pizza
Vipul about Kannayya
హీరోగా, ద‌ర్శ‌కుడుగా చేయ‌డం ఢ‌బుల్ ధ‌మాకాగా భావిస్తున్నాను - విపుల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

15 March 2017
Hyderabad

పాపిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై విపుల్-హర్షిత జంటగా జాదవ్ రాజేష్ బాబు-పగడాల కృష్ణంరాజు-తిరువాయిపాటి రవితేజలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విపుల్ దర్శ‌కుడు. ఈ సినిమా హీరో, ద‌ర్శ‌కుడు విపుల్ పాత్రికేయుల‌తో మాట్లాడాడు...

విపుల్ మాట్లాడుతూ - ``క‌న్న‌య్య అనే టైటిల్‌ను క‌థానుగుణంగానే పెట్టాను. అయితే ఈ టైటిల్ ఎందుకు పెట్టామో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నేను మ‌ల్టీడైమ‌న్ష‌న్ వాసుగారి వ‌ద్ద‌, ల‌వ్ సైకిల్ సినిమాకు, ఇలా కొన్ని చిత్రాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాను. హ్యుమ‌న్ రిలేష‌న్స్ పై ఉండే సినిమా. గ‌మ్యం, వేదం సినిమాల్లా మ‌నుషుల మ‌ధ్య ఉండే రిలేష‌న్స్‌ను బేస్ చేసుకుని ఈ సినిమా ర‌న్ అవుతుంది. స‌బ్ కాన్ష‌స్‌ మెమొరీ అనే పాయింట్‌పై సాగే క‌థ ఇది. ఇందులో నేను అనాథ యువ‌కుడు. క‌న్న‌య్య అనే క్యారెక్ట‌ర్‌కు పూర్తి విరుద్ధంగా సాగే పాత్ర‌. రిలేష‌న్ ఏదీ లేక‌పోవ‌డం వ‌ల్ల హీరో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంటాడు. దాని వ‌ల్ల హీరో లైఫ్‌లో ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌. చిన్న చిత్రాల్లో ఈ స‌బ్‌కాన్ష‌స్‌

ఈ స‌బ్ కాన్ష‌న్ అనే పాయింట్‌పై ఎవ‌రూ సినిమా చేయ‌లేదు. ఇదే సినిమాలో హైటైల్ అంశాలు. హ‌ర్షిత హీరోయిన్ చ‌క్క‌గా న‌టించింది. హీరోగా, ద‌ర్శ‌కుడుగా చేయ‌డం డ‌బుల్ ధ‌మాకాగా ఫీల‌వుతున్నాను. ఐదు సాంగ్స్ ఉన్నాయి. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved