pizza
5K Run/Walk Competition in California
కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం శాక్రమెంటొలో దిగ్విజయంగా జరిగిన 5కె రన్/వాక్ పోటీ
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

17 April 2019
USA

స్థానిక “సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్వచ్ఛoద సంస్థ" నేతృత్వంలొ కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం శాక్రమెంటొలో శనివారం మార్చ్ 30 న 5కె రన్/వాక్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ 5కె రన్‌లో శాక్రమెంటో శివారు పాఠశాలల నుండి పెద్దఎత్తున విద్యార్థులు, పెద్దలు ఆనందంగా కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం మార్చ్ 30వ తేదీ ఉదయం 9.00 గం.కు 500మందికి పైగా పొటీదారులతో 5కె రన్‌ను భాస్కర్ వెంపటి, పద్మ ప్రియా మద్ది, అవినాష్ మద్ది, వందన శర్మ, మరియు వికాస్ కపాడియా, మరియూ "సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్వచ్ఛoద సంస్థ " ప్రతినిధులు మెయిదూ పార్కులో 5కె రన్/వాక్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో " సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్వచ్ఛoద సంస్థ" నిర్వహిస్థున్న పలు కార్యక్రమాల సహాయార్ధం ఈ 5కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి భాస్కర్ వెంపటి తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్ " సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్” స్వచ్ఛంద సంస్థ" కార్యక్రమాల అమలు గురుంచి కాలిఫోర్నియాలో తెలుగు వారికి అవగాహన కల్పించటంతోపాటు ఇక్కడి తెలుగువారికి వ్యాయామంపై కూడా అవగాహన కల్పించేందుకు శాక్రమెంటొ లొ 5కె రన్‌ను నిర్వహించినట్లు తెలిపారు. 5కె రన్ కారణంగా ఆనందం, ఆరోగ్యం సాకారం అవుతుంది అని భాస్కర్ వెంపటి అన్నారు. 5కె రన్ ద్వారా శరీరం, ఆరోగ్యంగా ధృడంగా ఉంటుందని, ప్రతిఒక్కరు ఆరోగ్య నియామాలు పాటించాలని ఆయన సూచించారు. సంకల్పబలం ఉండే ఏదైనా సాధించవచ్చునని ఆయన అన్నారు. 5కె రన్ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంగా పలువురు పొటీదారులు అభివర్ణించారు. అనంతరం 5కె రన్ కార్యక్రమంలో గెలుపొందిన వారికి నిర్వాహకులు మరియు రాక్లిన్ సిటీ కౌన్సిల్ మెంబెర్ “బిల్ హాల్డిన్” షీల్డ్స్ అందచేశారు. అదేవిధంగా 5కె రన్ వంటివి మరిన్ని జరపాలని పలువురు సూచించారు. సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తెలంగాణా రాష్ట్రంలో అష్టగుర్తి అనే గ్రామాన్ని దత్తతకు తీసుకొని అనేక సేవా కార్యాక్రమాలను నిర్వహించింది అని, అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామాన్ని త్వరలొ దత్తత తీసుకోనుందని భాస్కర్ చెప్పారు. యువకుల్లో సంఘంపట్ల బాధ్యత ను పెంపొందించదం, కుటుంబం పట్ల శ్రద్ధ, ఆరోగ్యం, వయోజన విద్య, సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేపట్టిందని భాస్కర్ చెప్పారు. మరిన్ని వివరాలకు సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వెబ్ సైటును సంప్రదించవలసిందని ఆయన సూచించారు : http://suvidhainternational.org/progress

ఈ కార్యక్రమానికి ఆర్దిక సహాయము చేసిన దాతలకు, రుచి ఇండియన్ రెస్టారెంట్, రిలయన్స్ సూపర్ మార్ట్, కీ బిజినెస్ సొల్యూషన్స్, టెక్ నెట్, పరోటాస్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్, సాన్ స్కృత్ న్యూ ఏజ్ ఇండియన్ రెస్టారెంట్, వై కే చలం 7 హిల్ల్స్ రియల్ ఎస్టేట్, సురేష్ నర్రా, శంకర్ పత్తి, విష్ మై ట్రిప్ ట్రావెల్స్, టాగ్స్, మనబడి, భావిన్ పారిఖ్ ఫామిలీ, మరియూ సాక్ దేశి. కాం కు భాస్కర్ ధన్యవాదాలు చెప్పారు. రన్ వార్మ్ ఆప్స్ చేసినందుకు దేశీ రిథమ్ సంస్థకు మరియు కార్యక్రమ ఫోటో సహకారం అందించిన “సై ఆప్టిక్ మీడియా” కు భాస్కర్ ధన్యవాదాలు చెప్పారు.

ఈ కార్యక్రమానికి “ఓవర్సీస్ వాలంటీర్స్ ఫర్ బెటర్ ఇండియా” మరియు “ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్” సంస్థలు సహకారము అందించాయి. కాలిఫోర్నియా శాక్రమెంటో లో 5 కె రన్ విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో విజయ్ భాస్కర్ జొన్నలగడ్డ, నటరాజన్ గుత్త, వెంకట్ నాగం, శ్రీకాంత్ గుర్రాల, నాగ్ దొండపాటి, సాయి మైలవరపు, ఉదయ్ రావులపల్లి, రాఘవ నారపురెడ్డి, నగేష్ చంద్ర, సుందర్ రాజన్, శ్రీకాంత్ యనమండ్ర, దీప్తి యనమండ్ర, రావు దురిశెట్టి , శ్రీనివాస్ నిట్టల, నాగేంద్ర పగడాల, రాగా గణేషన్, గాయత్రి గణేషన్, కేయూష్ షా, శ్రీనివాస్ ఈర్పిన, కృష్ణ బాచిన, ఆనంద్ ముదలాపూర్ , సిద్ధారెడ్డి, లలితా వేదుల, వెంకట సుబ్బారావు, అనిల్ గోదాసాని, బాల, ఈమాన్ యార్లగడ్డ, కిరణ్ భట్, శ్రీకాంత్ పొట్లూరి, నాగ లక్ష్మి కొంచాడ, తారాచంద్, నవీన్ కుమార్ గుండు, అవినాష్ గుస్సాయిన్, ఫాల్స్o మనబడి, రొజ్ విల్ మనబడి కార్యకర్తలు, మరియూ వై కే చలం తదితర కార్యకర్తలు ఉన్నారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved