pizza
Yamini Bhaskar about @Nartanasala
సినీ ప‌రిశ్ర‌మ చాలా విష‌యాల‌ను నేర్పింది - యామినీ భాస్క‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

27 August 2018
Hyderabad

నాగ‌శౌర్య‌, క‌శ్మీరా ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన చిత్రం `@న‌ర్త‌న‌శాల‌`. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. ఈనెల 30న `@నర్తన శాల` చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా యామినీ భాస్క‌ర్ పాత్రికేయుల‌తో మాట్లాడుతూ ...

``అమ్మ, త‌మ్ముడు, నేను మాత్ర‌మే మా ఫ్యామిలీలో ఉంటాం. మాది విజ‌య‌వాడ‌. అక్క‌డే పుట్టి పెరిగాను. హైద‌రాబాద్‌లో నాలుగేళ్లుగా ఉంటున్నాను. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ప్రాముఖ్య‌త ఉంటుంది. నాతో పాటు క‌శ్మీరా ప‌ర‌దేశి హీరోయిన్‌గా న‌టించింది. క‌శ్మీర ఇందులో సాఫ్ట్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తే.. నేను యార‌గెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. ఈ సినిమాలో నేను యాక్ష‌న్ సీక్వెన్స్‌ల్లో న‌టించాను. ఎలాంటి డూప్ లేకుండా న‌టించాను. ఇందులో నా పాత్ర పేరు స‌త్య‌భామ‌. కీచ‌క సినిమాలో నా పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చినా.. ఎందుక‌నో నాకు అవ‌కాశాలు రాలేదు. @న‌ర్త‌న‌శాల‌తో నాకు ఇంకా మంచి పేరు వ‌స్తుంది. అలాగే అవ‌కాశాలు కూడా వ‌స్తాయ‌ని అనుకుంటున్నాను.యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకోలేదు కానీ.. స‌న్నివేశాలు చేయ‌డానికి మూడు రోజుల ముందు నుండి ప్రాక్టీస్ చేసి న‌టించాను. కీచ‌క సినిమా త‌ర్వాత మున్నోడి అనే త‌మిళ్ సినిమాలో న‌టించాను. త‌ర్వాత మారుతిగార భ‌లే మంచి చౌక భేర‌ము సినిమా చేశాను. అది వ‌చ్చే నెల‌లో విడుద‌లయ్యే అవ‌కాశాలున్నాయి. మేనేజ‌ర్‌గారి ద్వారా నా ఫోటోల‌ను చూసిన డైరెక్ట‌ర్ శ్రీనివాస్‌గారు.. న‌న్ను ఎంపిక చేసుకున్నారు. నేను తెలుగు అమ్మాయిని కావ‌డం కూడా ఓ కార‌ణ‌మే అని చెప్పాలి. ఇప్పుడు హీరోయిన్స్ ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంతో అప్ష‌న్స్ ఎక్కువ అయ్యాయి. దాంతో పోటీ ఎక్కువైంది. అందుక‌నే ఎక్కువ మంది హీరోయిన్స్ కంటిన్యూగా సినిమాలు చేయ‌లేక‌పోతున్నార‌ని అనుకుంటున్నాను. సినిమా రంగంలోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా విష‌యాలు తెలిశాయి. న‌న్ను నేను మౌల్డ్ చేసుకుంటూ వ‌స్తున్నాను. త‌దుప‌రి సినిమాలేవీ ఇంకా సైన్ చేయ‌లేదు. `@న‌ర్త‌న‌శాల‌`తో మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయని అనుకుంటున్నాను`` అన్నారు.

interview gallery



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved