pizza
Vinodam 100% audio in July third week
You are at idlebrain.com > news today >
Follow Us

04 July 2015
Hyderabad

జూలై మూడోవారంలో ‘వినోదం 100%’ ఆడియో విడుదల

ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్‌ పతాకంపై శ్రీరామ్‌మూర్తి దర్శకత్వంలో విజయ్‌ భరత్‌, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా పొట్నూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘వినోదం 100%’. ఈ చిత్రంలో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డబ్బింగ్‌ మరియు ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియో ఆవిష్కరణ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పొట్నూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘100% వినోదం పంచే అద్భుతమైన చిత్రమిది. యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకర్షించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రంలో బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళ నటన, కామెడీ ఈ చిత్రానికి హైలెట్‌ గా ఉంటుంది. ప్రస్తుతం డబ్బింగ్‌, ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై మూడవ వారంలో ఆడియో ఆవిష్కరణ జరిపి, వెంటనే మూవీని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’ అన్నారు.

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ భరత్‌, అశ్విని, కాంచన, సత్యం రాజేష్‌, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్య తారాగణం.

సాంకేతిక నిపుణులు:
సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, కథ: జయకుమార్‌, మాటలు: అంజన్‌, పాటలు: చిర్రావూరి విజయ్‌కుమార్‌,కృష్ణచిన్ని, కెమెరా: మల్లిఖార్జున్‌, ఎడిటింగ్‌: రాంబాబు,
నిర్మాత: పొట్నూరి శ్రీనివాసరావు
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరామ్‌మూర్తి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved