pizza
*** తెనాలిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన *** వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు, మందులు ***
నాట్స్ మెడికల్ క్యాంప్ పై ప్రజా ప్రతినిధుల ప్రశంసల వర్షం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

19 January 2015
Hyderabad

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందడుగు వేసింది.. గుంటూరు జిల్లా తెనాలిలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. దాదాపు 15 వేలమందికి పైగా రోగులు ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందారు. దీంతో పాటు నాట్స్ ఉచితంగా మందులు కూడా పంపిణి చేసింది. ఎన్.ఆర్.ఐ హస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెగా మెడికల్ క్యాంప్ ను మాజీ మంత్రి, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అమెరికాలో తెలుగువారి మేలు కోసం పనిచేస్తున్న నాట్స్ .. స్వదేశంలో కూడా సేవలు అందించేందుకు ముందుకు రావడాన్ని ఆయన ప్రశంసించారు. నాట్స్ చేపట్టిన మెడికల్ క్యాంపుపై ఏపీ శాసనమండలి విప్ నన్నపనేని రాజకుమారి ప్రశంసల వర్షం కురిపించారు. జన్మభూమి కోసం నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని యావత్ యువతలోనే స్ఫూర్తి నింపుతుందని ఆమె కొనియాడారు.

నాట్స్ చేపట్టిన ఈ సమున్నత కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఎన్.ఆర్.ఐ హస్పిటల్స్ వ్యవస్థాపకులు ముక్కామల అప్పారావు అన్నారు. నాట్స్ మెగా హెల్త్ క్యాంప్ కు తెనాలిలో భారీ స్పందన లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచివేలమంది పేద రోగులు ఈ శిబిరానికి తరలివచ్చారు. శంకర్ నేత్రాలయ, ఎన్.ఆర్.ఐ హస్పటల్స్, ఏపీ ప్రభుత్వం వారి ఆయుష్ హాస్పిటల్స్, సన్ షైన్ హాస్పిటల్స్, గ్లో సంస్థ, సిబార్ డెంటల్ ఆసుపత్రులు ఈ మెగా వైద్య శిబిరంలో మేముసైతం అంటూ ముందుకొచ్చి ఉచిత వైద్య సేవలు అందించాయి.. ఇక్కడ రోగులకు ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత మందులు కూడా అందించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటితో పాటు బాడిగ శ్రీరామచంద్రమూర్తి, రవి రెడ్డి లాంటి అనేక మంది వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా గుండె, ఉదరం, మూత్ర పిండాలు, నరాలు, కీళ్లు, మనో సంబంధ వ్యాధులతో పాటు అనేక రోగాలకు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు.. దీని కోసం కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ, పెయిన్ మెడిసన్,న్యూరలాజికల్, ఇంటర్నల్ మెడిసన్, అంకాలజిస్ట్, అర్ధోపెడిక్, కార్డియాక్ సర్జరీ, సైకియాట్రిస్ట్ ,ఫిడియాట్రిక్ సెష్పలిస్ట్.. ఇలా ఎన్నో వైద్య రంగాల నిపుణులు, గంటి సూర్య ప్రకాష్, కొంద్రుగంట బుచ్చయ్య, సూరపనేని కృష్ణ ప్రసాద్, ముల్పూరు గౌతమ్, రవిశంకర్ రెడ్డి, అల్లాడ రాజశేఖర్, జొన్నలగడ్డ శ్రీనివాస్, నల్లూరి కోటేశ్వర రావు, కొండ్రగుంట స్నేహ, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ గంటి అరుణ, అల్లాడ రాజశేఖర్, నాట్స్ ఇండియా విభాగ ప్రతినిధులు రతీష్ అడుసుమిల్లి, కోట ప్రసన్న తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరానికి అమెరికా నుంచి వచ్చి వైద్య సేవలు, సహాయాలు అందించారు.

నాట్స్ ఉచితంగా పేద రోగులకు ఆరోగ్య పరీక్షలు చేయించి వైద్య సేవలు అందించడంతో పాటు దాదాపు రూ.46 లక్షల రూపాయల మందులను ఉచితంగా అందించింది. రోగులకు ఉచితంగా కూడా ఆహారాన్ని ఈ శిబిరంలో అందించారు.. అమెరికాలో ఆకస్మికంగా మరణించిన సాయి దొండపాటి కుటుంబానికి కూడా ఆర్థిక సాయాన్ని ఈ శిబిరంలో నాట్స్ అందించింది. దాదాపు రూ. 28 లక్షల చెక్కును నాట్స్ సాయి దొండపాటి కుటుంబానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఇప్పించింది.. మొత్తం మీద నాట్స్ మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం కావడంపై నాట్స్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భాషే రమ్యం..సేవే గమ్యం అని నినదించే నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా జన్మభూమిలో కూడా తన సేవ, చేతల్లో చూపించినందుకు గర్వంగా ఉందని నాట్స్ ప్రతినిధులు తెలిపారు.

 

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved