pizza
Wife, i release on 3 January
సార్ధక్ మూవీస్ బ్యానర్ పై ప్రశాంత్ గౌడ్ విడుదల చేస్తున్న చిత్రం ''వైఫ్ ఐ''. జనవరి 3న గ్రాండ్ రిలీజ్ !!!
You are at idlebrain.com > news today >
Follow Us

17 December 2019
Hyderabad

'ఏడు చేపల కథ' లో టెంప్ట్ రవి గా నటించి ఒక్క టీజర్ తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి. ఈ మధ్యే ఆ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమా తో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా అభిషేక్ నటించిన కొత్త సినిమా ‘వైఫ్ఐ’ . ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పావులర్ అయ్యింది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు, నూతన దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ సార్ధక్ మూవీస్ సొంతం చేసుకుంది. నిర్మాత ప్రశాంత్ గౌడ్ వైఫ్ ఐ చిత్రాన్ని సార్ధక్ మూవీస్ ద్వారా విడుదల చేయబోతున్నారు. వైఫ్ ఐ అంటే కేవలం భార్య భర్తలే కాదు, ఈ జనరేషన్‌ ప్రతీ అమ్మాయి, అబ్బాయి చూడదగ్గ సినిమాగా ఈ 'వైఫ్‌ ఐ' ని తీర్చిదిద్దారు దర్శకులు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved