pizza
Telangana Jagruthi UK (TJUK) Ifathar party 2017
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

24 June 2017
UK

తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ మొట్ట మొదటి సారిగా లండన్ మహానగరం లో ని ఈస్ట్ హం లో ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది , లండన్ లోని నలు మూలల్లోని ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారు ... పవిత్ర రంజాన్ మాసం లో ఎంతో నిష్ఠ తో ఆచరించే రోజ విరమించే సాయం సమయాన ఇఫ్తార్ విందు తో జాగృతి సభ్యులతో కలిసి జరుపు కున్నారు

జాగృతి యూకే ముస్లిం మైనారిటీ ఇంచార్జి సలాం యూసఫ్ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గ తెలంగాణ రాష్ట్ర నిర్వహాధికారిగా కేంద్రం లో పని చేస్తున్న శ్రీ రామచంద్ర తేజావత్ గారు కుటుంబ సమేతంగా విచ్చేసారు, సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఖండాంతరం లో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేయడం చాలా ఆనందంగా ఉందని ... ఈ సందర్బంగా జాగృతి యొక్క ఆవిర్భావం , అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి కృషి గురుంచి రామచంద్ర గారు గుర్తు చేశారు , ఈ కార్యక్రమం లో మరో అతిధి అక్కడి కౌన్సిలర్ పాల్ సథిరిసన్ కూడా పాల్గొని పరమత సహనం తో జాగృతి చేస్తున్న ఈ కార్యక్రమం తన కెంతో నచ్చిందని చెప్పారు

జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి మాట్లాడుతూ నూతన కార్యవర్గం తో ఇది రెండో కార్యక్రమమని , ఎంతో విజయ వంతంగా టీం యొక్క సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నామని , మున్ముందు కూడా చక్కటి కార్యక్రమాలతో , సంక్షేమ పనులతో పెద్ద ఎత్తున లండన్ లో నే కాకుండా మిగితా నగరాల్లో కూడా విస్తరిస్తామని చెప్పారు

మైనార్టీ ఇంచార్జి సలాం యూసఫ్ ముస్లిం సోదరులకు అభివాదం తెలుపుతూ తన ప్రసంగం లో తెలంగాణ అంటే బతుకమ్మ , బోనాలతో పాటు రంజాన్ కూడా విశిష్టమని , పవిత్ర మాసం లో చేసే ఈ విందు ని జాగృతి తరుపున ముస్లిం సోదరులతో కలిసి చేసుకోవడం చాల సంతృప్తిగా తెలంగాణ లో ఉన్న భావన కలిగిందని చెప్పారు

ముస్లిం సోదరుల ప్రార్థనలతో ,ఆలింగినాలతో , పలకరింపు లతో అందరు కుటుంబ సమేతంగా సంతోషంగా ఈ వేడుక ని జరుపు కున్నారు

ఈ కార్యక్రమం లో జాగృతి యూరప్ అధ్యక్షులు సంపత్ ధన్నామనేని, జాగృతి యూకే ఉపాధ్యక్షులు పావని గణేష్ , సుష్మ జువ్వాడి , శ్రవణ్ రెడ్డి కార్యదర్శి సంతోష్ ఆకుల తో పాటు ఇతర జాగృతి యూకే కమిటీ సభ్యులూ సునీల్ మెహరీర్ , సలాం యూసఫ్ , వంశీ మునిగంటి, లండన్ గణేష్, రఘు జక్కుల , రమేష్ పాల్తేపు ,గణేష్ మల్యాల , వెంకట్ బాలగోని, వంశీ తులసి , వంశీ సముద్రాల , ప్రణీత్ కుమార్ కందుకూరి , లక్ష్మి నర్సింహా రెడ్డి, రాంచందర్ రాపోలు , మానస టేకుమట్ల , విద్య బాలగోని , శ్రావణి బలమూరి , మాధవి రెడ్డి , దీపికా , దీప్తి సముద్రాల , అలీన స్ట్రాట్ , రాధికా మునిగంటి ఇతరులు పాల్గొన్నారు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved