తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆధ్వర్యం లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవం గా కార్డిఫ్ మహా నగరం లోని స్థానిక ఇండియా సెంటర్ లో జరిగాయి. ఈ వేడుకకు వేల్స్ లోని ప్రతి ఒక్క తెలుగు కుటుంభం హాజరు అయ్యింది.
తెలుగు సాంప్రదాయాలు మరియు సంస్కృతి ప్రతిబింభించేలా జరిగిన ఈ వేడుకలు ఎంతో సాంప్రదాయ బధ్ధంగా చక్కని వాతావరణం లో జరిగాయి.
కార్యక్రమం లో జరిగిన పంచాగ శ్రవణం, వేడుకకు విచ్చేసిన ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది.
ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సంస్కృతి కార్యక్రమాలు, ముఖ్యం గా భరత నాట్యం, పిల్లల నాట్య ప్రదర్శన మరియు పిల్లలు ప్రదర్శించిన తెలుగు సంప్రదాయ వస్త్రాలంకరణ అందరినీ విశేషం గా ఆకట్టుకున్నాయి.
తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ వారు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి మరియు విందు భోజనాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించారు.
ఈ సందర్భంగా ఇటీవల తెలుగు పాట "నాటు నాటు" అంతర్జాతీయం గా సాధించిన ఘనత ను అందరు ప్రశంచించి, ప్రతి ఒక్కరు ఈ పాటకు నృత్యం చేసి ఆనందించారు.
తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని వేల్స్ లోని ప్రతి ఒక్క తెలుగు కుటుంబాలను దగ్గరకు చేశాయి. వేదికను అందంగా అలంకరించిన ప్లానెట్ సేఫ్ పార్టీ మరియు కార్యక్రమాన్ని చూడ ముచ్చటగా చిత్రికరించిన స్థానిక పాశం ప్రొడక్షన్స్ వారిని, మరియు కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన ఫ్రీడమ్ సర్కిల్స్, GP ఫిట్టింగ్స్, TMR వారిని అందరు అభినందించారు. తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు ప్రశంసించారు.