pizza
డిట్రాయిట్ లో తెలుగు నాటికకి పునర్జీవం పోసిన నాట్స్
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

19 May 2015
Hyderabad

ఫార్మింగ్టన్ హిల్స్ లోని కళాక్షేత్ర (టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్) ప్రాంగణంలో నాట్స్ ఆధ్వర్యంలో ఫైన్ ఆర్ట్స్ కార్యక్రమం అంగరంగ వైభోగంగా జరిగింది. మొదటగా అతిథులంతా నాట్స్ కుటుంబసభ్యులు స్వయంగా వండి వడ్డించిన వివిధ తెలుగు వంటకాలతో పసందైన విందు భోజనాన్ని ఆస్వాదించారు. ప్రవీణ వెల్లంకి, ప్రతిమ కొడాలి గార్లు జ్యోతి వెలిగించారు, రాబోయే పాడుతా తీయగాలో పోటీకి ఎన్నికయిన హారిక ప్రార్థన గీతంతో సభ ఆరంభమయింది.

కల్యాణి మంత్రిప్రగడ గారి నిర్వహణలో పిల్లలు శ్రీచందన అనుమోలు, అనీష మంత్రిప్రగడ, విఖ్యాతి పల్లెర్ల, వైష్ణవి ధేనువకొండలు అందరినీ తమ పాటల పల్లకీలో ఏవో రసమయ లోకాలకు తోడ్కొని పొయ్యారు. పాటలు ప్రారంభించేసరికి గోల గోలగా ఉన్న సభ అంతా, ఒక పాట పూర్తయ్యేసరికి నిశ్శబ్దంగా మారిపోయి అంతా పాటల ప్రపంచంలో మైమరచిపోయారు. మైమరచిపోయి పాటల ప్రపంచంలో విహరిస్తున్న సభికులను రోషిత ఠాకుర్, వైష్ణవి ధేనువకొండలు ఉర్రూతలూగించే నాట్యంతో సభలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపారు. శ్రీనంద్ అనుమోలు దాన వీర శూర కర్ణ లోని సంభాషణలు చక్కటి వాచికంతో చెప్పి అందరి మన్ననలు పొందాడు

తర్వాత కార్యక్రమం డిట్రాయిట్ స్టేజీ పైన మొదటి సారి మాయలఫకీర్ ఏకపాత్రాభినయం. DTA మాజీ అధ్యక్షులు శ్రీ వేణు సూరపరాజు గారు మాయలఫకీరు వేషంలో అద్భుతమైన ప్రదర్శన చూసిన అందరికీ ఒళ్ళు గగుర్పాటు చెందిందంటే ఆశ్చర్యం లేదు. హాల్ లో వున్న పిల్లలు కొంతమంది పిల్లలు భయంతో బయటకి వెళ్ళటం అందరికీ నవ్వు తెప్పించింది, సభలో ఉన్న పెద్దలు వేణు గారి తండ్రి, మాయలఫకీరుకే మరో రూపం అనిపించుకున్న ఆనాటి గొప్ప కళాకారుడు సూరపరాజు నారాయణరాజు గారిని గుర్తు తెచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడని కితాబులిచ్చారు.

డాక్టర్ కొడాలి శ్రీనివాస్, శ్రీ బొప్పన ద్వారకా ప్రసాద్ గార్ల చేతుల మీదుగా డాక్టర్ గోగినేని సాంబశివరావు గారికి సన్మానం జరిగింది. ప్రముఖ స్టేజీ ఆర్టిస్ట్ అయిన డాక్టర్ సాంబశివరావు గారు BHU, IISC లలో పట్టభద్రులైన సాంబశివరావు గారు ర్యాలీ లోని ఉత్తర కారోలీనా యూనివర్సిటీ లో post doctorate చేసి ౩౦ సంవత్సరాలు NIT Warangal లో Metallurgical engineering మరియు material science లను బోధించి సుమారు 10 సంవత్సరాల క్రితం US కు వచ్చారు. ఈ సందర్భంగా వారు గద్యరూపంలోని పాండవోద్యోగ విజయాల నుండి కొన్ని సంభాషణలు చెప్పి తేనెలూరు తెలుగు లోని తీయదనాన్ని, గాంభీర్యాన్ని సభికులకు పరిచయం చేసారు.

తర్వాత శ్రీమతి జయ శేషగిరిరావు, శ్రీమతి లత పుతుంబాక గార్ల చేతుల మీదుగా శ్రీమతి కవిత వెలగపూడి గారికి సన్మానం జరిగింది. కవిత గారు మన అందరిలానే IT ఉద్యోగం చేస్తూనే, తన వారాంతాలను వృద్ధాశ్రమాలలొ వారికి సేవ చేస్తూ గడుపుతారు. ఇలా ఒక వారం కాదు, ఒక నెల కాదు. గడచినా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు.

వీరు గొప్ప మానవతా దృక్పధంతో చేస్తున్న ఈ సేవ అభినందనీయం అనీ, వీరి జీవితం ఆదర్శంగా మరింత మంది కవితలు ఉద్భావిస్తారన్న ఆకాంక్షతో నాట్స్ వీరికి సన్మానం చేసి తనను తానూ గౌరవించుకుంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర డిప్యూటి స్పీకర్ శ్రీ మండలి బుద్ద ప్రసాద్ గారు ఫోన్ చేసి కవిత వెలగపూడి, గోగినేని సాంబశివరావు గార్లను, నాట్స్ సభ్యులను అభినందించారు.డిట్రాయిట్ మిత్రులంతా ప్రేమగా త్రివిక్రమ్ అని పిలుచుకునే క్రొత్తపల్లి కృష్ణ గారు రచించిన మాఊరికి దారేది అనే నాటికను ప్రదర్శించారు.

ఈ నాటికను శ్రీ కృష్ణ గారు రచించగా నటించిన నటులు శ్రీయుతులు కృష్ణ మోహన్ బూదరాజు, వేణు సూరపరాజు, క్రొత్తపల్లి కృష్ణ , శ్రీని కొడాలి, మహేష్ వేనుకదాసుల అద్భుతంగా ప్రదర్శించారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత డిట్రాయిట్ స్టేజీ పై ఒక చక్కటి నాటికను ప్రదర్శించి ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు. నాటిక ప్రదర్సన జరుగుతున్నంత సేపు, సభికులంతా నవ్వుతూనే ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అరగంట సేపు అందరినీ నవ్వుల్లో ముంచెత్తిన మాఊరికి దారేది team అంతటికీ శుభాభినందనలు. పద్మ మల్ల, శివ అడుసుమిల్లి గార్లు ప్రయోక్తలుగా వ్యవహరిస్తూ కార్యక్రమమంతటినీ చక్కగా నడిపించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీయుతులు సుధాకర్ కాట్రగడ్డ, కోగంటి ప్రతాప్, రవి నూతలపాటి, కృష్ణ మోహన్ బూదరాజు, క్రొత్తపల్లి కృష్ణ, కృష్ణ నిచ్చెనమెట్ల, గౌతమ్ మార్నేని, కిషోర్ కొడాలి, కిషోర్ తమ్మినీడి, దత్త సిరిగిరి, ప్రవీణ్ ధూర్జటి, వేణు కొడాలి, విష్ణు వీరపనేని, మహీధర్ రెడ్డి, జగదీష్ చాపరాల, నీలేష్ ఠాకూర్, రాజు మంతెన, అప్పల దంతులూరి, దామోదర్ రెడ్డి గంకిడి, శ్రీనివాసరాజు, సుబ్బరాజు,చంద్ర అన్నవరపు, అంజన గుత్తా, సోమసాగర్ మోహన్ రెడ్డి, తదితరులకి వీరందరికీ పేరుపేరునా నాట్స్ జాతీయ కార్యదర్శి బసవేంద్ర సూరపనేని గారు ధన్యవాదాలు అర్పించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వటం వల్ల వచ్చిన ఉత్సాహం, భవిష్యత్ లోమరిన్ని కొత్త కొత్త ప్రదర్శనలు రూపొందించటానికి నమ్మకం కలిగించింది అనీ, వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆనాటి రంగస్తల నటులు, కళాకారులు కొంతమంది ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారికి సాయం అందిస్తాము అని తెలియచేశారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved