pizza
Tholi Premalo Music Launch
`
తొలి ప్రేమ‌లోఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 July 2016
Hyderabad

యాదాద్రి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందుతున్న సినిమా `తొలి ప్రేమ‌లో`. త‌మిళంలో విడుద‌లైన క‌య‌ల్‌కు అనువాద‌మిది. త‌మ‌టం శ్రీనివాస‌గౌడ్‌, జ‌యార‌పు రామ‌కృష్ణ‌, గౌలిఖార్ శ్రీనివాస్ నిర్మాత‌లు. ఈ సినిమాకు ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డి.ఇమాన్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. చంద్ర‌న్ హీరో. ఆనందిని నాయిక‌. ఈ సినిమా పాట‌ల సీడీని హీరో చంద్ర‌న్ విడుద‌ల చేశారు.

టి.ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ ``త‌మిళంలో మంచి హిట్ అయిన సినిమా ఇది. సినిమాలో కంటెంట్ ఉంటే థియేట‌ర్ల వాళ్లు ప‌రిగెత్తుకుంటూ వ‌స్తార‌ని ఇటీవ‌లే బిచ్చ‌గాడు నిరూపించింది. సినిమాలో ద‌మ్ముంటే అంద‌రూ బిచ్చ‌గాళ్ల‌గా వ‌స్తార‌ని నిరూపించిన సినిమా అది. ఈ సినిమాలోనూ ఆ ద‌మ్ము ఉంది. ప్ర‌మాద‌క‌ర‌మైన లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించారు ప్ర‌భు సాల్మ‌న్‌. త‌మిళంలో చాలా బాగా ఆడింది`` అని చెప్పారు.

తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ``ఈ సినిమాలో చివ‌రి 20 నిమిషాలు చాలా కీల‌కం`` అని అన్నారు.

స‌ముద్ర మాట్లాడుతూ ``2012లాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది`` అని తెలిపారు.

మ‌నోజ్ నందం మాట్లాడుతూ ``సినిమా హిట్ కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను. పాట‌లు బావున్నాయి. ట్రైల‌ర్ న‌చ్చింది`` అని చెప్పారు.

శోభారాణి మాట్లాడుతూ`` సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ద‌ర్శ‌కుడు డెడికేటెడ్‌గా ఈ సినిమాను చేశాడు. ఫీల్ గుడ్ సినిమాల‌కు ఎప్పుడూ మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది`` అని తెలిపారు.

ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ ``త‌మిళంలో ప్ర‌భు సాల్మ‌న్ త‌న‌కంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ఇమాన్ చాలా తెలుగు సినిమాల‌కు మ్యూజిక్ కండెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. ల‌వ్ స్టోరీలో ఉండాల్సిన అన్ని ఎమోష‌న్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అన్నీ మూడ్స్ ని కేరీ చేశారు`` అని అన్నారు.

చంద్ర‌న్ మాట్లాడుతూ ``త‌మిళంలో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగులోనూ భారీ విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో యాట స‌త్య‌నారాయ‌ణ‌, డి.జ‌గ‌దీశ్‌, ఆదిత్యా ఓమ్‌, విజ‌య్ వ‌ర్మ‌, సుబ్బారెడ్డి, మాధ‌వీల‌త‌, స‌ముద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved