pizza
​ManaBadi Telugu Maatlata National Finals in Dallas
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

31 August 2015
Hyderabad

డాలస్: సిలికానాంధ్ర మనబడి సంస్థ అమెరికా లోని తెలుగు పిల్లలకోసం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు మాట్లాట పోటీలు డాలస్ మహానగరంలో 2015 సం|| సెప్టెంబర్ 5-6 తేదీలలో జరగనున్నాయి. డాలస్, అట్లాంటా, డెట్రాయిట్, చికాగో, లాస్ ఏంజెల్స్, సియాటిల్, సాన్ డియేగో, పోర్ట్ లాండ్ నగరాలనుంచి, ఉత్తర కరొలినా లోని క్యారీ, న్యూ జెర్సీ లోని ఎడిసన్, వర్జీనియా లోని చాంటిలీ, కనెక్టికట్ లోని న్యూయింగ్టన్, ఇలినాయ్ లోని బ్లూమింగ్ టన్, క్యాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ పట్టణాల నుంచి 46 మంది చిన్నారులు "పదరంగం" మరియు "తిరకాటం" పోటీలలో పాల్గొంటున్నారు. ఐదు నుంచి తొమ్మిదేళ్ళ వరకు వయసు గల పిల్లలు "బుడతలు" విభాగంలోనూ, పది నుంచి పదమూడేళ్ళ వయసు గల పిల్లలు "సిసింద్రీలు" విభాగంలోనూ తమ తెలుగు భాషా పటిమను, కౌశలాన్ని ప్రదర్శించనున్నారు. ఈ పోటీలలో గెలిచిన వారికి ప్రశంసా పత్రాలతోబాటు ప్రథమ స్థానం వారికి $1,116 డాలర్లు, రెండవ స్థానం వారికి $751 డాలర్లు అందిస్తారు.

2015 లో ఏప్రిల్ నుండి జులై నెలల్లో అమెరికాలోని 18 కేంద్రాలలో జరిగిన తెలుగు మాట్లాట ప్రాంతీయ పోటీలలో దాదాపు 1000 మంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొనగా, అందులో నెగ్గిన పిల్లలు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అర్హత పొందినారు. మనబడి విద్యార్థులే కాక, అమెరికాలో చదువుకుంటున్న ఏ పిల్లలైనా ఈ పోటీల్లో పాల్గోనగలగడం ఒక విశేషం.

ఈ పోటీలలో పాల్గొనబోయే పిల్లల పేర్లు:

అగస్త్యరాజు స్నిగ్ధ
ఇలి వివేక్
కసవరాజు తన్మయ్
కస్తూరి ప్రణవ్
కాసు వర్ణిక
కునపులి శశిధర్
కొండగుంట రాహుల్
కొలిచిన హర్ష
కొల్ల మనస్వి
కొవ్వూరి సౌమ్య
కోమటిరెడ్డి రియా
కోమటిరెడ్డి సమీక్ష
గంజి విధ
గంజి విభ
గుండ్లపల్లి ఋత్విక్
ఘంటసాల శ్రీ వైష్ణవి
చతుర్వేదుల మహిత
చిట్టి మహతి
తుమ్మూరు తేజస్విని
తుమ్మూరు హిమజ
తెల్లాప్రగడ శ్రావణి
దేవరసెట్టి వసుధశ్రీ
నల్లద్ధిఘల్ శ్రీవిద్య
నాలం హర్షవర్ధన్
నిడమర్తి ధృవ సాయి
పంత్రా యశ్వంత్
పాలూరి లలితా
పెద్దింటి శ్రీమయి
బొడ్డు మేధ
మంగిపూడి సిద్దేష్
మండల గౌతం
మణికొండ ప్రణవ్
మనం తరుణీ
మహంకాళి అదితి
మహంకాళి అన్విత
మాదిరెడ్డి సంస్కృతి
మేడూరి ఆర్ణవ్
రెడ్డి షరిత
వాయుగండ్ల స్నేహ
వొబ్బిలిశెట్టి రశ్మి
శివదేవుని విరాజ్
సిరివూరి కౌశిక్
సురుభోట్ల సుమేధ
సూరి మహతి
సొలాస అభినవ్
సొలాస సాకేత్

సిలికానాంధ్ర మనబడి: "భాషాసేవయే భావితరాల సేవ" అనే నినాదంతో సిలికానాంధ్ర సంస్థ 2007 లో మొదలుపెట్టిన "మనబడి" కార్యక్రమం అమెరికా లోని 35 నగరాలలోనే కాక ఇంగ్లాండ్, హాలెండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, హాంగ్ కాంగ్ తదితర 13 దేశాలలో, మొత్తం కలిపి 4300 పైగా విద్యార్థులతో ఒక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఏడు తరగతుల్లో తెలుగు బోధన, ప్రతీ మూడు నెలలకూ పరీక్షలు, ఉత్తీర్ణతా ప్రమాణాల తులనలతో నిర్దిష్టంగా మనబడి పాఠ్యప్రణాలిక ఏర్పాటు చేయబడింది. భారతదేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా రెండు స్థాయిలలో తెలుగు పరీక్షలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ తెలుగు భాషా నైపుణ్య పట్టాలు అందజేస్తున్నది. మరో పక్క అమెరికా లోని ఉన్నత పాఠశాలల్లో ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ వంటి ఇతర ప్రపంచ భాషలకు సాటిగా తెలుగు కూడా నేర్పించగలిగేట్టుగా "ప్రపంచ భాష" గుర్తింపు తీసుకురావడానికి మనబడి కృషి చేస్తోంది. రాబోయే విద్యా సంవత్సరంలో దాదాపు వెయ్యి మంది భాషాసైనికుల స్వచ్ఛంద సేవలతో ఐదువేల మంది పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా చక్కని తెలుగు నేర్పించడానికి సిద్ధమవుతున్న సిలికానాంధ్ర సంస్థ చేపట్టిన తెలుగు మాట్లాట పోటీలు మనబడి విద్యార్థులకే కాక తెలుగు తెలిసిన ఏ పిల్లలకైనా సరే ఆహ్వానం పలుకుతున్నాయి. మరిన్ని వివరాలకు [email protected] కు ఈమెయిలు ద్వారా సంప్రదించగలరు.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved