pizza
Telugu Association of Scotland (TAS) Ugadi Celebrations 2016
టాస్ 15వ ఉగాది ఉత్సవంలో నూతన కార్యవర్గం ఎన్నిక (2016-2018)
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

19 April 2016
Hyderaba
d

స్కాట్లాండ్ తెలుగు సంఘం (టాస్) నిర్వహణలో Edinburgh -  హెరియట్ వాట్ విశ్వవిద్యాలయ ప్రాంగణం Edinburgh Conference Center లో,  ధుర్ముఖి నామ సంవత్సర ఉగాది 2016 వేడుకలను సంగీత విభావరితో ఘనంగా జరుపుకుంది.    

షడ్రుచుల  ఉగాది పచ్చడి మరియు పిండివంటలతో కూడిన విందుతో మొదలైన మధ్యాహ్నం - జ్యోతి ప్రజ్వలనతో  సభ్యులను స్వాగతిస్తు, సుప్రసిద్ధ గాయకుడు క్రిష్ణ చైతన్య, అతని భార్య సుప్రసిద్ధ యాంకర్ మృదుల, గాయకుడు అనుదీప్  మరియు వర్ధమాన గాయని లిప్సిక వీనులవిందైన పాటలతో అతిధులను ఆకట్టుకున్నారు. స్థానికంగా ఉన్న తెలుగు వారి పిల్లలు శ్లొకాలు, వేమన పద్యాలు, సాంప్రదాయ నృత్యాలైన  కూచిపూడి - భరతనాట్యం మేళవించిన కార్యక్రమాలతో ఆహుతులను అలరించాయి .         

కార్యక్రమంలో తదుపరి భాగంగా టాస్ నూతన కార్యవర్గ (2016 - 2018) సభ్యుల ఎన్నికను పొందుపరిచారు

- జయంతి సత్య శ్యాం కుమార్ - సభాపతి (ఛైర్మన్)  
- నాగుబండి రంజిత్ - ఆధ్యక్షుడు (ఫ్రెసిడెంట్) 
- కెంబూరి మైథిలి - ప్రధాన కార్యదర్శి (జెనరల్ సెక్రెటరి) 
- తెలగాలపూడి బెంజిమన్ – కోశాధికారి (ట్రెజరర్)
- చింపిరి శివ - సాంస్కృతిక కార్యదర్శి (కల్చరల్ సెక్రెటరి)   
- గడ్డం వెంకటేష్ - సాంకేతిక & పౌర సంబంధాల కార్యదర్శి (ఐ. ట్.& పి. ఆర్ సెక్రెటరి)
- కుచడి ఉదయ్ కుమార్ - యువజన కార్యదర్శి (యూత్ సెక్రెటరి)
- కంటమనేని రవి తేజస్వి - మహిళా కార్యదర్శి (విమెన్స్ సెక్రెటరి)

సభాపతి సత్య శ్యాం కుమార్ మాట్లాడుతూ, తెలుగు వారిగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత మనదే ననీ, అందుకు ఇటువంటీ వేడుకలు వేదిక అనీ అన్నారు.   సిలికాన్ ఆంధ్ర మనబడి లో చేరి, మూడు త్రైమాసిక పరీక్షలూ కలుపుకుని ఎక్కువ గుణములు (మార్కులు) సాధించిన చిన్నారులు  దాసరి నీహారిక (97%) మరియు జుట్టాడ హృద్య లను, సిరి  ఫూడ్స్  సమర్పించిన నగదు బహుమతులతో ప్రోత్సహించారు. 

ఈ సంధర్భంగా ఆధ్యక్షుడు నాగుబండి రంజిత్ మాట్లాడుతూ స్వచ్ఛందగా పనిచేసే సభ్యులను స్వాగతిస్తూ టాస్ ధ్యేయం మరియు చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి విశదీకరించారు, స్కాట్లాండ్ లోని తెలుగు వారి పిల్లలు అందరూ తెలుగు నేర్చుకోవాలని సూచించారు.   

తదుపరి కెంబురి మైథిలి తెలిపిన కృతజ్ఞతలతో పాటు  మన జాతీయ గీతం "జన గణ మణ" వందన సమర్పణతో స్కాట్లాండ్ తెలుగు సంఘం (టాస్) ఉగాది 2016 వేడుకలు ముగిశాయి.     


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved