pizza
Kaushik Babu Birthday celebrations 2015
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 August 2015
Hyderabad

వినోదాత్మకంగా ఖాకీసత్తా

కౌశిక్ బాబు కథానాయకుడిగా శశాంక్ వోలేటి దర్శకత్వంలో ఆకుల లోకేష్, నూకల చిట్టిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ కె'. ఖాకీసత్తా.. ఉపశీర్షిక. ఆర్తి కథానాయిక. అల్యూమినియం ఫ్యాక్టరీలో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సోమవారం హీరో కౌశిక్ బాబు జన్మదిన వేడుకలు యూనిట్ సభ్యుల మధ్య జరిగాయి.

కౌశిక్ బాబు మాట్లాడుతూ.. "ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉంది. పోలీస్ డ్రెస్ వేసుకుని తిరుగుతూ దొంగ పనులు చేసే ఓ కుర్రాడి కథ ఇది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతుంది. దొంగ పోలీస్ ఎలా అయ్యాడనేది ఆసక్తికరం. రమణ మాస్టర్ నేతృత్వంలో జిహాది ట్రైనింగ్ జరుగుతున్న యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. పోలీస్ సిద్దయ్య పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నార"న్నారు.

నిర్మాత లోకేష్ మాట్లాడుతూ.. "నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మా హీరో కౌశిక్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. యదార్థ సంఘటనల ఆధారంగా తీవ్రవాద నేపథ్యంలో చిత్రం రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. జూలై 29న ప్రారంభమైన సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. 60శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీను ప్రకటిస్తామ"న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... "వినోదం, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.

కార్యక్రమంలో ఆర్తి, నాగ శ్రీవత్స, దీపక్ మీనన్, ముక్తార్ ఖాన్, రమణ తదితరులు పాల్గొన్నారు. సంపత్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : శారదా విజయబాబు, మాటలు : మోహన్ దీక్షిత్.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved