pizza
NATS Reward Card Launch in New Jersey
నాట్స్ రివార్డ్ కార్డ్..! అమెరికాలో తెలుగువారికి ఓ వరం !!
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

29 April 2016
Hyderabad

మన్విల్లె, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు సంఘాల చరిత్రలో నాట్స్ మరో కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా లో ప్రతి తెలుగువారికి ఆత్మీయనేస్తంలా మారిన నాట్స్ ఇప్పుడు వారికి ఆర్థికంగా కూడా ఎంతో కొంత దోహదపడేలా నాట్స్ రివార్డ్ కార్డ్ ను ప్రవేశపెట్టింది. న్యూజెర్సీలోని మన్విల్లె - రిథమ్స్ లో 'నాట్స్ - రివార్డ్ కార్డ్' ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నాట్స్ కార్యదర్శి రమేష్ నూతలపాటి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నాట్స్ రివార్డ్ కార్డ్ ప్రత్యేకతలు.. విశేషాలను నాట్స్ నాయకులు వివరించారు. తెలుగు సంఘాలంటే ఆట పాటలే కాదు.. ఆదుకోవడం. అండగా నిలబడటం అని ఇప్పటికే నిరూపించిన నాట్స్.. ఇప్పుడు ఆర్థికంగా కూడా నాట్స్ సభ్యులకు సహకరించాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే నాట్స్ రివార్డ్ కార్డును రూపొందించిందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ మాజీ ఛైర్మన్ డాక్టర్. మధు కొర్రపాటి అన్నారు. అమెరికా లోని అన్ని రాష్ట్రాలలోనే కాకుండా, భారత దేశం లో కూడా ఈ రివార్డ్ కార్డు విస్తృత వినియోగం లోకి రానుంది. ఇప్పటికే అనేక వ్యాపార సంస్థలు.. నాట్స్ రివార్డ్ కార్డుపై డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని..భవిష్యత్తులో మరిన్ని సంస్థలు కూడా ఈ జాబితాలో చేరనున్నాయని నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ అన్నారు. గత కొన్నేళ్లుగా రివార్డ్ కార్డ్ ప్రతిపాదన ఉందని.. అయితే అది ఇప్పటికి సాకారమైందని.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని నాట్స్ ఛైర్మన్ శ్యాం మద్దాళి అన్నారు. అమెరికాలో తెలుగు సంఘాల చరిత్రలో వైద్య శిబిరాలతో సేవాపథంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నాట్స్ ఇప్పుడు కూడా రివార్డ్ కార్డుతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గంగాధర్ దేసు తెలిపారు. గివింగ్ బ్యాక్ టూ సొసైటీ అనేది ప్రతిసారీ చెప్పటమే కాదు... చేతల్లో కూడా చూపుతున్న నాట్స్ ఇప్పుడు తన సభ్యులకు కూడా తాము ఖర్చు పెట్టే దానిలో ఎంతో కొంత తిరిగి వచ్చేలా ఈ రివార్డ్ కార్డ్ రూపొందించిందని బసవేంద్ర సూరపనేని వివరించారు.

Food &Restaurants:

Travel Agents:

Bawarchi  Jersey City, NJ

DyNex Travel (Domestic and International flight bookings)

Nalabheema Dawath, Edison, NJ

http://www.dynextravel.com/

Crepes  Celestas, Menlo park Mall, Edison, NJ

 

Bawarchi Edison, NJ

 Pharmacies:

Abhiruchi, North Brunswick, NJ

Heights Pharmacy

https://avakaya.com/ (Homefoods), Edison, NJ

Greene Pharmacy

Desi Chef - Desi Bazar - NJ

Neighbor Care Pharmacy

 Dakshin Restaurant, Edison, NJ

 

 

 

Attorneys:

INSURANCE

Sunitha Krosuri

NY Life

Srinivas Jonnalagadda

Farmers Insurance

 

 

CPAs:

Cars and Auto Services:

SVEK Financial Services

Euro& Asia Auto services -  Sunoco Auto services

H1 Tax Services, Edison, NJ

 

 

 

Training Institutes:

Dresses and Apparels

Dynex Tech (Training and support in all technologies)

Amogha Apparels

http://www.dynextech.com/

 

 

 

కేవలం 50 డాలర్లతో అటు నాట్స్ రివార్డ్ కార్డుతో పాటు .. నాట్స్ జీవిత కాల సభ్యత్వం లభిస్తుందని నాట్స్ తెలిపింది. కేవలం వ్యాపార సంస్థల్లో డిస్కౌంట్లకే ఈ రివార్డ్ కార్డు పరిమితం కాదని... అమెరికాలో తెలుగువాడికి ఏ కష్టమోచ్చినా నాట్స్ మాకు అండగా ఉందనే భరోసా ఈ కార్డు ద్వారా లభించనుందని నాట్స్ ప్రకటించింది. కోటి ఆశలతో తెలుగునేల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులకు సైతం ఈ కార్డు ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. అమెరికాలోని ప్రతి తెలుగువాడి దగ్గర ఈ నాట్స్ రివార్డ్ కార్డు ఉండాలనే అకాంక్షతో నాట్స్ అడుగులు వేయనుందని నాట్స్ నాయకుల తో పాటు రివార్డ్ కార్డ్ ను ఆవిష్కరించిన గజల్ శ్రీనివాస్ ప్రకటించారు. నాట్స్ రివార్డ్ కార్డ్ ఆవిష్కరణ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్ 'నాన్న' పై రెంటాల వ్రాసిన గజల్ పాడి సభికులను తమ తండ్రితో తమకున్న అనుభూతిని నెమరు వేసుకునేట్టు చేసారు. స్థానిక కళాకారులు ప్రసాద్, సుందరి తదితరులు పాటలు పాడి అలరించారు. 600 మందికి పైగా
తెలుగు వారు హాజరైన , ఈ సమావేశం లో 300 మంది క్రొత్తగా నాట్స్ సభ్యులుగా నమోదై తమ నాట్స్ రివార్డ్ కార్డులను సొంతం చేసుకున్నారు.
ఈ ఈవెంట్ స్పాన్సర్ షిప్ కు ముందుకొచ్చిన వారందరిని న్యూజెర్సీ నాట్స్ కో ఆర్డినేటర్ వంశీ కృష్ణ వెనిగళ్ళ అభినందించారు. అటు రివార్డు కార్డుపై డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన వ్యాపారస్థులను నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి సత్కరించారు. ఇంత పెద్ద ఈవెంట్ కు భోజన సదుపాయాలను అందించినందుకు జెర్సీసిటీ బావర్చి రెస్టారెంట్ యాజమాన్యాన్ని నాట్స్ అభినందించింది. రంజిత్ చాగంటి వందన సమర్పణతో ఈ సభ ముగిసింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved