pizza
K. V. Vijayendra Prasad interview (Telugu) about Adhirindhi
వ్య‌వ‌స్థ మారాల‌ని చేసిన ప్ర‌య‌త్న‌మే `అదిరింది` - విజ‌యేంద్ర ప్ర‌సాద్‌

You are at idlebrain.com > news today >
Follow Us

22 October 2017
Hyderabad

 

త‌మిళ హీరో విజ‌య్‌, స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్ న‌టించిన చిత్రం `మెర్స‌ల్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో `అదిరింది` పేరుతో విడుద‌ల చేస్తున్నారు. అతిత్వ‌ర‌లో తెల‌గు సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని 400 దియోట‌ర్స్ లో విడుద‌ల కి సిధ్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి.తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి క‌థ‌నాన్ని అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ ...``త‌మిళంలో విడుద‌లైన బాహుబ‌లి భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు మెర్స‌ల్‌(అదిరింది) క‌లెక్ష‌న్స్ చూస్తుంటే త‌మిళ బాహుబ‌లిని దాటేస్తుంద‌నిపిస్తుంది. సినిమా అనేది వినోదంతో పాటు ఆలోచ‌న‌ను కూడా క‌లిగించేదిగా ఉండాలి. అలా వినోదంతో పాటు ఆలోచింపజేసేదే సినిమా. మెరిట్ వున్న విద్యార్థుల వెతల్ని చర్చిస్తూ సామాజిక ఇతివృత్తంతో దర్శకుడు శంకర్ జెంటిల్‌మెన్ చిత్రాన్ని రూపొందించారు. భారతీయుడు సినిమాలో లంచగొండి వ్యవస్థ గురించి చూపించారు. ఆయన తరహాలోనే కార్పొరేట్ వైద్యం నేపథ్యంలో మెర్సల్ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. తలనొప్పి వచ్చిందని కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే సంబంధం లేకుండా 20 టెస్ట్‌లు రాస్తున్నారు. అదే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళితే టెస్ట్‌లు అవసరం లేదు టాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుందని చెబుతారు. మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే లక్షల్లో జీతాలు ఇస్తూ ఒక్కొక్కరికి ఇంత వసూలు చేయాలని టార్గెట్‌లు పెడుతున్నారు. దాంతో కార్పొరేట్ వైద్యులు సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విష‌యాన్నే సినిమాలో చూపించాం. ఇంత అభివృద్ధి సాధిస్తున్న ఈ రోజుల్లో వైద్యం సామాన్య మానవునికి అందని ద్రాక్షగా మారిపోతోంది. దీన్నే కథా వస్తువుగా తీసుకుని సినిమా చేద్దామని అట్లీ అనుకున్న‌ప్పుడు ఆ పాయింట్‌తో రమణగిరివాసన్ అద్భుతమైన కథగా తీర్చిదిద్దారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే తండ్రి ఆశయం ఎలా పక్కదారి పట్టింది? ఆ ఆశయాన్ని ఆయన కొడుకులు ఎలా నెరవేర్చారు? అన్నదే సినిమా. వ్యవస్థ మారాలనే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమిది. ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైకి చెందిన కొంత మంది డాక్టర్‌లు ఈ చిత్రాన్ని ఎవరూ చూడకుండా నిషేధించాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మధ్య నేను పనిచేసిన చిత్రాలు భారీ విజయాల్ని సాధిస్తున్నాయి. ఇది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. అదిరింది తెలుగులో వచ్చిన విజయ్ చిత్రాల్లోనే అత్యధిక కలెక్షన్‌లు సాధిస్తుందనే నమ్మకముంది. ప్ర‌స్తుతం అస్సాంకు చెందిన ఓ యోధుడి కథ రాస్తున్నాను. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ అధ్యక్షుడు ఎం.ఎస్. గోవాల్కర్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాను. నాయక్, రౌడీ రాథోడ్ చిత్రాలకు సీక్వెల్స్ రాస్తున్నాను. రాజమౌళి కూడా కొత్త కథ చెప్పమని అడుగుతున్నాడు. అయితే అది అతన్ని ఎైగ్జెట్ చేసే విధంగా వుండాలట. అలాంటి కథ వుంటే చెప్పండి వెంటనే సినిమా మొదలుపెడదాం అంటున్నాడు. ఇందులో ఎలాంటి సీజీ వర్క్ వుండకూడదనేది రాజమౌళి కండీషన్. నేనూ అలాంటి కథ కోసమే వెతుకుతున్నాను`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved