pizza
Gentleman 50 Days celebrations
`జెంటిల్‌మ‌న్` 50 రోజుల వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 August 2016
Hyderaba
d

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం `జెంటిల్‌మ‌న్‌`. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. ఈ చిత్రం 50 రోజుల వేడుక హైద‌రాబాద్‌లో గురువారం జ‌రిగింది.

నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ``మా చిత్రం 28 కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌టం ఆనందంగా ఉంది. నాని అర‌కు షూటింగ్‌లో ఉండి ఈ కార్య‌క్ర‌మానికి రాలేక‌పోయారు. డేవిడ్‌నాథ‌న్ అందించిన స్టోరీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఇక‌పై మంచి చిత్రాల‌నే తీయ‌డానికి నా వంతు కృషి చేస్తాను. ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మ‌ణిశ‌ర్మ సంగీతం, ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వం సినిమాకు హైలైట్ అయ్యాయి. న‌టీన‌టుల న‌ట‌నకు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించిన విష‌యం తెలిసిందే`` అని అన్నారు.

డేవిడ్ నాథ‌న్ మాట్లాడుతూ ``దాదాపు ఐదేళ్ల క్రితం నేను ఈ నిర్మాత‌కు క‌థ చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చి ఓకే చేశారు. నానితో ప‌నిచేయ‌డం చాలా ఆనంద‌గా ఉంది. సినిమా కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు`` అని తెలిపారు.

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మాట్లాడుతూ ``సినిమా 10, 15, 25 రోజులు ఆడింద‌ని విజ‌యోత్స‌వాల‌ను జ‌రుపుకుంటున్న త‌రుణంలో మా జంటిల్‌మ‌న్ 50 రోజులు ఆడ‌టం ఆనందంగా ఉంది. 2008లో నానితో అష్టాచ‌మ్మా చేశాను. ఆ త‌ర్వాత ఎనిమిదేళ్ల త‌ర్వాత ఈ సినిమాను చేస్తున్న‌ప్పుడు దాన్ని క్యాష్ చేసుకోకూడ‌ద‌ని అనుకున్నాం. అందుకే మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశాం. నిర్మాత‌గారు డేవిడ్ నాథ‌న్‌గారిని ప‌రిచ‌యం చేశారు. ఆ త‌ర్వాత నానిని క‌లిసి క‌థ చెప్పాం. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాకు ముందు నాని ఈ క‌థ‌ను సెల‌క్ట్ చేసుకున్నారు. క‌థ‌ను ఎంపిక చేసుకోవ‌డంలో త‌ను ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడో ఈ స‌క్సెస్ మ‌రో సారి నిరూపించింది. ఈ సినిమాతో నివేదాథామ‌స్ మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. మిగిలిన వారంద‌రు కూడా చాలా బాగా చేశారు. నా కెరీర్‌లో అష్టాచ‌మ్మా, గోల్కొండ హైస్కూల్ త‌ర్వాత అత్యంత సులువుగా జ‌రిగిన షూటింగ్ ఇది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, నేప‌థ్య సంగీతం సినిమాకు పెద్ద్ ఎసెట్ అయింది. క‌త్తిమీద సాములాంటి ఇలాంటి క‌థ‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించినందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటి0చారు

ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved