pizza
Vidya Ratna Award to ManaBadi Raju Chamarthi
You are at idlebrain.com > NRI community >
Follow Us

 

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

08 July 2016
Hyderabad

చికాగో నగరంలో రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఆటా మహా సభల్లో వివిధ రంగాలలో సేవలందించి విజయాలను సాధించిన తెలుగు ప్రముఖులను ఆటా - వంశీ అవార్డులతో సత్కరించారు. ఇందులో భాగంగా అమెరికా తో పాటు 10 కి దేశాల్లో తెలుగు భాషాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ, 6000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు, రాజు చమర్తి ని ' విద్యారత్న ' అవార్డు తో సత్కరించారు.

ఈ సందర్భంగా మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ, మాతృ దేశానికి దూరంగా ఉన్నా, మాతృ భాషకి దూరం కాకూడదని, రేపటి తరానికి నాయకులైన ఈనాటి పిల్లలకి తెలుగు భాషను నేర్పించడానికి 9 సంవత్సరాల క్రితం సిలికానాంధ్ర మనబడి స్థాపించి 150 మంది పిల్లలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో నిర్వహిస్తున్న మనబడి లో అమెరికా దేశ వ్యాప్తంగా 1200 మంది భాషా సైనికుల తరఫున ఈ అవార్డ్ అందుకున్నానని, భాష సేవయే భావి తరాల సేవ అన్న స్ఫూర్తి తో కృషి చేస్తున్న భాషా సైనికులందరికీ ఈ అవార్డ్ అంకితమని అన్నారు. ఈ సందర్భంగా మనబడి గ్లోబల్ డెవలప్‌మెంట్ ఉపాధ్యక్షులు శరత్ వేట మాట్లాడుతూ, సిలికానాంధ్ర మనబడి 2016-17 విద్యా సంవత్సర ప్రవేశాలు మొదలయ్యాయని, సెప్టెంబర్ 10 నుండి తరగతులు ప్రారంభవుతయని తెలిపారు. మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ, దిన దిన ప్రవర్ధమానమౌతున్న సిలికానాంధ్ర మనబడి ఈ సంవత్సరం ఎన్నో విజయాలు సాధించిందని, అందులో ప్రతిష్టాత్మకమైన WASC గుర్తింపు తో పాటు, ఎన్నో స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో వరల్డ్ లాంగ్వెజ్ క్రెడిట్ కు అర్హత సాధించడం లాంటివి ముఖ్యమైనవని.


 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved