Idlebrain.Com
home
audio
movie
celeb
box-office
research
nostolgia
usa special
bollywood
hyd scene


Varun Sandesh - Nisha Agarwal film launch
వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ ల కొత్త చిత్రం ప్రారంభం
Home > News > Functions
Hyderabad
25 July 2012
Follow Us

వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ నటీనటులుగా కుమారస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పత్తికొండ అర్పిత, పత్తికొండ కిషోర్, కిరణ్ లు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ -2 ప్రారంభం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియో లో జరిగింది. పి భాను శంకర్ ఈ చిత్ర దర్శకుడు. పూజ కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ నివ్వగా , చంటి కెమెరా స్విచ్ ఆన్ చేసారు, బి గోపాల్ గౌరవ దర్శకత్వంలో చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ...
దర్శకులు భాను ఈ స్టోరి చెప్పినప్పుడే చాలా ఎంజాయ్ చేశా. కథ నాకు బాగా నచ్చింది. పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రను నేనీ సినిమాలో చేస్తున్నాను. నిషాతో నాకిది రెండవ సినిమా. అల్ రెడీ ఒక సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. బాబా సెహగల్ ఆ పాటను పాడారు.రవి వర్మ చక్కని సంగీతాన్ని అందిస్తున్నారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్ చెబుతున్నాను అని అన్నారు.

నిషా అగర్వాల్ మాట్లాడుతూ...
ఈ సినిమా చాల ఫన్నీగా ఉంటుంది. నాకు గుర్తింపునిచ్చే మంచి పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను. అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని అన్నారు.

దర్శకుడు భానుశంకర్ మాట్లాడుతూ...
ఈ బ్యానర్ లో నేను చేస్తున్న రెండవ చిత్రమిది. నామీద నమ్మకం పెట్టి నాకీ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. నామీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి హిట్ సినిమాను ఇస్తానని మాటిస్తున్నాను. ఈ కథకి హీరోగా వరుణ్ యాప్ట్.ఈ సినిమా తరువాత మా చిత్ర కథానాయిక నిషా సౌందర్య అంతటి పేరును గడిస్తుంది. మొదటి షెడ్యుల్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం అవుతుంది అని అన్నారు.

సంగీత దర్శకుడు రవి వర్మ మాట్లాడుతూ...
ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. ఒక పాట రికార్డింగ్ పూర్తయింది. నాకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు అని అన్నారు.

మంచి కథతో మా దర్శకుడు మమల్ని మెప్పించాడు. సినిమా బాగా వచ్చి హిట్ కావాలని కోరుకుంటున్నాము అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు అన్నారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు:
సుమన్, ఆలీ, డా. బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్ , రావు రమేష్ , వేణు మాధవ్, జ్యోతి, సురేఖ వాణి, ముమైత్ ఖాన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:చంద్రబోస్ , శ్రీమణి, సురేంద్ర, ఎడిటింగ్ :కోటగిరి వెంకటేశ్వరరావు, ఫోటోగ్రఫి:శ్రీనివాస్.జి , సంగీతం: రవివర్మ, నిర్మాతలు: పత్తికొండ అర్పిత, పత్తికొండ కిషోర్, కిరణ్, కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం:పి.భాను శంకర్.

Photo Gallery (photos by G Narasaiah)
emailabout usprivacy policycopy rightsidle stuff