pizza
TAW - Ugadi - 2019
కార్డిఫ్ (వేల్స్) 6 ఏప్రిల్ 2019
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

7 April 2019
USA

 

కార్డిఫ్ (వేల్స్) 6 ఏప్రిల్ 2019:

తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆధ్వర్యం లో వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవం గా కార్డిఫ్ మహా నగరం లోని స్థానిక లిజ్వేన్ మెమోరియల్ హాల్ లో జరిగాయి. ఈ వేడుకకు వేల్స్ లోని ప్రతి ఒక్క తెలుగు కుటుంభం హాజరు అయ్యింది.

తెలుగు సాంప్రదాయాలు మరియు సంస్కృతి ప్రతిబింభించేలా జరిగిన ఈ వేడుకలు ఎంతో సాంప్రదాయ బధ్ధంగా చక్కని వాతావరణం లో జరిగాయి.

వేల్స్ లో మొట్ట మొదటిసారిగా జరిగిన పంచాగ శ్రవణం, వేడుకకు విచ్చేసిన ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది. ప్రముఖ పండితుడు శ్రీ సురేష్ సోమయాజులు గారు చేసిన పంచాంగ శ్రవణం, వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి తో ఆలకించారు. ఈ సందర్భం గా తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ వారు శ్రీ సురేష్ సోమయాజులు గారిని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సంస్కృతి కార్యక్రమాలు, ముఖ్యం గా భరత నాట్యం, పిల్లల నాట్య ప్రదర్శన మరియు పిల్లలు ప్రదర్శించిన తెలుగు సంప్రదాయ వస్త్రాలంకరణ అందరినీ విశేషం గా ఆకట్టుకున్నాయి.

తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ వారు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి మరియు విందు భోజనాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించారు.

తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని వేల్స్ లోని ప్రతి ఒక్క తెలుగు కుటుంబాలను దగ్గరకు చేశాయి. తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు ప్రశంసించారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved