pizza
Sai Kumar Birthday Celebrations 2016 with Chuttalabbayi team
`చుట్టాల‌బ్బాయి` యూనిట్‌తో కలిసి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకున్న సాయికుమార్
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 July 2016
Hyderaba
d

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి' ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ఓ ముఖ్య‌పాత్ర పోషించారు. ఈ చిత్రంలో న‌టించిన సాయికుమార్ పుట్టిన‌రోజు(జూలై 27)ను చుట్టాల‌బ్బాయి టీమ్ స‌మ‌క్షంలో జ‌రుపుకున్నారు. అనంతరం చుట్టాల‌బ్బాయి స్పెష‌ల్ టీజ‌ర్ ను సాయికుమార్ రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా ..

సాయికుమార్ మాట్లాడుతూ ``నేను, ఆది గతంలో కలిసి న‌టించాల‌నుకున్నా మంచి క‌థ కోసం వెయిట్ చేశాను. చుట్టాల‌బ్బాయిలో ఇద్ద‌రం క‌లిసి న‌టించాం. ఇద్ద‌రం చేసిన తొలి చిత్ర‌మిది. అందువ‌ల్ల నా 55వ పుట్టిన‌రోజు అయినా . ఒక క్యాండిల్ పెట్టి కేక్ క‌ట్ చేశాను. ఈ సినిమాకు సంబంధించిన డ‌బ్బింగ్ కూడా కంప్లీట్ చేశాను. ప్రేమ‌కావాలి, ల‌వ్ లీ చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన‌ప్ప‌టికీ ఆది బిగ్ స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. త‌ప్ప‌కుండా చుట్టాల‌బ్బాయి ఆది కెరీర్ లో బిగ్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటున్నాను. వీర‌భ‌ద్ర‌మ్ విభిన్న‌మైన క‌థాంశంతో మంచి సినిమాను రూపొందించాడు. అలాగే నిర్మాత‌లు ఏమాత్రం రాజీప‌డ‌కుండా క‌థ‌కు ఏం కావాలో అవ‌న్నీఉండేలా చిత్రాన్ని మంచి క్వాలిటీతో నిర్మించారు. త‌మ‌న్ ఎక్స్ ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించాడు. ప‌టాస్, సుప్రీమ్, స‌రైనోడు...ఇలా ఈమ‌ధ్య నేను న‌టించిన సినిమాల‌న్నీ స‌క్సెస్ అవుతున్నాయి. ఆవిధంగా చూసుకున్నా ఖ‌చ్చితంగా ఈ సినిమా స‌క్సెస్ అవుతుంది ``అన్నారు.

డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ మాట్లాడుతూ ``సాయికుమార్ గారు చాలా మంచి మ‌న‌సున్న మ‌నిషి. ఈ చిత్రానికి త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతం అందించారు. ఆగ‌ష్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నాం. ఖ‌చ్చితంగా చుట్టాల‌బ్బాయి అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

నిర్మాత రామ్ తాల్లూరి మాట్లాడుతూ ``ఈ చిత్రంలో సాయికుమార్ విల‌క్ష‌ణ పాత్ర పోషించారు. ఈ క్యారెక్ట‌ర్ ను వీర‌భ‌ద్ర‌మ్ చాలా బాగా డిజైన్ చేసారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని అంద‌రూ ఆద‌రించాల‌ని కోర‌కుంటున్నాను`` అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ ``ఎప్ప‌టి నుంచో నాన్న నేను క‌లిసి సినిమా చేయాల‌నుకునేవాడిని చుట్టాల‌బ్బాయితో అది నేర‌వేరింది. భ‌విష్య‌త్ లో ఇద్దరం క‌లిసి మ‌రిన్నిసినిమాలు క‌లిసి చేయాల‌నుకుంటున్నాను. చుట్టాల‌బ్బాయి పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved