pizza
NRI TDP Meet in New Jersey
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

15 October 2014
Hyderabad

NRI TDP New Jersey meet was held in New Jersey and Mr.Upendra Chivukula (Deputy Speaker New Jersey Assembly and NJ Public Utilities Commissioner), Sri Mandali Buddha Prasad (Andhra Pradesh Assembly Deputy Speaker) and Sri Alapati Rajendra Prasad (Ex Minister and TDP MLA) attended as chief guests to the event. Inspite of planning it in a very short time frame, still several people attended the event and made it a huge success. NATS Vice President Mohana Krishna Mannava organized this event.

During this event, everyone expressed their sympathies to the families effected by Hudbud and several donors generously donated to the flood victims. This event also made it unique with Andhra Pradesh Assembly Deputy Speaker and New Jersey assembly deputy speaker sharing the same stage. Ex minister and MLA Alapati Rajendra Prasad's speech received great response and he explained in detail the effort of NRIs in the recent elections and requested their active participation and coperation for the development of Andhra Pradesh and hoped that Andhra Pradesh will progress well under the visionary chief minsiter Chandrababu's leadership. Also, Mr.Chivukula Upendra and Mr.Mandali Buddha Prasad spoke in detail and requested all Telugus across the globe to work together for the promotion of Telugu language and Telugu culture. All 3 guests (Upendra Chivukula, Mandali Buddha Prasad, Alapati Rajendra Prasad) were richly felicitiated by organizers.

Several people worked hard to make this event a big success - Mohana Krishna Mannava, Ramesh Nuthalapati, Srihari Mandai, Ranjit Chaganti, Vishnu Aluru, Murali Medicherla, Prasad Kunisetty, Vamsi Venigalla, Prasad Gurram, Chandrasekhar Konidela, Vasu Tupakula worked hard to make this a success.

Several prominent telugu people - NATS Chairman Dr.Madhu Korrapati, Yugandhara Rao Vallabhaneni, Vimal Kavuru, Dr.Suryam Ganti, Asha Vikuntham, Murali Medicherla, Damu Gedela, Vidya Garapati, Venu Palyam participated in this event.

ఇద్దరు తెలుగు ఉప సభాపతులు ఒకే వేదికపై
న్యూజేర్సీలో ఎన్.ఆర్. ఐ టీడీపీ సమావేశం
అతిధులుగా ఆలపాటి, మండలి బుద్ధప్రసాద్, ఉపేంద్ర చివుకుల

హుద్ హుద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని న్యూజేర్సీ ఎన్.ఆర్.ఐ టీడీపీ విభాగం పిలుపునిచ్చింది. తెలుగునేలపై సాటి తెలుగువారికి అండగా నిలబడాలని న్యూజేర్సీ టీడీపీ విభాగం నిర్ణయించింది.. న్యూజెర్సీలో ఎన్.ఆర్. టీడీపీ విభాగం సమావేశమైంది.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సమావేశానికి విచ్చేశారు. ఇక అటు న్యూజేర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రజాప్రజా అవసరాల శాఖ కమీషనర్ ఉపేంద్ర చివుకుల కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలుగుదేశం విజయంలో ప్రవాసాంధ్రుల సహకారం మరువలేనిదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాసాంధ్రులు తమ వంత సహకారం అందించాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ అన్నారు. తెలుగుదేశం విజయానికి చంద్రబాబు ఎంతగానో కష్టపడ్డారని మండలి బుద్ధప్రసాద్ వివరించారు. ఇండియాలో పారిశుధ్యం మెరుగు, దానికి సంబంధించిన పాలసీల రూపకల్పన లాంటి అంశాల్లో తనవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఉపేంద్ర చివుకుల హామీ ఇచ్చారు. న్యూజేర్సీ తెలుగు ప్రముఖుడు, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అతి తక్కువ సమయంలో దీనిని ఏర్పాటు చేసినా స్థానికంగా ఉండే తెలుగుదేశం అభిమానులు, ఎన్.ఆర్.ఐ ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మోహన కృష్ణ మన్నవ, రమేష్ నూతలపాటి, శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, విష్ణు ఆలూరు, మురళీ కృష్ణ మేడిచర్ల, ప్రసాద్ కూనిశెట్టి, వంశీ వెనిగళ్ళ, ప్రసాద్ గుర్రం, చంద్రశేఖర్ కొణిదెల, వాసు తుపాకుల ఈ సమావేశం విజయవంతానికి కృషి చేశారు. ఎన్.ఆర్. ఐ టీడీపీ సమావేశంలో తెలుగు ప్రముఖులు నాట్స్ చైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి, యుగంధర్ రావు వల్లభనేని, విమల్ కావూరు, డాక్టర్ సూర్యం గంటి, ఆశా వైకుంఠం, మురళీ కృష్ణ మేడిచర్ల, దాము గేదెల, విద్యా గారపాటి, వేణు పాళ్యం పాల్గొన్నారు.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved