pizza
Vijay Deverakonda Felicitates Plasma Donors, Urges people who have recovered to donate
ప్లాస్మా డొనేట్ చేసిన దాతలను సన్మానించిన హీరో విజయ్ దేవరకొండ,రికవరీ అయిన వారిని డొనేట్ చేయాలని వినతి
You are at idlebrain.com > news today >
 
Follow Us

31 July
Hyderabad


Happening hero Vijay Deverakonda who is always up for social cause, this time has come forward to felicitate Plasma donors. On Friday, the Cyberabad Police felicitated the Plasma donors at Commissionerate officce and for this event, Vijay Deverakonda arrived as chief guest and even launched a campaign poster.

Commissioner of Police, Sajjannar hosted the event and addressing the media he said, “I appreciate the Plasma donors. Despite some misinterpretation on this, people are coming forward to donate Plasma. If one recovered patient donates 500 ML of Plasma, two Covid-19 patients can be saved. Today 120 people donated Plasma and so far 200 people were saved/got cured. Those who have done this are saviours and are equal to the almighty. It is our social responsibility to donate Plasma.”

Then it was the chief guest of the event, Vijay Deverakonda who addressed the gathering. “Last month, a couple of people whom I know were infected of Covid-19. They needed Plasma but they could not find donors. Earlier there was a confusion on donating Plasma and for all those people, donateplasma.scsc.in will clear their doubts and misunderstandings. People who have recovered from Covid-19 should come forward and donate Plasma as we don’t know when would vaccine come out for public use. For now the only weapon we have is Plasma. In case if I get Corona and recover, I would readily donate Plasma without any second thought,” said Vijay Deverakonda.

కరోనా ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో విజయ్ దేవరకొండ,సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసీ లో సన్మానించారు. ఈ సందర్భంగా
ప్లాస్మా డోనర్స్ పోస్టర్ ను హీరో విజయ్ దేవర కొండ లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..
"ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందిస్తున్నాను..ఎన్నో అపోహల మధ్య ఎందరో ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు.కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఏకం అవుతుంది.

ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్ లను కాపాడ వచ్చు.ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారు.200 మంది పేషెంట్ ను కాపాడాము..ప్లాస్మా దానం చేసిన వారు కారోనా యోధులు..వాళ్ళు దేవుడితో సమానం.
సామాజిక బాధ్యత లో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలి"అన్నారు

చీఫ్ గెస్ట్ గా హాజరైన హీరో విజయ్ దేవర కొండ మాట్లాడుతూ..

"పోయిన నెల మాకు తెలిసిన వ్యక్తులకు కారోనా వచ్చింది.వారికి ప్లాస్మా అవసరం వచ్చింది..కానీ ఎక్కడా ప్లాస్మా దాతలు దొరకలేదు.అప్పుడు ప్లాస్మా ప్రాధాన్యత తెలిసింది.ఇంతకు ముందు ప్లాస్మా డొనేట్ చేయాలంటే కన్ఫుజ్ ఉండేది.కానీ ఇప్పుడు donateplasma.scsc.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయితే చాలు.

ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. రికవరీ అయిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నా.వాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే.ఒకవేళ నాకు కారోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా".అన్నారు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved