pizza
సెల్ల్యు లాయిడ్ సైంటిస్ట్ నాగార్జున గారికి శుభాకాంక్షలు - వై వి యస్ చౌదరి
శివ చిత్రం 25 సంవస్చారాలు పూర్తి చేసుకున్న సందర్భాగా వై వి యస్ చౌదరి స్టేట్మెంట్
You are at idlebrain.com > news today >
Follow Us

08 October 2014
Hyderabad

"హిందీ సినిమా హిస్టరీ లో షోలే ఎలాగో తెలుగు సినిమా బాక్సాఫీస్ కి అడవి రాముడు ఎలాగో ఆదునిక రూపు సంతరించుకుంటున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ కి నాంది పలికిన ట్రెండ్ సెట్టర్ ఫిలిం గా శివ ను పేర్కొనవచ్చు. అప్పుడుదాక వెళుతున్న ఒక ట్రెండ్ ఫిల్మ్స్ కి భిన్నంగా, ఒక వ్యవది తో కాకుండా ఒకేసారి ఫిఫ్టీన్ ట్వంటీ ఫ్లోర్స్ టాకాఫ్ చేస్తూ పెనుమార్పుని తీసుకువచ్చిన చిత్రం శివ. అడవిరాముడు కమర్షియల్ బాక్సాఫీస్ సూత్రాని కొత్త నిర్వచనం ఎలాచేప్పిందో, ఈ సినిమా తీత లో ఎమోషన్స్ గాని తిసేవిదనం లోను గాని ప్రతి సన్నివేశం చెప్పినవిదానం లో గాని, దాదాపు పదిహేను అంతస్తులు, పదహారు అంతస్తులు జంప్ చేసిన ఫీలింగ్ కలిగిస్తుంది. శివ కి రామ్ గోపాల్ వర్మదే మొత్తం క్రెడిట్ ఎందుకంటె క్రియేటివ్ పార్ట్ ఆలోచన ఆయనదే కాబట్టి ఆయన ఆలోచనకి పక్కన వున్నా సినిమాల ప్రభావం తన మీద పడకుండా, మన సొసైటీ నుండే వచ్చి , మన తెలుగు సినిమా సొసైటీ లో పెరిగిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. పక్కనున్న చిత్రాల జోలికి వెళ్ళకుండా ఆయ చిత్రాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఫాల్లో కాకుండా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో తీసిన సినిమా శివ అందుకే టోటల్ గా క్రెడిట్ అంతా క్రిఎఅటర్ రామ్ గోపాల్ వర్మ కి చెందుతుంది . సినిమా అనే ఆలోచన ఒక పుస్తక రూపం లో రాసేది కాదు, ఎంతో కర్చు పెట్టి నిర్మాత ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టి 150 నుండి 200 మంది కస్టపడి పని చేస్తూ, ప్రజల యొక తీర్పు కోసం వేచి చూసే ఒక సాదనం లాంటిది సినిమా. ఈ నమ్మకం పై ఇన్వెస్ట్ చెయ్యాలి, అతను తాయారు చేసుకొచ్చిన నమ్మకాన్ని ముందుకు తీసికెళ్ళదానికి ముక్యమైన ఫ్యూయల్ కావాలి అంటే డబ్బు కావాలి. బ్లైండ్ బిలీఫ్ తో ముందుకు తీసికెళ్ళ గలగాలి అందులోను ట్రెండ్ కి ఎగనెస్ట్ గా వున్నా సబ్జెక్టు కాబట్టి మరింతగా నమ్మాలి. ఆ నమ్మకం రూపం లో ఆ రోజు రామ్ గోపాల్ వర్మ కు దొరికింది మరి ఎవరో కాదు సాక్షాతూ సెల్ల్యు లాయిడ్ సైంటిస్ట్ అని నేను పర్సనల్ గా పిలుచుకునే నాగార్జున గారు. నాగార్జున గారు, రామ్ గోపాల్ వర్మ గారు లాంటి కొత్త దర్శకులను అప్పటికి ఎందరినో పరిచయం చేసారు చేసారు, తరువాత కూడా ఎంతో మంది ని పరిచయం చేసారు మున్ముందు కూడా ఇంకా పరిచయం చేస్తారు. నాగార్జున గారు నన్ను సీతా రాముల కళ్యాణం చూతము రారండి చిత్రంతో డైరెక్టర్ గా ప్ర మోషన్ ఇచ్చారో అప్పుడే నా మొట్ట మొదటి ఇంటర్వ్యూ ఓ ఫిలిం వీక్లీ కి ఇస్తూ సెల్ల్యు లాయిడ్ సైంటిస్ట్ అని నామకరణం చేశాను. ఎందుకు చేశా నంటే ఓ సైంటిస్ట్ రకరకాల రసాయనాలు ఎంత మోతాదులో కలిపితే ఏ రకమైన కొత్త ఫార్ముల వస్తోందో ల్యాబ్ లో ప్రయోగాలూ చేస్తుంటాడు. దానికి భిన్నంగా నాగార్జున గారు సినిమా సెట్ లో బ్లాకు కాళ్ళ జోడు పెట్టుకుని కూర్చొని ఎవరిని పరిశీలి స్తున్నాడో మనకు కనపడదు. సెట్ ఎవరు వద్ద ఏమి టాలెంట్ వుందో గమనిస్తూ వుండేవారు. గమనించి కొత్త వారికీ అవకాసం ఇచ్చేవారు. ఆ విధం గా సినిమా ఇండస్ట్రీ అనే ల్యాబ్ లో కొత్త కొత్త ఫార్ముల (కొత్త డైరెక్టర్స్,రైటర్స్) కానీ పెట్టి న సీతా రాముల కళ్యాణం చూతము రారండి షూటింగ్ జరుగుతున్న టైములో నాగార్జున గారిని

సెల్ల్యు లాయిడ్ సైంటిస్ట్ గా పేర్కొనడం జరిగింది. అది 25 ఏళ్ళ తరువాత ఆయన చేసిన ప్రయోగాలూ తలుచుకుంటే ఆనందం వేస్తుంది. 25 ఏళ్ళ ప్రయాణం లో నాగార్జున గారి నమ్మకాన్ని ఇండియా అంతా షాక్ అయ్యే విదంగా వచ్చిన ప్రోడక్ట్ రామ్ గోపాల్ వర్మ ని నమ్మినందుకు నాగార్జున గారికి, రామ్ గోపాల్ వర్మ గారికి , చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక వర్గానికి నా శుభాకాంక్షలు."

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved