pizza
Silicon Andhra ManaBadi Natakotsavam
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

22 June 2017
USA

సిలికానాంధ్ర మనబడి బాలల నాటకోత్సవం అనే మరో అద్భుతానికి తెరతీసింది. ప్రవాస బాలలకు తెలుగు నేర్పించడమే కాకుండా మన సంస్కృతిని అలవరిచే క్రమంలో మరో అద్భుత ఆవిష్కరణ ఇది. ఎంతో ప్రఖ్యాతమైన నాటిక అనే కళాప్రక్రియను బాలలకు పరిచయం చేయడం ద్వారాఆ ప్రక్రియ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందనే ఉద్దేశ్యంతో ఉన్న మనబడి విద్యార్ధులకు ఈ నాటిక  పోటీలు నిర్వహించింది. ముందుగా ప్రాంతాల వారిగా ఆన్ లైన్(అంతర్జాలమాధ్యమం) ద్వారా  వచ్చిన నాటికలను పరిశీలించి,  జాతీయపోటీలకోసం క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పీటస్ నగరానికి  వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధి బృందాలను ఆహ్వానినిచింది మనబడి.  

 మిల్పీటస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలోని వేదికపై వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మనబడి విద్యార్ధి బృందాలు చేసిన నాటక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముద్దు ముద్దుగా వారు పలుకుతున్న సంభాషణలురాగయుక్తంగా ఆలపించిన పద్యాలుపాటలుమన పౌరాణికచార్తిత్రకపాత్రల వేషధారణలతో ఆ పిల్లల సందడి.. తెలుగు భాషసంస్కృతిసంప్రదాయాలను వెలుగు దివిటీ పట్టి ముందుకు నడిచే సారధులుగా వీరే అని చాటారు. సాయి కందుల ఆధ్వర్యంలో తెలుగుతనం ఉట్టిపడేలాఅత్యంత సుందరంగా అలంకరించిన ఆ ప్రాంగణం అందరినీ ఆకట్టుకుంది. 

 ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగానాటిక పోటీల న్యాయనిర్ణేతగా విచ్చేసినప్రఖ్యాత  నట శిక్షకులు దీక్షిత్ మాష్టారుచిన్నారుల ప్రతిభ చూసి అచ్చెరువొందారు. మాతృదేశానికి ఇంత దూరంగా ఉన్నాతెలుగు భాష పట్ల మన కళల పట్ల ఈ పిల్లలకున్న మక్కువవారి పట్టుదలప్రదర్శనలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందనిఈ అద్భుతానికి కారణం సిలికానాంధ్ర మనబడి అని ఆయన అన్నారు. న్యూజెర్సీమసాచుసెట్స్సదరన్ క్యాలిఫోర్నియా మరికొన్ని రాష్ట్రాలనుని బృందాలుగా వచ్చిన విద్యార్ధులుఉపాధ్యాయులుతల్లితండ్రులతో ఆదివారం నాడు దీక్షిత్ మాస్టారు తో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో, , తమ నటన మెరుగుపరుచుకోవడానికి ఈ చిన్నారులు తెలుసుకోవలసిన ఎన్నో విలువైన విషయాలనుఅందుకు చేయవలసిన వివిధ అంశాలను ఎంతో చక్కగా వివరించారు. దీక్షిత్ గారి అనుభవాన్నినాటకరంగ పరిజ్ఞానాన్నియువతకు అందించడానికి  సోమవారం నుండి శుక్రవారం వరకు  యువతీ యువకులకోసం మరో నటశిక్షణా శిబిరం నిర్వహించామని మనబడిఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకుబృందాలకునాటికలకుదర్శకులకు దీక్షిత్ గారితో పాటుమరో విశిష్ట అతిధిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల గారు బహుమతులను అందజేసిమనబడి చేపట్టే కార్యక్రమాలనుచిన్నారుల ప్రతిభాపాటవాలనుతనదైన చమత్కారం తో కూడిన కవితాత్మకంగా ప్రశంసిస్తూఆశీర్వదించిసభాసదులను ఉత్తేజపరిచారు.  మనబడి నాటకోత్సవం లో విద్యార్ధుల ప్రదర్శనలు చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్తనటులు శ్రీ రఘు మల్లాది ప్రతి సంవత్సరంసీనియర్ మరియు జూనియర్ విభాగాలలో  ఉత్తమ ప్రదర్శన బహుమతి విజేతలైన జట్లకు 1116 డాలర్ల నగదును 'మల్లాది పురస్కారంపేరిట అందించనున్నట్టు ప్రకటించిఈ సంవత్సర పురస్కారాన్ని అక్కిడికక్కడే విజేతలకు అందించారు. తెలుగు భాషతో పాటు మన కళలుసంస్కృతిని పిల్లలకు నేర్పే మనబడి కి అమెరికా వ్యాప్తంగా WASC గుర్తింపు లభించిందని, 2017-18 సంవత్సర ప్రవేశాలు(అడ్మిషన్లు) ప్రారంభమైనాయిమరిన్ని వివరాలకు మరియు నమోదు చేసుకోడానికి manabadi.siliconandhra.org చూడవచ్చని మనబడి అద్యక్షులు రాజు చమర్తి తెలిపారు.  సెప్టెంబరులో మనబడి తరగతులు 250 కేంద్రాలలో ప్రారంభమౌతాయి.

 అన్ని కేంద్రాలతో కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి గత నెలలుగా ముందుండి నడిపించిన రాజు చమర్తిదీనబాబు కొండుభట్లతనకు సహకరించిన జయంతి కోట్నిమాధవి కడియాలరవీంద్ర కూచిభొట్లదిలీప్ కొండిపర్తికిరణ్ పారుపూడివంశీ నాదెళ్ల నాటకోత్సవ బృందంఎంతో కృషి చేసారనిఅదేవిధంగా నాటకోత్సవంలో పాల్గొన్న మనబడి విద్యార్ధులువారి తల్లి తండ్రులకుఉపాధ్యాయులకుకో-ఆర్డినేటర్లకుదర్శకులున్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రవీంద్ర కూచిభొట్లమాధవ కిడాంబిభారత దేశం నుంచి సహకరించిన వెంకట్ మాకిన లకు కార్యక్రమ నిర్వహణ బృంద నాయకురాలు స్నేహ వేదుల ధన్యవాదాలు తెలిపారు.    

                          ​​WINNERS LIST :​

 Junior Level 

1 Best Team - "Telugu Velugu", Loiusville, KY Directed by Anil Ganteti & Saraswati Thutupalli
2 Best Director - "Gurudevo Bhava", Walpole MA Deepti Gora


Best Actors
a Janapada Kalalu - Budabakhalavadu - Vinesh Nagavelli, Princeton NJ
b Janapada Kalalu - Harikathakuralu - Vaishnavi Koritala, Princeton NJ
C Janapada Kalalu - Burrakathakuralu -  Kirthi Gummadi, Princeton NJ
d Gurudevo Bhava - Dronudu - Niboth Jogam, Walpole MA
e Telugu Velugu - Narududu -  Shriyans Boya, Loiusville KY

Senior Level
1 Best Team - Sisupala Vadha, Princeton NJ Directed by Ratna Veta, Srinivas Koritala, Rajeswari Ramanand & Srividya Manikonda
2 Best Director - Sisupala Vadha, Princeton NJ Ratna Veta, Srinivas Koritala, Rajeswari Ramanand & Srividya Manikonda


Best Actors
a Sisupala Vadha - Sisupaludu - Pranav Sriharinarayana Manikonda, Princeton NJ
b Prahalada Charitram - Pedda Prahaldudu - Amrutha Mummidi , San Antonio TX
c Prahalada Charitram - Chinna Prahaldudu - SriTanvi Sai Kota, San Antonio TX
d Prahalada Charitram - Hiranyakasyapudu - Venkat Sisir Bhardwaj Inagandla, San Antonio TX

e Ramakrishna Vijayam - Alasani Peddanna - Aamani Indraganti, Hollywood CA​


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved