pizza
Vivaha Bhojanambu song
వివాహ భోజనంబు'లో తొలి పాట 'ఎబిసిడి...' విడుదల
You are at idlebrain.com > news today >
 
Follow Us

03 February -2021
Hyderabad

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక. నిర్మాణ సంస్థలు ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు. ఈ చిత్రంలోని తొలి పాట 'ఎబిసిడి... నువ్వు నా జోడీ'ని బుధవారం విడుదల చేశారు.

అనిరుద్ విజయ్ (అనివీ) బాణీ అందించిన 'ఎబిసిడి...'కి కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఇన్నో గెంగా ఆలపించారు. రోల్ రైడా ర్యాప్ పాడారు. కాలేజీ నేపథ్యంలో మొదలైన ఈ పాట కొంత ముందుకు వెళ్లేసరికి సత్య వేసిన స్టెప్పులు అందర్నీ ఆకర్షించాయి. సినిమాలో తనకు ఇష్టమైన పాట 'ఎబిసిడి...' అని సందీప్ కిషన్ చెప్పారు.

లాక్‌డౌన్ లో జరిగిన వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిన చిత్రమిది. అసలు కథ విషయానికి వస్తే... పది రూపాయలు పార్కింగ్ టికెట్ కొనడానికి, స్నేహితులకు పుట్టినరోజు పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి మహేష్ (సత్య). కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. కానీ, ఆ తరవాత అసలు కథ మొదలవుతుంది. లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ ఎన్ని కష్టాలు పడ్డాడనేది తెరపై చూడాలని చిత్రబృందం చెబుతోంది. సందీప్ కిషన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, కథానాయకుడిగా సత్య అద్భుతంగా నటించాడనీ యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రంలో నటీనటులు:
సత్య, అర్జావీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టి.ఎన్.ఆర్, 'వైవా' హర్ష, శివోన్ నారాయణ, మధుమని, నిత్యా శ్రీ, కిరీటి, దయ, కల్పలత & ప్రత్యేక పాత్రలో యువ హీరో సందీప్ కిషన్.

సాంకేతిక నిపుణుల వివరాలు:
పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), పాటలు: కిట్టు, కృష్ణ చైతన్య, నృత్యాలు: సతీష్, విజయ్, మాటలు: నందు ఆర్.కె, కథ: భాను భోగవరపు, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: చోటా కె. ప్రసాద్, ఛాయాగ్రహణం: మణికందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సీతారామ్, శివ చెర్రీ, సంగీతం: అనిరుద్ విజయ్ (అనివీ), సమర్పణ: ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, నిర్మాతలు: కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.

 


 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved