pizza
Kansas City Ugadi Celebrations 2016
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

27 April 2016
Hyderabad

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ Kansas City (TAGKC) ఆధ్వర్యంలో Olathe South హైస్కూల్లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ Kansas City పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న తెలుగువారందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సంవత్సరం అందరికి శుభాలు కలగాలని కోరుకుంటూ అందరికి ఉగాది పచ్చడి, పానకాలను పంపిణీ చేశారు. ప్రధాన కార్యదర్శి Suresh Gundu సదస్సుని ఉద్దేశించి ప్రసంగించడంతో, ఆ తరువాత పూజారి గారి పంచంగ శ్రావణం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది.

ఈ సందర్భంగా ఏడు గంటలపాటు 150 మంది స్తానిక కళాకారులు ఇచ్చిన 25 ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భం గా 2016 సంవత్సరపు అధ్యక్షలు Srikanth Ravikanti , 2016 కార్యవర్గాన్ని మరియు 2016 trust board ని సభ కి పరిచయం చేసారు . జాతీయ స్తాయిలో నిర్వహించిన వివధ పోటిలలో రాష్టస్తాయిలో ప్రతిభ చూపెట్టిన విద్యార్థులను సత్కరిచారు . ఆ తరువాత చక్కని తెలుగు బోజనాలను అందరు ఆరగించి ఆనందించారు . కొస మెరుపు ఏమిటి అంటే 3 కార్యక్రమాల తరువాత ఫైర్ అలారం curtain trigger అవడం తో కార్యక్రమానికి ఇబ్బంది కలిగినా పిల్లలు , పెద్దవాళ్ళు , నేర్పించిన టీచర్లు అందరు కలిసి సహాయం చేసి కార్యక్రమాన్ని విజయ వంతం చేసారు

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved