pizza
డాలస్ లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

26 November 2014
Hyderabad

అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్...డాలస్ లో ఘనంగా బాలల సంబరాలను నిర్వహించింది. ప్రతి యేటా ఓ సంప్రదాయంలా నిర్వహించే ఈ నాట్స్ బాలల సంబరాలకు డాలస్ లోని ఫార్మర్స్ బ్రాంచ్ లోని సెయింట్ మేరీ చర్చ్ ఆడిటోరియం వేదికగా మారింది. దాదాపు ఆరు గంటల పాటు సంతోష సంబరాలను తెలుగువారికి పంచిన ఈ బాలల సంబరాల్లో దాదాపు 200 మందికి పైగా బాల బాలికలు ఉత్సాహంగా ఫాల్గొన్నారు. బాలల సంబరాలను పురస్కరించుకుని శాస్త్రీయ, సాధారణ సంగీతం, డ్యాన్స్, చదరంగం, తెలుగు పదకేళి ఇలా అనేక అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. పదేళ్లలోపు, పదేళ్లపైన ఉన్న చిన్నారులు ఈ పోటీల్లో పిల్లలు తమ ప్రతిభను చూపెట్టారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించారు. భారత దేశం లో జరిగే చాచా నెహ్రు దినోత్సవాన్ని ఇక్కడి పిల్లలకు పరిచయం చేస్తూ మన దేశ ఔన్నత్యాన్ని, నాయకత్వ లక్షణాలను భావి తరాలకు అందించే విధంగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ఫాదర్స్ డే , మదర్స్ డే అంటూ జరిపే అమెరికన్ వాతావరణం లో పిల్లల కోసం బాలల సంబరాలు నిర్వహించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని వక్తలు ప్రశంసించారు.

బాలల సంబరాల నిర్వహణలో నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, వీణా యలమంచిలి, రాజేంద్ర మాదాల, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ విజయ్ వెలమూరి, శ్రీనివాస్ కోనేరు, శ్రీనివాస్ బావిరెడ్డి, డాలస్ చాప్టర్ కార్య నిర్వాహకులు శ్రీనివాస్ కావూరు , కార్యవర్గ సభ్యులు శ్రీలు మండిగ, చైతన్య కంచెర్ల, సురేంద్ర ధూళ్లిపాళ్ళ, కృష్ణా వల్లపరెడ్డి, రామకృష్ణ మార్నేని, అపర్ణ వెలమూరి, అభి, రామకృష్ణ నిమ్మగడ్డ, అనంత్ మల్లవరపు, శ్రీనాథ్ జంధ్యాల, శిరీష బావిరెడ్డి, అజయ్ గోవాడ, రాజ్ గొంది, భాస్కర్ రాయవరం ఇతర కార్య వర్గ సభ్యులు తమ పూర్తి సహయ సహకారాలు అందించారు.

స్థానిక బావర్చి ఫ్రిస్కో, సాఫ్ట్ స్కూల్స్.కాం, రెక్స్ ప్రోగ్రామింగ్ & హైదరాబాదీ హౌస్ ఈ కార్యక్రమణ నిర్వహణకు తమ సహాయాన్ని, యువ తెలుగు రేడియో, టీవీ 9, దేశిప్లాజా, రేడియో ఖుషి, 6 టీవీ, టీవీ 5 మీడియా సహకారాన్ని అందించారు. ఇంకా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం తరఫున విజయ్ మోహన్ కాకర్ల, డాక్టర్ ఉరిమిండి నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

ఈ కార్యక్రమం లో ఔత్సాహికులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించటమేగకుండా, ఇక్కడ నివసించే ప్రవాసాంధ్ర పిల్లల కొరకు నాట్స్ గత కొన్ని సంవత్సరాలు నుండి బాలల సంబరాలు కార్యక్రమం ద్వారా చేస్తున్న కృషిని ప్రశంసించారు.

డాల‌స్ నాట్స్ బాల‌ల‌ సంబ‌రాల పోటీల్లో విజేత‌లైన వారి వివరాలు:

 పోటీ అంశం                                          ప్రధమ విజేత                             ద్వితీయ విజేత                తృతీయ విజేత 
శాస్త్రీయం సంగీతం - గీతాలు                   వరుణ్ గుండా                           శ్రీనిధి మహదేవన్              అద్వైత్ అయ్యర్ 
శాస్త్రీయం సంగీతం - వర్ణాలు                  మానస వెలమురి                       అనీష కందికొండ               మైత్రేయి అబ్బూరు 
శాస్త్రీయం సంగీతం - కీర్తనలు - కృతులు   శ్రీ రాగిణి ఘంటసాల                    సంహిత బండారు               భారతి కాల్డ్వెల్ 
నాన్ క్లాసికల్ పాటలు                          అఖిల్ ములుకుట్ల                      శ్రేయ కోడెల                     భారతి కాల్డ్వెల్ 
శాస్త్రీయ నృత్యం  (గ్రేడ్ 1-5)                   శ్రీ హిరణ్య ఆకారపు                     వైష్ణవి పోరూరి                  రేవంత్ కాజ 
శాస్త్రీయ నృత్యం  (గ్రేడ్ 6-10)                శ్రీ రాగిణి ఘంటసాల                      సుమన్ వడ్లమూడి           హంసిక మైథిలి గొర్తి 
నాన్ క్లాసికల్ డాన్స్ (గ్రేడ్ 6-10)            అపూర్వ బాలకవి                        
తెలుగు ప‌ద‌కేళి  (గ్రేడ్ -4)                   హిమజ తుమ్మూరు                     యశిత చుండూరు             నిఖిత దాస్తి 
తెలుగు ప‌ద‌కేళి  (గ్రేడ్ 5-8)                 తేజస్విని తుమ్మూరు                  మానస వెలమురి             శ్రీ హర్షిణి ఆకారపు

.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved