ఒకేర‌క‌మైన జీవితాన్ని గ‌డిపేవారు ఉంటారు. నాకు తెలిసిన మా బంధువుల అమ్మాయి కూడా ఇంకో అమ్మాయితో ఇలాగే ప్యార‌ల‌ల్ లైఫ్‌ను చూస్తుంటుంది. ఇలాంటి అంశాల‌ను టీజ‌ర్‌లో రివీల్ చేస్తే ఆస‌క్తి ఏం ఉంటుంద‌ని చాలా మంది అడిగారు. కానీ థియేట‌ర్‌కి వ‌చ్చే వాళ్ల‌కి ఈ కాన్సెప్ట్ ముందుగానే చెప్పాల‌నుకున్నా. ప్రేక్ష‌కులు ఇంకేదో ఊహించుకుని వ‌చ్చి ఇక్క‌డ అర్థం చేసుకోకుండా ఉండ‌కూడ‌ద‌న్న‌ది నా ఫీలింగ్‌.

ఈ ప్రాజెక్ట్ ఎలా కుదిరింది?
ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా షూటింగ్‌లో ఉన్న‌ప్పుడే నేను చక్రికి ఈ సినిమా చెప్పాను. ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్‌లో ఉన్న‌ప్పుడు ఆయ‌న ఫోన్ చేసి క‌థ‌ను అల్లు శిరీష్‌కి చెప్ప‌మ‌న్నారు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా క‌థ విన్న‌ప్పుడు నిఖిల్ ఎంత ఎగ్జ‌యిట్ అయ్యారో, ఈ క‌థ విని అల్లు శిరీష్ కూడా అంతే ఎగ్జ‌యిట్ అయ్యారు.

అవ‌స‌రాలకు, అల్లు శిరీష్ కి ఎలా కుదిరింది?
ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ క‌న్నా, అల్లు శిరీష్‌, అవ‌స‌రాల కెమిస్ట్రీ చాలా బాగా ఉంటుంది. సినిమా చూసిన వారు త‌ప్ప‌కుండా ఆ విష‌యాన్ని అర్థం చేసుకుంటారు.

మీరు త‌మిళియ‌న్ క‌దా?
అవునండీ. కానీ ఇక్క‌డే సెటిల్ అయిపోయాను. అందుకే వ‌రుస‌గా తెలుగు సినిమాలు చేస్తున్నాను.

ఎక్క‌డికి పోతావుచిన్న‌వాడా, ఒక్క క్ష‌ణం సినిమాలు ఒకేసారి రెండు భాష‌ల్లోనూ తీసేయొచ్చు క‌దా.. ఎందుకు అటెంప్ట్ చేయ‌లేదు?
కొన్ని సార్లు కాన్సెప్ట్ యూనివ‌ర్శ‌ల్‌దే అయిన‌ప్ప‌టికీ ద్విభాషా చిత్రాలంటే చాలా త‌తంగం ఉంటుంది. అందులోనూ నా మెయిన్ ఫోక‌స్ ఇక్క‌డే కాబ‌ట్టి తెలుగులోనే చేశాను.

అల్లు అర‌వింద్‌గారిని క‌లిశారా?
ఈ చిత్ర క‌థ‌ను కూడా వినిపించాను. ఆయ‌న క‌థ విని బావుంద‌న్నారు. నా త‌ర్వాతి సినిమా కూడా గీతా ఆర్ట్స్ లోనే ఉంటుంది.

అందులో హీరో ఎవ‌రు? ఏ త‌ర‌హా చిత్రం?
సైన్స్ ఫిక్ష‌న్ అనే అనుకుంటున్నా. రెండు మూడు స్క్రిప్ట్ లు ఉన్నాయి . వాటిలో ఇంకా దేన్నీ ఫైన‌లైజ్ చేయ‌లేదు. హీరో గురించి కూడా ఇంకా ఏమీ అనుకోలేదు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved