pizza
Tantex Volley Ball Tournament - May 1st, 2016
ఉత్కంఠభరితంగా సాగిన టాoటెక్స్ వాలీబాల్ టోర్నమెంట్ -2016
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

6 May 2016
Hyderabad

ఉత్కంఠభరితంగా సాగిన టాoటెక్స్ వాలీబాల్ టోర్నమెంట్ -2016

ఆరోగ్యమైన దేశమే సంపన్నమైన దేశం, కనుక క్రీడలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. డాలస్ లోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) వారు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడాకర్యక్రమాలకు కూడా పీద్ద పీట వేస్తారు. అందులో భాగంగా మే 1 తేదీన పురుషులకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. డాలస్/ఫోర్ట్ వర్త్ నగరాల నుంచి 25 జట్లు ఈ టోర్నమెంట్ కి రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి జట్టు ఎంతో పట్టుదలతో ప్రాక్టీసు చేసి ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. డాలస్ లోని స్పోర్ట్స్ ప్లెక్స్ సెంటర్ లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వాలీబాల్ టోర్నమెంట్ సాయంకాలం 7 గంటల వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది. టాoటెక్స్ క్రీడల సమన్వయ కర్త బ్రహ్మదేవర శేఖర్ మాట్లాడుతూ వాలీబాల్ టోర్నమెంట్ కి ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఇదే మొదటి సారి అని, కష్టపడి ఏర్పాట్లు చేసినందుకు ఫలితం దక్కిందని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. టాoటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం మాట్లాడుతూ క్రీడల పట్ల మన దేశీయులకున్న ఆసక్తి చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. క్రీడా విభాగం సభ్యులైన డా.కొండ తిరుమలయ్య, తోట పద్మశ్రీ, పూర్వ రాజ్వడే, రాజ వైశ్యరాజు, మధుమతి వైశ్యరాజు, శరత్ ఎర్రం తమ వంతు సహాయ సహకారాలు అందిoచారు.

ఇక వాలీబాల్ టోర్నమెంట్ లో 25 జట్లను 4 పూల్స్ గా విభజించి ఆట మొదలు పెట్టారు. ఇందులో గెలిచిన 16 జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు, ఇక్కడ నుంచి 8 జట్లు లెవెల్-1 కప్ కోసం ఆడగా మిగతా 8 జట్లు లెవెల్-2 కప్ కు ఆడారు. ఫైనల్స్ చేరుకున్న 4 జట్ల మధ్య ఆట హోరాహోరీగా నడిచింది. లెవెల్-1 కప్ లో అంబ్లిక్స్ vs కేయాస్ మధ్య జరిగిన ఫైనల్స్ లో కేయాస్ జట్టు విజేత గా నిలిచింది. లెవెల్-2 కప్ లో స్నయిపర్స్-2 vs పంజాబ్ లయన్స్ మధ్య జరిగిన ఫైనల్స్ లో పంజాబ్ లయన్స్ విజేత గా నిలిచింది.

ప్రసార మాధ్యమాల సమన్వయకర్త తోట పద్మశ్రీ TV5 కవరేజ్ ఏర్పాటు చేయగా, అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం మరియు బ్రహ్మదేవర శేఖర్ TV5 కి అలాగే టోర్నమెంట్ లో పాల్గొన్న అన్ని జట్లకి కృతజ్ఞతలు తెలియచేశారు. టాoటెక్స్ తక్షణ పుర్వాధ్యక్షులు డా.ఉరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు రొడ్ద రామకృష్ణ, కోశాధికారి దండ వెంకట్, కార్యనిర్వాహక సభ్యులు కోడూరు కృష్ణ కూడా ఇందులో పాల్గొన్నారు.

టాoటెక్స్ వాలీబాల్ టోర్నమెంట్-2016 గురించి తోట పద్మశ్రీ వ్రాసిన నివేదిక.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved