pizza
NATS Deepavali sambaralu
చికాగోలో దీపావళి వేడుకలను నిర్వహించిన నాట్స్
సంబరాలకు సన్నాహాకంగా కిక్ ఆఫ్ ఈవెంట్
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

21 November 2018
USA

ఏ దేశమేగినా ఎందుకాలిడినా మన సంప్రదాయాలను పరిరక్షిస్తూ .. వాటిని పాటించేలా ప్రోత్సహిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ చికాగోలో దీపావళి వేడుకలను నిర్వహించింది. నాట్స్ చికాగో చాప్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహ భరితంగా జరిగింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఆచరించడంతో పాటు దీపావళి పూజలు, వంటలు, తెలుగు ఆట, పాట.. ఈ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచాయి. దాదాపు 400 మంది తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు. కోశాధికారి మదన్ పాములపాటి నాయకత్వంలో చికాగో నాట్స్ టీం... కమిటీని అతిధులకు మదన్ పరిచయం చేసారు. సంబరాలకు చేస్తున్న ఏర్పాట్లను సంబరాల కమిటీ ఇందులో ప్రధానంగా చెప్పుకొచ్చింది. సంబరాలకు సన్నాహకంగా కూడా జరిపిన ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కు చికాగో నాట్స్ టీం మంచి ఆతిథ్యాన్ని ఇచ్చింది. సంబరాలకు మేము సైతమంటూ ముందుకొచ్చి చికాగో నాట్స్ చాప్టర్ సభ్యులు సంబరాల కమిటీకి మరింత ప్రోత్సాహామిచ్చారు. సంబరాలకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలు.. నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అమెరికాలో తెలుగువారికి ఒక్కటి చేసేలా నాట్స్ జరిపే అమెరికా తెలుగు సంబరాలకు అమెరికాలో ఉండే ప్రతి తెలుగు వ్యక్తి కదిలిరావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అమెరికా తెలుగుసంబరాలను దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని 2019 తెలుగు సంబరాల కమిటీ ఛైర్మన్ కిషోర్ కంచర్ల కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి రాజేంద్ర మాదాల, శివ మామిళ్లపల్లి తదితరులు పాల్గొన్నారు. చికాగో టీం నుంచి మహేష్ కాకర్ల, మూర్తి కొప్పాక, శ్రీనివాస్ పిడికిటి, రాజేష్ వీధులమూడి తదితరులు సంబరాలకు అందిస్తున్న మద్దతుపై సంబరాల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చాప్టర్ కోఆర్డినేటర్ గా నియమియుతులైన శ్రీధర్ ముమ్మనగండి తన టీం ను అందరికీ పరిచయం చేశారు. ఆర్.కె. బాలినేని, శ్రీనివాస్ బొప్పన, విజయ్ వెనిగళ్ల, వెంకట్ యలమంచిలి, వాసు బాబు ఆడిగడ, రవి శ్రీకాకుళం, లోకేష్ కొసరాజు, కృష్ణ నిమ్మగడ్డ, కృష్ణ నున్న, మురళి కళగర, రామ్ తూనుగుంట్ల, లక్ష్మి బొజ్జ, రామ కొప్పాక , శ్రీనివాస్ పిళ్ళ, వెంకట్ తోట, కార్తీక్ మోతూకూరి, హరీష్ జమ్ముల, నరేంద్ర కడియల, కిరణ్ అంబటి, వెంకట్ దాములూరి, నిషాంత్ బొండా తదితరులు ఈ ఈవెంట్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ 2019 సంబరాల నిమిత్తం 100,000 డాలర్ల సమీకరణ బాధ్యతను చికాగో టీం భుజాన కెత్తుకుంది.

ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన స్వర్ణ ఉడతా కుటుంబానికి నాట్స్ హెల్ఫ్ లైన్ ద్వారా సేకరించిన 33 వేల డాలర్ల మొత్తాన్ని ఆ కుటుంబానికి నాట్స్ చెక్కు రూపంలో అందించడం జరిగింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved