pizza
Kali music launch
విడుదలకు సిద్ధమవుతున్న ‘కలి’
ou are at idlebrain.com > News > Functions
Follow Us

14 April 2016
Hyderabad

ఏడుకొండలు సమర్పణలో యం.అనురాధ నిర్మాతగా కృష్ణ మామిడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కలి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో విడుదలకు సన్నాహాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శకుడు కృష్ణ మామిడి మాట్లాడుతూ ‘’2008లో ఇట్లు నీ వెన్నెల సినిమాతో పాస్ మార్కులు పొందిన నేను తిరిగి ఈ 2016లో కొత్తవారితో 2 గంటలసేపు నిడివి గల ఓ డిఫరెంట్ హర్రర్ కథ, కథనంతో కలి పేరుతో సినిమా చేశాను. ఓ ప్రేమికుల జంట, వారాంతంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లే రెండు జంటలు, మంచి చెడులను గమనించకుండా అమ్మాయిలతో స్వర్గ సుఖాలు పొందే పోలీస్, పిల్లలు లేకపోయినా ఒకరికి ఒకరు పిల్లలుగా భావించుకునే ఫారెస్ట్ ఆఫీసర్, ఇతర క్యారెక్టర్స్ మధ్య జరిగే ఇతివృత్తమే ఈ సినిమా మానవుడు తలచిన ప్రతిదీ జరిగితే మరొకరితో పని ఉండదు. కానీ ఎవరైనా సహయం అడిగితే చేయగలిగే స్థితిలో ఉండి సహయం చేయకపోవడం వారి వివేకాన్ని బట్టి ఉంటుంది. మంచి చేయబోతే చెడు ఎదురయ్యే కథాంశంతో రూపొందిన సినిమా కలి. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ లేదా మే మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

Glam galleries from the event

గౌతమ్, ఉదయ్, కిషోర్, కృతిక్, శ్రీనివాస చక్రవర్తి, అజయ్, ప్రశాంత్, భవ్యశ్రీ, అంకిత, శ్రావణి సంధ్య, మమత, లలిత, పద్మ శ్రీనివాస్, సుధాకర్, సాహితి, మహేంద్ర, నరేంద్ర, బేబి నవ్య, మాస్టర్ సోమశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: యస్.సత్యానంద్, ఎడిటర్: మహేంద్రనాథ్, పాటల మ్యూజిక్: విజయ్ బొల్ల, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: గిటార్ రమణ, లిరిక్స్: వెంలంకి విజయలక్ష్మి విక్కి, నిర్మాత: యం.అనురాధ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణ మామిడి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved