pizza
Yamapasham release on 26 February
ఫిభ్రవరి 26న విడుదలవుతున్న 'యమ పాశం'
You are at idlebrain.com > news today >
Follow Us

21 February 2016
Hyderaba
d
.

తమిళ్ లో ఇప్పటి వరకూ రాని జాంబీ ( నడుస్తున్న శవాలు ) కాన్సెప్ట్ తో తెరకెక్కిన ' మిరుతన్ ' సినిమా తెలుగులో 'యమపాశం ' పేరుతో రాబోతోంది. జయం రవి, లక్ష్మీ మీనన్ జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమా మామగారు, బావ బావమరిది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడైన ఎడిటర్ మోహన్ తనయుడు జయం రవి , లక్ష్మి మీనన్ ముఖ్య పాత్రలలో నటించి తమిళనాట “మిరుతన్ “ గా రిలీజ్ అయ్యి సంచలన విజయం సొంతం చేసుకొని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుట ఫిబ్రవరి 26 న ఈ సినిమా విడుదల కానుంది.

శక్తి సౌందర్ రాజన్ తీసిన ఈ జాంబీ మూవీ, ఈ జానర్ లో సౌత్ ఇండియాలోనే మొదటిది కావడం విశేషం. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో మాత్రమే ఈ తరహా చిత్రాలు వచ్చేవి. ఒక వైరస్ ప్రపంచమంతా వ్యాపించి, మనుషుల్ని నరమాంస భక్షకులుగా మార్చేస్తే, ఆ వైరస్ నుంచి మిగిలిన వాళ్లను కాపాడటమెలా అనేదే జాంబీ కథాంశం. హాలీవుడ్ వాళ్లకు ఇవి రొటీన్ అయిపోయినా, ఇండియాకు మాత్రం ఇవి కొత్తే..

ఈ సందర్భం గ హీరో జయం రవి మాట్లాడుతూ ...ఓ సైంటిఫిక్‌ వైరస్‌ వల్ల మనుషుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి అనే విభిన్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కింది యమపాశం . ఈ సినిమా ఏ భాషలోనైనా హిట్టవుతుందనే నమ్మకంతోనే తెలుగులోకి తిసుకోస్తన్నాం ... తెలుగు మొట్టమొదటి సారిగా యమపాశం సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని దీనికి తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ మరియు మీడియా సహకారం కావాలని కోరుకుంటున్నాని తెలిపారు. మరి ఫిబ్రవరి 26 న రిలీజ్ కాబోతున్న జయం రవి “యమ పాశం “ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved