pizza
Grand Celebrations of Telangana state formation day in New Jersey - USA
న్యూ జెర్సీ లో అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు:
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

6 June 2017
USA

The third anniversary of Telangana state formation day was celebrated in a grand and festive way by the Telangana NRIs of the North East states of the US in Royal Albert Hall, New Jersey on June 4th, 2017. About 1000 Telangana NRI and well-wishers of Telangana participated with great enthusiasm and vigor in the celebrations. The celebrations were organized by various Telangana organizations such as TDF, TATA, TeNA, DATA, PTA, VTA, NJTA, ATA and Telugu organizations ATA, NATA, Kalabharati, TFAS, that came together in a united way to celebrate this unique occasion as a single Telangana family. Keeping aside all their differences, these organizations were united and put in lot of time, energy and money to make the celebrations a grand success.

The stage of the large banquet hall of Royal Albert hall was decorated to reflect Telangana culture with Batukammas and Bonalu, huge banners with Prof.Jayashankar and martyrs portrayed on them. The event started off with lighting of the lamp by Telangana senior citizens followed by a song paying homage to martyrs who laid down their lives for the statehood by Telangana singer Janardhan Pannela. A two minute silence followed and then slogans were raised by the Telangana NRIs to fulfil the dreams and aspirations of Martyrs and build a ‘bangaru’ (golden) Telangana.

Then followed dances by children of Telangana both in classical Kuchipoodi style and Telangana folk style that were performed wonderfully and all the people who attended were impressed by the performances. The children put in their heart and soul into the performances. Telangana folk songs were rendered by well-known Telangana singer Janardhan Pannela who was accompanied by Deepti Nag and Ram Arella. The songs had some great rhythm which made the attendees tap their feet.

This was followed by a procession of Bonalu and Batukamma by the enthusiastic Telangana women with the Telangana folk Dappu artists leading it with great rhythmic drum beats. Everyone irrespective of their age participated with fantastic vigor and enthusiasm and danced to the drum beats and the women played Batukamma out side the hall. The procession went around the hall and with all the women and men dressed up in colorful Telangana handlooms it was like as though all the Telangana flowers had bloomed around the Royal Albert Hall and there were beautiful rainbows all around. All the Telangana NRIs put in their heart and soul into the event and were elated by the ecstatic experience.

There was tasty food served on the occasion with Telangana ‘pachi pulusu’ included and everyone had a sumptuous lunch.

All the people, irrespective of organizations and origin, who put in their time, effort and money were invited on to the stage and a cake was cut on the occasion of the state formation day. Everyone celebrated the occasion with a festive mood and was very hopeful and optimistic about the future of Telangana state. All were determined to help and support the building of a future Bangaru Telangana in which the fruits of development would reach one and all in Telangana, primarily to the oppressed and downtrodden. Everyone had glimmers of hope in their eyes and left with a content heart hopeful of a wonderful future for the state that we achieved after 60 years of aspirations and struggle.

The organizers of the event would like to express their deep gratitude to all those businesses, restaurants, individuals who contributed to the event in a big way and supported it through out. They would also like to express their heartfelt thanks to all the media persons who worked hard to cover the event right from the beginning until the end.

The organizers would like to thank one and all for making the event a great success with great dedication and commitment for Telangana.

న్యూ జెర్సీ లో అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు:

తెలంగాణ మూడవ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని అమెరికా లోని ఈశాన్య రాష్ట్రాల తెలంగాణ ఎన్ ఆర్ ఐ లు జూన్ 4 నాడు న్యూ జెర్సీ ఎడిసన్ లోని రాయల్ ఆల్బెర్ట్ పాలస్ లో అత్యంత ఉత్సాహంగా వైభవంగా జరుపుకున్నారు. సుమారు 1000 మంది తెలంగాణ ముద్దు బిడ్డలు, తెలంగాణ శ్రేయోభిలాషులు ఈ ఉత్సవానికి విచ్చేసి తెలంగాణ మట్టి మీద తమ ప్రేమను తెలంగాణ పట్ల తమ ఆపేక్షను, ప్రజాస్వామిక స్వభావాన్ని చాటుకున్నారు. ఉత్తర అమెరికా ఈశాన్య రాష్ట్రాల నుండి తెలంగాణ వాసులు ఉరకలు వేసే ఉత్సాహం తో జూన్ 4 ఆదివారం ఉదయాన్నే సంబరాల వేదిక దగ్గరకు చేరుకున్నారు. వేదిక మీద ‘తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ సంబరాలు’ అన్న పెద్ద బేనర్ అందరినీ ఆకర్షించింది. తెలంగాణ జాతి పిత ప్రొ.జయశంకర్ సార్ చిత్రపటం ఒక వైపు అమరులకు జోహార్లర్పించే స్తూపం మరో వైపు, రంగు రంగుల బతుకమ్మలు బోనాలు వేదిక ను అలంకరించినయి. అమెరికా లో ఉన్న తెలంగాణా సీనియర్ సిటిజెన్ లతో జ్యోతి ప్రజ్వలనం జరిగినంక అమరులకు జోహార్లర్పిస్తూ సభ రెండు నిమిషాల మౌనం తర్వాత , అమరులు కలలు కన్న బంగారు తెలంగాణ నిర్మించాలన్న ఆకాంక్ష నినాదాలుగా ఎగసి పడింది. అమరుల కోసం సభకు విచ్చేసిన తెలంగాణ గాయకుడు జనార్ధన్ పన్నెల పాడిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి. కూచిపూడి శాస్త్రీయ నృత్యాలతో పాటు , తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే అనేక జానపద నృత్యాలు ప్రదర్శించి తెలంగాణ పాటలతో తెలంగాణ చిన్నారులు సభను అలరించారు. అనేక మంది తెలంగాణ చిన్నారులు, వారి గురువులు ఎంతో శ్రమకోడ్చి నేర్పిన నృత్యాలను అంకిత భావం తో ప్రదర్శించడం సభికులందరినీ అలరించింది. తెలంగాణ గాయకులు జనార్ధన్ పన్నెల, దీప్తి నాగ్ , రామ్ ఆరెళ్ళ తమ పాటలతో సభను అలరించారు. డెలావేర్,న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా, మసాచూట్స్ నుండి వచ్చిన తెలంగాణ సాంస్కృతిక బృందాలు తమ జానపద పాటలతో డప్పులతో సభను తెలంగాణ సాంస్కృతిక సంరంభంగా మార్చివేశారు. తెలంగాణ మహిళలు, పురుషులు చేనేత కు మద్దతుగా పూర్తిగా రంగు రంగుల చేనేత వస్త్రాలు ధరించి సభా స్థలం లో సింగిడీలు పూయించారు. ముందు కళాకారులు డప్పు వాయిస్తుండగా తెలంగాణ మహిళలు బతుకమ్మలను బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా సాగినరు. ఆరు బయట బతుకమ్మలు పేర్చి మహిళలు బతుకమ్మ ఆడినారు. మహిళలు పురుషులూ అత్యంత ఉత్సాహంతో డప్పు వాయిద్యాలకు నృత్యం చేశారు. రాయల్ ఆల్బర్ట్ పాలస్ లోపల బయటా తెలంగాణ సాంస్కృతిక పరిమళాలు గుబాళించినయి. తీరొక్క పూలు పూసి అంతటా ఒక అద్భుత తెలంగాణ ఉద్యావనంమై విరబూసింది. అందరి కండ్లలో బంగారు తెలంగాణ కోసం తపన ఆకాంక్ష ఆపేక్ష తొణికిసలాడింది.

ఉత్తర అమెరికా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అన్ని తెలంగాణ సంస్థలు తమ తమ సంస్థల అభిప్రాయాలకు, భావజాలాలకు అతీతంగా ఒక్క తాటి మీదకు వచ్చి కలసి కట్టుగా జరుపుకున్న రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు తెలంగాణ ఎన్ ఆర్ ఐ ల మనోభావాలకు అద్దం పట్టినాయి. జెండా ఏదైనా మనందరం తెలంగాణ ముద్దుబిడ్డలమ్ అన్న భావన అందరి మనసులోనూ పొంగిపొర్లింది. తెలంగాణ సంస్థలూ, తెలంగాణ ను సమర్థించే సంస్థలూ , అందులో తెలంగాణ సంస్థలు టీడీయేఫ్, టాటా, తెనా, పీ టి‌ యే, వీ టి యే, డాటా, ఎన్ జే టీ యే, ఆటా మరియు తెలుగు సంస్థలు ఆటా, నాటా, కళాభారతి, టీఫాస్ తదితర సంస్థలన్నీ ఒక్క తాటి మీదకు వచ్చి శక్తి వంచన లేకుండా కృషి చేసి , శ్రమనూ , సమయాన్నీ, డబ్బులను ఉదాత్తంగా ధారపోసి తెలంగాణ సంబరాలను జరుపుకోవడం ఒక విశేషం. ఈ సంబరాలకు అనేక వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు తమ వంతు విరాళాలిచ్చి విజయవంతం చేయడానికి ఎంతో తోడ్పడ్డారు. సభలో అన్నీ సంస్థల వాళ్ళూ , విరాళాలిచ్చిన దాతలూ అందరూ వేదిక మీదికి వచ్చి తమ ఐక్యతను చాటారు. తెలంగాణ ఆవిర్భావాన్ని కేక్ కోసి వేడుక జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మనం తెలంగాణ ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించే ఒక అతి నూతన బంగారు తెలంగాణాను నిర్మించుకోవాలన్న ధృడ చిత్తం తో ఇట్లాంటి సంబరాలు ఇంకా అనేక ముందు ముందు కలసి కట్టుగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో అత్యంత ఆనందోత్సాహల మధ్య సభ ముగిసింది.

తెలంగాణ యాస , భాష తో సభికులు అంత అలయ్ బలయ్ ( ఆలింగనాలూ ) చేసుకోవడం , తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్ని గుర్తు చేసుకుంటూ, తెలంగాణ కళలను , తెలంగాణ మీద వ్యాస రచన పోటీలు నిర్వయించి విజేతలకు బహుమతులు ఇచ్చారు, వీటితో పాటు తెలంగాణ వంటకాలను ఆరగించారు.

తెలంగాణ ఆవిర్భావ సంబరాల సభను మొదటి నుండీ చివరదాక , శ్రమకోడ్చి అద్భుతంగా ప్రసారం చేసిన మీడియా మిత్రులందరికీ , ప్రింటు మీడియాకు , ఉదారంగా విరాళాలిచ్చిన దాతలందరికీ, విచ్చేసి విజయవంతం చేసిన తెలంగాణ ముద్దుబిడ్డలకూ శ్రేయోభిలాషులకూ సభ నిర్వాహకుల తరఫున తెలంగాణ ఎన్ఆర్ఐ లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved