pizza
సిలికానాంధ్ర మనబడి తెలుగు తేజాల చిన్నారి చేతులలో తెలుగు భాష సురక్షం!
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

4 Septemmber 2014
Hyderabad

సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో సాంతాక్లారా హై స్కూల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలుగు మాట్లాట జాతీయపోటీలు ఆదివారం రాత్రితో ముగిసాయి. ఈ పోటీలకి అమెరికా నలుమూలనుండి ప్రాంతీయంగా 1000+ మంది పిల్లలు పాల్గొనగా, 42 మంది తేజాలు మాత్రమే జాతీయ పోటీలలో పాల్గొనడానికి అర్హత సంపాయించారు. సీనియర్స్ అనగా సిసింద్రీల విభాగంలో నిర్వహించబడిన పదరంగం, తిరకాటం రెండు ఆటలలో మాదిరెడ్డి సాహితి విజేతగా నిలిచింది. పదరంగంలో ద్వితీయ స్థానాన్ని కొలచిన హర్ష, పదరంగంలో ద్వితీయ స్థానాన్ని సోలిపురం మనీష గెలుపొందారు. జూనియర్స్ అనగా బుడతల విభాగంలో తిరకాటంలో బొడ్డు భవ్యలక్ష్మి, ద్వితీయ స్థానాన్ని ముత్యంపేట మిహిర్, పదరంగంలో చింతలపాటి మోహనాద్యుతి, ద్వితీయస్థానం చిత్త అనీష సంపాదించారు. మొత్తం రెండు రోజులు జరిగిన పోటీలలో ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి గంగిశెట్టి లక్ష్మీనారాయణ ప్రథమ విజేతకి $1,116 డాలర్లు, రెండవ స్థానం వారికి $751 డాలర్లతోపాటు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మనబడి ద్వారా ప్రవాస తెలుగు విద్యార్థులకు అందుతున్న భాషా సేవలు మరువలేనివని, అమెరికాతో పాటు, మిగిలిన దేశాలలోని సిలికానాంధ్ర మనబడికి మంచి ఆదరణ లభిస్తోందని ప్రశంసించారు. అమెరికాలో సిలికానాంధ్ర చేపట్టిన మనబడి ప్రయోగం తెలుగు జాతికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ప్రముఖ సాహితీవేత్త డా. రావి రంగారావ్, సిలికానాంధ్ర మనబడి కులపతి చమర్తి రాజు, ప్రధాన నిర్వాహకులు కొండుభట్ల దీనబాబు, తోటపల్లి డాంజి, రాయవరం భాస్కర్, యెడిది శర్మ, వేట శరత్, కూచిభొట్ల శాంతి, జొన్నవిత్తుల శ్రీనాధ, పాశం భువనేశ్వర రెడ్డి, నిడమర్తి శ్రీనివాస్, కస్తూరి గౌతమ్, కల్యాణి సిద్ధార్థ, వసంత మంగళంపల్లి, జయ తెలుకుంట్ల, తదితరుల ఆధ్వర్యంలో జాతీయ పోటీలు నిర్వహించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కస్తూరి ఫణి మాధవ్ నిర్వహించిన వెంట్రిలాక్విజం ప్రదర్శన పోటీలకు హాజరైన బాలబాలికలను అలరించాయి. తెలుగు మాట్లాట సంధాత తోటపల్లి డాంజి మాట్లాడుతూ, "తెలుగు మాట్లాట పోటీల నిర్వహణకు ప్రత్యేకంగా తయారుచేయబడిన మాయాదర్పణం సాఫ్ట్ వేర్ సరణి మరియు సాంకేతికంగా ఇంతకుముందు కంటే మేలైన బజ్జేర్ యంత్రం వల్ల ఆటలు శ్రీఘ్రంగా, స్థిరంగా, అడ్డంకులు లేకుండా కోనసాగడానికి సాధ్యమైయింది" అని తెలియజేసారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస తెలుగువారికి, వారి పిల్లలకి తెలుగుభాష నేర్పించడంలో మనబడి కార్యక్రమం ప్రసిద్ధిగాంచింది. 2014-15 విద్యా సంవత్సరంలోకి నమోదు కార్యక్రమం శరవేగంతో సాగుతుంది. సెప్టెంబర్ 6 వారంతంలో తరగతులు ఆరంభమౌతాయి.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved