Pakado Pakado video song shot for the promotional purpose of Julayi film is launched at an event organized in Prasad Labs preview theater. This event is graced by Allu Arjun, Devi Sri Prasad, Trivikra, Allu Arvind, Radha Krishna & Danayya.
Bunny used to dance at all birthday parties - Allu Arvind
Speaking on the occasion Allu Arvind said, “I am jealous of new technology and new life style the young generation is enjoying. We have seen many promotional songs in Hollywood and Bollywood so far. For the first time, we are having such a promotional song for Julayi film. I am a family friend of Satyamurthy and I used to observe Devi Sri Prasad playing with musical instruments. When he made me listen to his first music album, I recommended it to Magna group and the video was released. Bunny is a dance oriented kid and he used to go to all the birthday parties in the neighborhood and dance in those parties. I am happy that both these friends joined their hands together to come up with such a nice promotional video - Pakado Pakado.”
I wanted an OST and got Pakado - Trivikram
Trivikram said, “I wanted an OST (Original Sound Track) like we have for Hollywood films. I had a situation in climax of the film where there is a theme of ‘catching’. I have asked DSP to come up with something interesting. The word ‘Pakado’ was suggested by Devi Sri Prasad and he gave the tune next day. Pakado song has a connection with the movie and it has good value as an independent song as well. We shot this entire song in one day and the ideas of Bonny and DSP were also incorporated in this promotional video song. Sai (script coordinate/1st asst director) and Naveen’s contribution is also invaluable for this song."
Devi Sri Prasad said that he was initially nervous, but Bunny made him do it. he wished that this song will help promoting Julayi film.
Allu Arjun said that every director get ideas and only a director like Trivikram can implement those ideas.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇలియానా నటినటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జులాయి'. డి.వి.వి.దానయ్య సమర్పణలో హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ పై కే. రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందించారు. ప్రమోషన్ లో భాగంగా డి.ఎస్.పీల, బన్నీలపై చిత్రీకరించిన 'పకడో' 'పకడో' సాంగ్ లాంచ్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అనంతరం ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...
ప్రమోషనల్ సాంగ్ అనేది ఇంగ్లీష్ సినిమాల్లో చూసేవాళ్ళం. అలాగే హిందీ సినిమాలో కూడా ఉండేవి.తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్ని కొత్తగా అలోచించి చేసే త్రివిక్రమ్ కి ఇలాంటి ఓ కొత్త ఆలోచన రావడం అభినందనీయం.దేవి నాకు చిన్నతనం నుంచి బాగా తెలుసు. వాళ్ళ నాన్న గారు నేను ఆప్త మిత్రులం.లోక సమయంలో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తను చేసిన 9 పాటల ఆల్బం క్యాసెట్ ను నాకిచ్చాడు. నేను విని నా స్నేహితుడు మాగ్నసౌండ్ అధినేతకు ఇచ్చాను. ఆ క్యాసెట్ దేవి మ్యూజిక్ దూకుడికి పునాది అయింది. ఈ హడావిడులన్ని చూస్తుంటే నేను ఈ రోజుల్లో పుట్టుంటే భావుండును అనిపిస్తుంది. మా రోజుల్లో ఇలాంటివి ఏమిలేవు. బన్నీ ని చూస్తుంటే కొంచెం ఈర్ష్యగా ఉంది. ఏమైనప్పటికీ ఓ మంచి ప్రయత్నం చేసిన త్రివిక్రమ్ కి, అందుకు ప్రోత్సహించిన నిర్మాతలకు నా అభినందనలు తెలుపుతున్నాను అని అన్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ...మాకు ఈ ఆలోచన రాగానే మమ్మల్ని ప్రోత్సహించిన మా నిర్మాతలకు ముందుగా ధన్యవాదాలు తెలుపు తున్నాను. జనరల్ గా మన వాడుక భాషలో 'పట్టుకో' అనే పధం చాలా ముఖ్యమైనది. దేవి స్టూడియోలో ఉన్నపుడు దాని మీద ఏదైనా ఓ సాంగ్ ప్లాన్ చేద్దాం అని అడిగినప్పుడు దేవి వెంటనే ట్యూన్ రెడీ చేసాడు. ఇక నో చెప్పకుండా ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభించాము.చాలా బిజీ గా ఉన్నప్ప్పటికీ దేవి చాలా సహకరించాడు. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి దేవి, బన్నీల కృషే కారణం . అలాగే నా టీం కూడా చాలా కష్టపడ్డారు.ముఖ్యంగా సాయి, నవీన్, ప్రసాద్ మురెళ్ళలకు నా థాంక్స్ అని అన్నారు.
దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...
ఈ సాంగ్ ఐడియా వచ్చినప్పుడు ఇందులో నేను డాన్సు చేయడం సాధ్యమో కాదో అని భయపడ్డాను. బన్నీ ఇన్స్పిరేషన్ తో చేయగలిగాను. బన్నీ ఏం చేసిన స్టయిలిష్ గా ఉంటాది. బన్నీ, నాకు గల స్నేహం వల్లే నేను బాగా చేయగలిగాను. మేం చేసిన ఈ స్వీట్ మెమరీ సాంగ్ ప్రతి సినిమాకు ప్రమోషన్లో భాగం గా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...
ఐడియాలనేవి చాలా మందికి వస్తాయి. వాటిని అమలు చేయడం గొప్ప. మా దర్శకుడికి వచ్చిన ఓ మంచి ఐడియా ఈ ప్రమోషనల్ సాంగ్ రూపం లో తెరకెక్కుతుంది. ఇలాంటి వాటికి నిర్మాతల ప్రోత్సాహం లేనిదే చేయడం చాలా కష్టం. మా నిర్మాతలు మాకు అన్ని విధాల సపోర్ట్ చేసారు. అలాగే మాకు సహకరించిన సాంకేతిక నిపుణులు అందరికి నా థాంక్స్ చెబుతున్నాను. దేవి ఎనర్జీ కి హాట్సాఫ్ అని అన్నారు.
డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ...
మా జులాయి చిత్రాన్ని ఆగస్ట్ 9వ తేదిన విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.