`
pizza

Bellamkonda Sai Srinivas & Kavya engaged
ఘనంగా జరిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ & కావ్య రెడ్డి నిశ్చితార్థం

You are at idlebrain.com > News > Functions
Follow Us


07 April 2025
Hyderabad


యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్‌ శంకర్‌పల్లిలోని ఓ విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో సినీ పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు.

నిశ్చితార్థ వేడుకలో సాయి- కావ్య జంట తమ ప్రత్యేక బంధాన్ని ప్రతిబింబించేలా కస్టమైజ్డ్ జువెలరీను ధరించారు. ఆ అందాన్ని మరింత పెంచుతూ వారి ఎంగేజ్‌మెంట్ లుక్స్‌ను ఢిల్లీకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అభిషేక్ శర్మ డిజైన్ చేశారు. సంప్రదాయం, ఆధునికత కలిసిన ఈ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు, నెటిజన్లు సాయి- కావ్య జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సాయి శ్రీనివాస్ & కావ్య రెడ్డి వివాహ వేడుకకు శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు.

వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చిరస్మరణీయమైన కలయికకు అపూర్వ వేదికగా నిలుస్తుంది.


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved