pizza
విజయదశమి సందర్భంగా బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు www.వైరస్. com (బి వేర్)
You are at idlebrain.com > news today >
Follow Us

28 August 2014
Hyderabad

హృదయ కాలేయం లాంటి సూపర్ హిట్ చిత్రం తో సంచలనం సాధించిన హీరో సంపూర్నేష్ బాబు హీరోగా , సి.హెచ్.శివరామ కృష్ణ దర్శకత్వం లో A.S.N films పతాకం పై సలీం , ఎ.జే.రాంబాబు లు సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం విజయదసమి సందర్భం గా షూటింగ్ ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా కి www.వైరస్. com అనే టైటిల్ ని ఖరారు చేసారు. బి వేర్ అనే టాగ్ లయిన్ ని పెట్టారు.

ఈ సందర్భం గా దర్శకుడు సి.హెచ్.శివరామ కృష్ణ మాట్లాడుతూ “ మా హీరో సంపూర్నేష్ బాబు ని ఈ చిత్రం లో సరికొత్త కోణంలో చూపిస్తున్నాము. ఈ కథకి హీరో కరెక్ట్ గా సెట్ అయ్యాడు, సంపూర్నేష్ బాబు నుండి ఎలాంటి వినోదాన్ని ప్రేక్షకులు కోరుకుంటారో అది ఈ చిత్రం లో పూర్తిగా ఉంటుంది” అని అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “ 2 సవత్సరాలు గా సిని నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తున్నాము ఎన్నో కథలు విన్నాము కాని అటు మాస్ , ఇటు క్లాస్ ప్రేకశాకులకే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా అందరు ఫ్యామిలీ తో వచ్చి ఆనందించేలా ఈ కథని దర్శకుడు చెప్పారు. నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింభింస్తున్నా, నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ , ఒక వినూత్న కథనం తో, ఆద్యంతం ఆసక్తి పరిచే కథాoశo తో, ఈ చిత్రం సాగుతుందని , అందుకే చిత్ర నిర్మాణం ప్రారంభించామని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని విజయ దశమి కి ప్రారంభం చేస్తాము, అక్టోబర్ లో, నవంబర్ లో షూటింగ్ చేసి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తాము . త్వరలో మిగతా నటీనటుల్ని , సాంకేతిక నిపుణలని తెలియజేస్తాము ”అని చెప్పారు .

హీరో సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ “ ఈ చిత్రం లో నేను ఇప్పటివరకు నటించని వెరైటీ పాత్ర లో నటిస్తున్నానని, ఈ చిత్రం తో తనకి సరికొత్త ఇమేజ్ వస్తుందని” అన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : వి.జే., కతావిస్త్హరణ, మాటలు: దుర్గా ప్రసాద్ రాయుడు , నిర్మాతలు : సలీం , ఏ.జే.రాంబాబు, కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం : ch.శివరామ కృష్ణ .

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved