pizza
Nagarjuna, Ahishor Solomon, Matinee Entertainment’s 'Wild Dog' Shooting Recommenced
అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ 'వైల్డ్ డాగ్' షూటింగ్‌లో అడుగుపెట్టిన నాగార్జున‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

3 September -2020
Hyderabad



Matinee Entertainment’s 6th film titled 'Wild Dog', starring Akkineni Nagarjuna in the main lead. Directed by Ahishor Solomon, the film’s shooting recommenced today in Hyderabad.

To the cheer of the film world and innumerable workers and cine fans, film shootings with a big star resumes. By resuming shoot, King Nagarjuna breaks path and shows the way.

The makers released a video to make movie buffs and fans know the kind of safety measures they have been taking, while shooting the film.

Disinfectant tunnel is arranged at the entry of the set and wearing masks is made obligatory for all the actors and technicians including the lead cast. Then, the set is sanitized and so are the other stuffs including costumes.

Dia Mirza is the leading lady in the film, while Saiyami Kher will be seen in a crucial role.

This production venture of Matinee headed by Niranjan Reddy and Anvesh Reddy has dialogues penned by Kiran Kumar and Shaneil Deo is overseeing cinematography.

The following are the credits:
Writer - Director: Ahishor Solomon
Producers: Niranjan Reddy, Anvesh Reddy
Co-Producers: N M Pasha, Jagan Mohan Vancha
DOP: Shaneil Deo
Action Director: David Ismalone
Dialogues: Kiran Kumar
Editor: Shravan Katikaneni
Art Director: Murali SV
VFX Supervisor: Yugandhar T
Costume Designer: Ashwanth Byri
Stunt Coordinator: Jashuva
PRO: Vamsi-Shekar
Publicity Designers: Anil&Bhanu

 

అక్కినేని నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తోన్న‌ 6వ చిత్రం 'వైల్డ్ డాగ్‌'. అహిషోర్ సోల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్ షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ 70 శాతం స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా దాదాపు ఆరు నెల‌లుగా సినిమా షూటింగ్‌ల‌న్నీ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. 'వైల్డ్ డాగ్' షూటింగ్ సైతం అలాగే ఆగింది.

ఇటీవ‌ల షూటింగ్ చేసుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా హీరో నాగార్జున ఇచ్చిన ప్రోత్సాహంతో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ ఫిల్మ్ యూనిట్‌ 'వైల్డ్ డాగ్' చిత్రీక‌ర‌ణ‌ను పునఃప్రారంభించింది. దాని ప్ర‌కారం నాగార్జున స‌హా సెట్స్‌లోకి అంద‌రూ డిసిన్‌ఫెక్టెడ్ ట‌న్నెల్ నుంచే వెళ్తున్నారు. థ‌ర్మ‌ల్ స్కానింగ్‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలితేనే సెట్స్‌లోకి అడుగు పెడ్తున్నారు. మేక‌ప్‌మెన్‌లు, హెయిర్‌స్టైలిస్ట్‌లు ఫేస్ మాస్క్‌లు ధ‌రించి త‌మ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. కాస్ట్యూమ్స్, ఇత‌ర అలంకారాల‌ను శానిటైజ్ చేశాకే న‌టీన‌టులు ధ‌రిస్తున్నారు. అలాగే ప్ర‌తి ఎక్విప్‌మెంట్‌నూ శానిటైజ్ చేశాకే షూటింగ్ కోసం ఉప‌యోగిస్తున్నారు. సేఫ్టీ మెజ‌ర్స్ విష‌యంలో ఎక్క‌డా ఏ మాత్ర‌మూ రాజీ ప‌డ‌కుండా షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను సైతం యూనిట్ రిలీజ్ చేసింది.

ఆరు నెల‌లుగా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఉపాధి లేక అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో నాగార్జున లాంటి బిగ్ స్టార్ షూటింగ్ పునఃప్రారంభించ‌డంతో చిత్ర పరిశ్ర‌మ‌తో పాటు దిన‌స‌రి వేత‌నంతో జీవితాన్ని సాగించే కార్మికులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇది మిగ‌తా సినిమాల యూనిట్‌ల‌కు కూడా స్ఫూర్తినిస్తుంద‌ని ఆశిస్తున్నారు.

కాగా వైల్డ్ డాగ్‌లో విజ‌య్ వ‌ర్మ అనే ఎన్ఐఏ ఆఫీస‌ర్ రోల్‌ను నాగార్జున చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ద్వారా 'వైల్డ్ డాగ్' బృందంలో స‌భ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెష‌ల్ ఏజెంట్ - రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), హ‌ష్వంత్ మ‌నోహ‌ర్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ) కూడా ప‌రిచ‌య‌మ‌య్యారు.

నేర‌స్తుల‌తో వ్య‌వ‌హ‌రించే అత్యంత క‌ఠిన‌మైన తీరుతో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌ను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లిన క‌థ‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని ఒక భిన్న‌మైన పాత్ర‌ను నాగార్జున చేస్తున్నారు.

దియా మీర్జా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో స‌యామీ ఖేర్ ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సాంకేతిక బృందం:
డైలాగ్స్‌: కిర‌ణ్ కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ: షానీల్ డియో
ఎడిటింగ్‌: శ‌్రావ‌ణ్ క‌టిక‌నేని
ఆర్ట్‌: ముర‌ళి ఎస్‌.వి.
యాక్ష‌న్‌: డేవిడ్ ఇస్మ‌లోన్‌
స్టంట్ కో-ఆర్డినేట‌ర్‌: జాషువా
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌
స‌హ నిర్మాత‌లు: ఎన్‌.ఎం. పాషా, జ‌గ‌న్ మోహ‌న్ వంచా
నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్ సోల్మ‌న్

 

 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved