pizza
Jeelakarra Bellam Music Launch
‘జీలకర్ర బెల్లం’ ఆడియో విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

14 April 2016
Hyderabad

శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ బ్యానర్ పై అభిజీత్, రేష్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం జీలకర్ర బెల్లం. వజియ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో సీడీలను దశరథ్ విడుదల చేసి తొలి సీడీని దాస్య నాయక్ కు అందించారు. ఈ సందర్భంగా....

కె.దశరథ్ మాట్లాడుతూ ‘’స్టార్ హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న హీరో అభిజీత్. తను లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ చిత్రంలో చక్కగా యాక్ట్ చేశాడు. తనకు ఈ చిత్రంతో మంచి బ్రేక్ రావాలి. అలాగే తెలుగు హీరోయిన్ అయిన రేష్మకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత నౌరోజీ రెడ్డి మాట్లాడుతూ ‘’ప్రస్తుతం యువత ఫేస్ చేస్తున్న ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. విడాకులు కూడా వెంటనే తీసేసుకుంటున్నారు. మంచి చదువు, సంపాదన ఉండటంతో తల్లిదండ్రులు కూడా అడగలేని పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి ఓ సిచ్చువేషన్ కు మెసేజ్ ను యాడ్ చేసి నిర్మించిన చిత్రమే ఇది. అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో విడుదల చేయలేదు. ఈ నెల 29న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

డైరెక్టర్ విజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’నా డెబ్యూ మూవీ. ఇప్పటి తరం పెళ్లి ఆలోచనలకు చిన్న మెసేజ్ జోడించి అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసిన సినిమా ఇది. వందేమాతరంగారు మంచి మ్యూజిక్ ను అందించారు. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమా పెద్ద సక్సెస్ సాధించి అందరికీ మంచి పేరు తేవాలి’’ అన్నారు.

వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’మంచి మ్యూజిక్ కుదిరింది. పాటలు వినడానికే కాదు, పిక్చరైజేషన్ కూడా బావుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
అభిజీత్ మాట్లాడుతూ ‘’ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య ఈగో వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి. చివరకు ప్రేమ గెలిచిందా, ఈగో గెలిచిందా అనేదే సినిమా’’ అన్నారు.

రేష్మ మాట్లాడుతూ ‘’ప్రేమ, పెళ్లిపై చిన్న మెసేజ్ తో చేసిన సినిమా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్, గుణ్ణం గంగరాజు, వెనిగళ్ళ రాంబాబు, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved