pizza
Vikram's Inkokkadu music launch
`ఇంకొక్కడు` ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 August 2016
Hyderaba
d

శివపుత్రుడుఅపరిచితుడునాన్నఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార,నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇరుముగన్`. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి `ఇంకొక్కడుఅనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.  ఆనంద్ శంకర్ దర్శకుడు. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో విజయేంద్రప్రసాద్, సి.కల్యాణ్, రంజిత్ రెడ్డి, రాజ్ కందుకూరి సూళూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రఫీ, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాలసుబ్రమణ్యం, అభిషేక్, సారథి, నీలిమ, తిరుపతి రెడ్డి, స్నేహ గ్రూప్ ఎం.డి.వరుణ్ రెడ్డి, ప్రగ్యా జైశ్వాల్,

వరుణ్ రెడ్డి, పగ్యా జైశ్వాల్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

బిగ్ సీడీని విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. ఆడియో సీడీలను హీరో విక్రమ్ విడుదల చేసి తొలి సీడీని విజయేంద్రప్రసాద్ కు అందించారు. ఈ సందర్భంగా...

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``విక్రమ్ గారిలో మంచి డేడికేషన్ ఉంది. త‌న‌లో క‌ల్మ‌షం క‌న‌ప‌డదు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే త‌మిళంలో ఈ చిత్రానికి ఇరు ముగ‌న్ అనే పేరు పెట్టారు. అంటే రెండో ముఖమ‌ని అర్థం. ఎంట‌ర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ ``విక్ర‌మ్‌గారి యాక్టింగ్‌లో కూడా చీటింగ్ క‌న‌ప‌డ‌దు. అంత మంచి న‌ట‌న క‌న‌ప‌డుతుంది. హీరోగావ్య‌క్తిగా విక్ర‌మ్‌ను మించిన వ్య‌క్తి లేడు. శిబు నాకు మంచి ఫ్రెండ్‌. ఆనంద్‌కు విక్ర‌మ్ లాంట వ‌జ్రం దొరికాడు. ఎంతో మంది చేయాల‌నుకున్న స‌బ్జెక్ట్‌ను విక్ర‌మ్ చేయ‌డంతోనే పెద్ద స‌క్సెస్ సాధించాడు. నిర్మాత నెల్లూరుకి చెందిన వాడు. ఇండ‌స్ట్రీలో పెద్ద నిర్మాత‌లంద‌రూ నెల్లూరుకి చెందిన వారే. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ``నీలం కృష్ణారెడ్డిగారు పౌల్ట్రీ బిజినెస్ చేసి అన‌తి కాలంలో డిస్ట్రిబ్యూట‌ర్‌ఇప్పుడు నిర్మాత‌గా ఎదిగారు. త‌న‌కు మొద‌టి చిత్రంతో మంచి నిర్మాత‌గా పెద్ద స‌క్సెస్ సాధించి ప్ర‌ముఖ నిర్మాతగా పేరు సంపాదించుకుంటాడ‌ని భావిస్తున్నాను. యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

Pragya Jaiswal Glam gallery from the event

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``విక్ర‌మ్‌కు సినిమా అంటే డేడికేష‌న్‌ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. సినిమాలో క్యారెక్ట‌ర్ కోసం ఎంతో రిస్క్ చేస్తుంటారు. హరీష్ జైరాజ్ వంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేయ‌డం చాలా ప్ల‌స్ అవుతుంది. పాట‌లు బ్ర‌హ్మాండంగా ఉన్నాయి. విక్ర‌మ్ తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చేయాల‌ని కోరుకుంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను``అన్నారు.

అభిషేక్ మాట్లాడుతూ ``నిర్మాత కృష్ణారెడ్డిగారికిఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ``ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

తిరుప‌తి రెడ్డి మాట్లాడుతూ ``పౌల్ట్రీ ఇండ‌స్ట్రీలో కృష్ణారెడ్డిగారు స‌క్సెస్ సాధించిన విధంగానే సినిమా ఇండ‌స్ట్రీలో నిర్మాత‌గారు పెద్ద రేంజ్‌కు చేరుకోవాల‌ని కోరుకుంటూ టీంకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను`` అన్నారు.

ప్ర‌గ్యా జైశ్వాల్ మాట్లాడుతూ ``విక్ర‌మ్ గారు ఎప్పుడూ కొత్త బౌండ‌రీస్‌ను క్రియేట్ చేస్తుంటారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ సూప‌ర్బ్‌గా ఉంది. అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

వ‌రుణ్ రెడ్డి మాట్లాడుతూ ``విక్ర‌మ్‌గారు ఏ సినిమా చూసినా ఒకేలా క‌న‌ప‌డ‌రు. కొత్త‌గా క‌న‌ప‌డుతుంటారు. ఈ సినిమాలో కూడా అలాగే క‌న‌ప‌డుతున్నారు. నిర్మాత కృష్ణారెడ్డిగారు మంచి సినిమాల‌ను అందించాల‌ని తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌స్తున్నారు. ఆయ‌న‌కుయూనిట్ స‌భ్యుల‌కు కంగ్రాట్స్‌`` అన్నారు.

శిబు త‌మీన్స్ మాట్లాడుతూ ``చిరంజీవిగారు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను సైమా వేడుక‌లో ఆవిష్క‌రించారు. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. విక్ర‌మ్‌గారిని అభినందించారు. నేను డిస్ట్రిబ్యూట‌ర్ నుండి నిర్మాత‌గా ఎదిగాను. విక్ర‌మ్‌గారు మాత్ర‌మే ఈ సినిమా చేయ‌గ‌ల‌రు. స్క్రిప్ట్ ఆ విధంగా కుదిరింది. హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్ చేశారు. సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో త‌మిళంలో విడుద‌ల చేస్తాం. తెలుగులో మాత్రం అనుకున్న సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల కావ‌డం లేదు. అందుకు తెలుగు ప్రేక్ష‌కులకు ఏమీ అనుకోవ‌ద్దు. చాలా స్ట‌యిలిష్డిఫ‌రెంట్ మూవీగా ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కించారు. క‌థ విన‌గానే ఎలాగైనా సినిమా చేయాల‌ని నిర్ణ‌యంతో చేశాం. మంచి టీం కుదిరింది. కృష్ణారెడ్డిగారుసిరాజ్‌గారి స‌హకారంతో సినిమాను తెలుగు రైట్స్ తీసుకున్నారు. నిజానికి ఆగ‌స్ట్ రెండోవారంలో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ పెద్ద సినిమా ఉంద‌ని సెప్టెంబ‌ర్లో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. ఇప్పుడు ఆ పెద్ద సినిమా తెలుగులో సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల‌వుతుంది. కానీ కృష్ణారెడ్డిగారు డేట్ మార్చ‌మ‌ని అడ‌గ‌కుండా తెలుగులో మ‌రో రిలీజ్ డేట్ చూసుకుని విడుదల చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు``అన్నారు.

ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ మాట్లాడుతూ ``తెలుగు ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకుంటున్న తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. వీరి అభిమానం చూసి తెలుగులో స్ట్ర‌యిట్ మూవీ చేయాల‌నుకుంటున్నాను. విక్ర‌మ్‌గారి వ‌ల్లే ఈరోజు నేనిక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే రెండు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ మ‌న‌కు క‌న‌ప‌డ‌తాయి. రా ఏజెంట్ అఖిల‌న్ పాత్ర‌లోల‌వ్ అనే మ‌రో పాత్ర‌లో విక్ర‌మ్ క‌న‌ప‌డ‌తారు. ల‌వ్ పాత్ర‌ను చాలా డిఫ‌రెంట్‌గా డిజైన్ చేయాల్సి వ‌చ్చింది. చాలా క‌ష్ట‌ప‌డ్డామ‌ని చెప్పాలి. బాగా వ‌చ్చింది. మంచి టెక్నిక‌ల్ టీం కుదిరింది. కృష్ణారెడ్డిగారుశిబు త‌మీన్స్‌గారు సినిమాను పోటీప‌డి ప్ర‌మోట్ చేస్తున్నారు. క‌చ్చితంగా తెలుగు ఆడియెన్స్‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ``నిర్మాత‌గా తొలి చిత్రం. ప‌ది సినిమాలు వ‌ర‌కు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇరు ముగ‌న్ టీజ‌ర్ అద్భుతంగా అనిపించ‌డంతో సినిమా వివ‌రాలు తెలుసుకున్నాను. విక్ర‌మ్‌,న‌య‌న‌తార‌నిత్యామీన‌న్‌హ‌రీష్ జైరాజ్‌శిబుత‌మీన్స్ త‌దిత‌రులు క‌లిసి చేస్తున్న సినిమా ఇది అని తెలిసి తెలుగులో సినిమాను విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యాను. ఈ సినిమా సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల‌వుతుంది.  మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం`` అన్నారు.

హీరో విక్ర‌మ్ మాట్లాడుతూ ``అఖిల‌న్ హీరో అయితేల‌వ్ విల‌న్. రెండు క్యారెక్ట‌ర్స్ చేశాను. నేను చేసిన బెస్ట్ క్యారెక్ట‌ర్స్ లో ఇదొక‌టి. ఇలాంటి మంచి స్టోరీ ఇవ్వ‌డ‌మే కాకుండాఅంతకంటే అద్భుతంగా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆనంద్‌కు మంచి భ‌విష్య‌త్ ఉంది. ఆయ‌న‌తో ఇంకా రెండుమూడు సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. న‌న్ను చాలా స్ట‌యిలిష్‌గా తెర‌కెక్కించారు. శిబు త‌మీన్స్‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. కొన్ని కార‌ణాలు వ‌ల్ల ఆల‌స్య‌మైనా ఆయ‌న ముందుండి మంచి టీంను ఏర్ప‌రిచి సినిమాను పూర్తి చేశారు. చాలా తెలివైన నిర్మాత‌. అలాగే కృష్ణారెడ్డిగారు తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. హ‌రీష్ జైరాజ్‌గారు మంచి ట్యూన్స్‌తో పాటుఎక్స‌లెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సురేష్ సెల్వ‌రాజ్ చాలా మంచి ఆర్ట్ వ‌ర్క్ ఇచ్చారు. రాజ‌శేఖ‌ర్‌గారు ప్ర‌తి సీన్‌ను త‌న కెమెరాతో రిచ్‌గా చూపించారు. మంచి టీంతోమంచి సినిమాను రూపొందించ‌గ‌లిగాం. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved