pizza
NATS Missouri Chapter anniversary celebrations
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

28 October 2015
Hyderabad

ఘనంగా నాట్స్ మిస్సోరి ఛాప్టర్ 3 వ వార్షికోత్సవం

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే నాట్స్ తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది.. నాట్స్ మిస్సోరి ఛాప్టర్ 3 వ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుంది. సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన ఈ వార్షికోత్సవ సంబరానికి దాదాపు 1000 మందికిపైగా తెలుగువారు పాల్గొన్ని సంతోషాన్ని పంచుకున్నారు. నాట్స్ మిస్సోరి ఛాప్టర్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహక బృందం తెలుగువిద్యార్ధులకు అనేక పోటీలు నిర్వహించింది. విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా ఈ పోటీలు జరిగాయి. యాక్ట్ ప్రాక్టీస్ టెస్ట్, మ్యాథ్స్ టెస్ట్, చదరంగం, కళా రంగాల్లో జరిగిన ఈ పోటీల్లో దాదాపు 200 మంది చిన్నారులు పోటీపడ్డారు. ఈ పోటీలో విజేతలతో పాటు ఉత్సాహంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ బహుమతులు అందచేసింది. వార్షికోత్సవ సంబరాన్ని కూడా నాట్స్ మిస్సోరి ఛాప్టర్ అద్భుతంగా నిర్వహించింది. నాట్స్ జాతీయ కార్యవర్గం నుంచి మోహన కృష్ణ మన్నవ, గంగాధర్ దేసు ఈ వార్షికోత్సవానికి హాజరయ్యారు. తెలుగువారికి నాట్స్ ఎలా అండగా నిలబడుతుందనేది వారు ఈ వార్షికోత్సవ సభలో వివరించారు. మిస్సోరి రాష్ట్రంలో నాట్స్ తన సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ ఎలా ముందుకు సాగుతుందనేది మిస్సోరి ఛాప్టర్ సమన్వయకర్త హరీందర్ గరిమల్ల తెలిపారు. మిస్సోరి చాప్టర్ లోని ప్రతి ఒక్క సభ్యుడి క్రుషి ఫలితంగానే ఈ ఛాప్టర్ పరిధి పెరుగుతోందన్నారు. నాట్స్ వస్తున్న ఆదరణతో తాము భవిష్యత్ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని.. సేవా కార్యక్రమాలను ముమ్మరం చేస్తామని నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ తెలిపింది. శ్రీనివాస్ మంచికలపూడి, డాక్టర్ సుధీర్ అట్లూరి, వైఎస్ఆర్ కే, కుమార్, నాగ తదితరులు నాట్స్ మిస్సోరి ఛాప్టర్ కు అందిస్తున్న సేవలను నాట్స్ జాతీయ కార్యవర్గం కొనియాడింది. సమున్నత ఆశయంతో చేపట్టే ఏ సత్కార్యానికైనా తమ మద్దతు ఉంటుందని నాట్స్ జాతీయ కార్యవర్గం మిస్సోరి ఛాప్టర్ కు భరోసా ఇచ్చింది.. మూడవ వార్షికోత్సవ సంబరాన్ని ఘనంగా నిర్వహించడంతో అటు నాట్స్ మిస్సోరి ఛాప్టర్ లో కూడా సంతోషం వెల్లివిరిసింది. ఈ సంబరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగువారికి కలిపే ఈ వేదికను వినియోగించుకుని తాము కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారు ప్రకటించారు.

 


Photo Gallery
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved