pizza
Meet & Greet with AP CM Chandrababu Naidu in New Jersey
అమెరికాలో ఏపీ సీఎం కు ఘన స్వాగతం
నెవార్క్ లో చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్
భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

24 September 2018
USA

అమెరికాలో ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్ జే.ఎఫ్ .కె. ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకుంటున్నారనే సమాచారంతోనే వందలమంది న్యూయార్క్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నాట్స్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్, డా. రవి వేమూరి, కోమటి జయరాం, సతీష్ వేమన, జై తాళ్లూరి తదితర ప్రముఖులతో పాటు చాలామంది ఎయిర్ పోర్టుకు చేరుకుని చంద్రబాబుకు పుష్ఫగుచ్చాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు..
సాయంత్రం నెవార్క్ లోని ఎన్ జె ఐ టి వెల్నెస్ & ఈవెంట్స్ సెంటర్ లో జరిగిన మీట్ & గ్రీట్ సమావేశానికి 4 వేలకు పైగా అభిమానులు కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. చంద్రబాబు తొలుత మావోల దాడిలో మృతిచెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణల సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం, దీప ప్రజ్వలన చేసి ఎన్ టి ఆర్ విగ్రహావిష్కరణ చేశారు.

నాట్స్ బోర్డు డైరక్టర్ మన్నవ మోహనకృష్ణ, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్, డా. రవి వేమూరి, కోమటి జయరాం, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, CM రమేష్, వరదాపురం సూరి, జై తాళ్లూరి, శ్రీనివాస్ గుత్తికొండ, శ్రీనివాస్ మంచికలపూడి, సతీష్ వేమన తదితరులు చంద్రబాబు తో సభా వేదికపై ఆసీనులయ్యారు.

నేటికి సరిగ్గా 20 సం. ల క్రితం హై టెక్ సిటీ కి పునాదులు వేశామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రవాసభారతీయులందరికీ ఓటు హక్కు రాబోతోంది.అంచేత అందరూ ఓటు హక్కు వినియోగించుకుని తెలుగుదేశం పార్టీ ని గెలిపించమని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఎన్.ఆర్.ఐ టీడీపీ ని ప్రారంభిస్తున్నట్టు అభిమానుల హర్షధ్వానాల మధ్య చంద్రబాబు తెలియచేసారు. మన తెలుగు వారి సమర్థత, తెలివితేటలు ప్రపంచానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. ప్రపంచంలో అనేక పెద్దపెద్ద కంపెనీలు సంపాదించిన డబ్బును తిరిగి చారిటీ ద్వారా ఖర్చు పెడుతున్నారు. ప్రవాసాంధ్రులు కూడా అదే బాటలో నడవలాన్నారు. రాష్ట్రంలో మళ్లీ నువ్వే అధికారంలోకి రావాలని నేడు కోరుకునే పరిస్థితికి వచ్చారు. నేను రాత్రింబవళ్లు కష్టపడేది మీ కుటుంబంలో ఆనందం చూసేందుకే అనేది గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీపైనా అభిమానం ఉండే ప్రతిఒక్క వ్యక్తి రియల్ టైంలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్‌ఐ వింగ్‌లో చేరాల్సిన అవసరం ఉంది. దీంతో మీకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం వస్తోంది జూయిష్ కమ్యూనిటీలా నే తెలుగువారు కూడా ఆర్ధికంగా అభివృద్ధి పథం లో సాగాలని ఆకాంక్షించారు.

అమెరికాలో మన తెలుగువారు అద్భుతంగా రాణిస్తున్నారని.. మీ శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు ఎంతో కొంతైనా స్వరాష్ట్రానికి వినియోగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రియల్ టైమ్ గవర్నన్స్ ద్వారా పాలనలో సాంకేతికతను తీసుకొచ్చి.. ప్రజలకు పాలన మరింత చేరువ చేయగలిగామన్నారు. అవినీతిని నియంత్రిస్తున్నామని తెలిపారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారుతున్న ఈ సమయంలో మీరు మన ఆంధ్రప్రదేశ్ కోసం ఇక్కడ నుంచే ఎన్నో అద్భుతాలు చేయవచ్చని తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని.. పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన రాష్ట్రమని చంద్రబాబు తెలిపారు. ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా బీమా పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరూ నా రాష్ట్రానికి, నా ఊరుకు నేనేం చేయగలను అని ఆలోచిస్తే.. ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతి పథంలోకి దూసుకుపోతుందన్నారు. అమెరికాలో ఉండే తెలుగువారంతా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఉండాలని ఆయన అభిలాషించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన న్యూజెర్సీ వేదికగా అమెరికాలో ఉండే తెలుగువారికి పిలుపునిచ్చారు. ఇప్పటికే అమెరికాలో వ్యాపార రంగంలో రాణిస్తున్న వారు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలన్నారు. మీ సొంత ఊరిలో మీరు పెట్టుబడి పెట్టి.. ఆ ఊరి అభివృద్ధికి కూడా దోహదపడవచ్చన్నారు. జన్మభూమి రుణం తీర్చుకునే తరుణం మీకు వచ్చిందని.. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

మన్నవ మోహనకృష్ణ, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్ ల ఆర్ధ్వర్యం లో నిర్వహింపబడ్డ ఈ సభకు ఇండియా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సి.యం. రమేష్ అమెరికా లోని ఇతర రాష్ట్రాల నుండి పలువురు ఎన్.ఆర్.ఐ టీడీపీ అభిమానులు హాజరై మళ్ళీ నువ్వే రావాలి, మళ్ళీ నువ్వే రావాలి అంటూ చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మార్మ్రోగిపోయింది.
చివరిగా మీ ఓటు ఎవరికీ అంటూ ఉత్తేజ పరిచగా, అందరూ తెలుగుదేశానికి అంటూ విజయకేతనం గా విక్టరీ సింబల్ చూపించారు. చంద్రబాబు తో సెల్ఫీలు దిగేందుకు ప్రవాస భారతీయులు పోటీపడ్డారు.



 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved