pizza
Show Time first look launch
'
షో టైమ్‌టీజర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 June 2016
Hyderabad

రమా గ్రూప్స్‌ వెంచర్‌ నుండి సినిమాల నిర్మాణం కోం రమా రీల్స్‌ బ్యానర్‌ను స్టార్ట్‌ చేశారు. ఈ సంస్థ అధినేత శ్రీజాన్‌ సుధీర్‌ పూదోటనిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను నిర్మించడానికి నిర్ణయించుకుంది. అందుకు లియో యు సారధ్యంలో లోహాస్‌ గ్లోబెల్‌ ఎంటర్‌టైనెమెంట్‌వరల్డ్‌ మొబైల్‌ హెల్డింగ్స్‌ ఐ.ఎన్‌.సితైవాన్‌లో మల్టీనేషన్‌ కంపెనీ అయిన వీ.ఆర్‌.టెక్నాలజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. అందులో భాగంగా రూపొందుతోన్న చిత్రం 'షో టైమ్‌'. ఎస్‌.ఎస్‌.కాంచీ దర్శకత్వంలో రణధీర్‌రుక్‌సర్‌ మిర్‌ జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రమా రీల్స్‌ లోగోను ఎం.ఎం.కీరవాణి ఆవిష్కరించారు. వెబ్‌ పేజీని కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా షో టైమ్‌ పోస్టర్‌ను కల్యాణి కోడూరి విడుదల చేశారు. టీజర్‌ను ఎస్‌.ఎస్‌.రాజమౌళి విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''నా సక్సెస్‌ఫుల్‌ జర్నీలోరాజమౌళికీరవాణిల తండ్రులకు కూడా భాగముంది. అలాగే ఇప్పుడు కీరవాణిరాజమౌళి కూడా నెంబర్‌వన్‌గా రాణిస్తున్నారు. వీరివురి సక్సెస్‌కు ఓ తండ్రిలా,గురువులా చాలా ఆనంద పడుతున్నాను. అలాగే ఇప్పుడు తొలిసారి డైరెక్షన్‌ చేస్తున్న కాంచీ వారి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. టీజర్‌ అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది'' అన్నారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ ''మా ఫ్యామిలీలో మేం 13 మంది కజిన్స్‌ ఉండేవాళ్ళం మా అందరికీ అన్నయ్య కీరవాణి రాజు అయితే కాంచీ మంత్రిలా ఉండేవారు. అందువల్ల నాకు కాంచీ అన్నయ్య అంటే భయంగా ఉండేది. ఇక షో టైం అంటే నాకు చిన్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చేది. అందరినీ నెలకొకసారి సినిమాకు తీసుకెళ్లేవారు. అందరం సినిమాకు బయలుదేరేటప్పుడు రాజన్నయ్య బాత్రూమ్‌ వెళితే వీడితో పెట్టుకోకూడదు అంటూ తిట్టుకునేవారు. ఆ విషయం నాకు గుర్తుకు వచ్చింది. అలాగే నేను టీనేజ్‌ ఉన్నప్పుడు హీరో కావాలనుకుని పల్లెటూర్లోని గుడిలో కూర్చొని పూజలు చేస్తుండేవాడిని. హీరో కావాలనుందని ఎవరికీ సిగ్గుతో చెప్పేవాడిని కాను. అయితే ఓ రోజు కాంచీ అన్నయ్య నన్ను పిలిచి ఏమవుతామని అనుకుంటున్నావని అడిగాడు. నేను హీరో కావాలనుందని చెప్పాను. అప్పుడు తిట్టకుండా హీరో కావాలంటే ఇలా పల్లెటూళ్ళో ఉండకూడదు. సినిమాల్లో ఉంటేనే నువ్వు అనుకున్నది సాధిస్తావని చెప్పారు. అలా కాంచీ అన్నయ్య నాకు గైడ్‌ అయ్యారు. ఇక మా ఫ్యామిలీలో అన్నీ విషయాలు తెలిసిన వ్యక్తి కాంచీ అన్నయ్యే. ఏ విషయంపై అయిన ఆయనకు అవగాహన ఉంటుంది. సాధారణంగా నా సినిమాలో తప్పులను ఇట్టే పట్టేస్తుంటారు. ఎలా చేయాలో కూడా చెబుతుంటారు.

Ruksaar Mir Glam gallery from the event

అందుకే ఆయన్ను సర్వజ్ఞుడు అంటుంటాం. నిజానికి ఆయన ఎప్పుడో డైరెక్టర్‌ కావాల్సింది కానీ ఇప్పుటికీ కుదరింది. అసలు అన్నయ్య ఎలాంటి సినిమాను చేస్తాడోనని ఆసక్తిగా ఉండేది. ఇప్పుడు ఆయన థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. అలాగే సినిమా ఫస్ట్‌లుక్‌తో ఇంప్రెషన్‌ క్రియేట్‌ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైలర్‌సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. నిర్మాతలకుయూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ''రాజమౌళి చెప్పినట్లు కాంచీ ఎప్పుడో డైరెక్టర్‌ కావాల్సినవాడు. కానీ దేనికైనా టైం రావాలి. ఈ షో టైమ్‌ తన టాలెంట్‌కు షో టైం అని తెలుస్తుంది. సాధారణంగా నేనునా డ్రైవర్‌తో ముందు వాహనానికి ఇరవై నుండి ముప్పై అడుగుల దూరాన్ని మెయిటెయిన్‌ చేయమని చెబుతాను. కానీ ఆ గ్యాప్‌లో ఎవరైనా వేగంగా వచ్చి దూరేసి వెళ్ళిపోతే అతని వెనుకనే వెళ్ళి చొక్కా పట్టుకుని చొప్పుతో కొట్టాలనేంత ఎమోషన్‌ వచ్చేస్తుంది. అలాంటి ఎమోషనే ఈ సినిమాలో హీరోఆ ఎమోషనే విలన్‌'' అన్నారు.

ఎస్‌.ఎస్‌.కాంచీ మాట్లాడుతూ ''డైరెక్షన్‌ చేయాలనుకోవడం నా డ్రీమ్‌ కాదు కానీ ఎప్పటినుండో చేయాలని మాత్రం అనుకుంటున్నాను. అది ఈ రోజు నేరవేరింది. అందుకు కారణమైన సుధీర్‌కు థాంక్స్‌. నేను డైరెక్షన్‌ చేయడంలో ఆలస్యమైతే అయ్యింది కానీ ఈ గ్యాప్‌లో నేను సినిమాకు సంబంధించిన చాలా విషయాలను తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు సినిమాను బాగా డైరెక్ట్‌ చేశానని భావిస్తున్నాను. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని భావిస్తున్నాను'' అన్నారు.

నిర్మాత సుధీర్‌ మాట్లాడుతూ ''తెలుగు సినిమాను అంతర్జాతీయ సినిమాకు ముడిపెట్టాలని ఐదేళ్ల క్రితం వచ్చిన ఆలోచనతోనే ఇప్పుడు ఈ బ్యానర్‌ను స్టార్ట్‌ చేశాం. అందులో భాగంగానే వి.ఆర్‌.టెక్నాలజీతో సినిమా చేస్తే ఎలా ఉంటుందనుకున్నాను. ఇప్పుడు ఇండియన్‌ సినిమాను ఇంటర్నేషనల్‌ స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా కాంచన సినిమాను చైనాకొరియన్‌ భాషల్లో చిత్రీకరించబోతున్నాం. రెండు నెలల్లో జాకీచాన్‌తో ఓ సినిమాను చేయబోతున్నాం'' అన్నారు.

హీరో సుమంత్‌ మాట్లాడుతూ ''కాంచీగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. టీజర్‌మ్యూజిక్‌ చాలా బావుంది. సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో హీరో రణధీర్‌హీరోయిన్‌ రుక్‌సర్‌ మీర్‌ సహా యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

కార్తీక్‌సంజిత్‌ఆదిత్యసత్యఅమిత్‌ శర్మరవిప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథస్క్రీన్‌ప్లే: ఎస్‌.ఎస్‌.కాంచీమ్యూజిక్‌: ఎం.ఎం.కీరవాణిసినిమాటోగ్రఫీ: భూపతి.కెస్టైలింగ్‌సెట్‌ డేకరేషన్‌: సీతా కాంచీ,ఎడిటింగ్‌: ఎన్‌.హెచ్‌.హరివి.ఎఫ్‌.ఎక్స్‌: వెంకట్‌ సునీల్‌రావ్‌ ఆకులఫైట్స్‌: రామ్‌లైన్‌ ప్రొడ్యూసర్‌: నయీమ్‌ షేక్‌కో ప్రొడ్యూసర్‌: కిరణ్‌ తనమలప్రొడ్యూసర్‌: జాన్‌ సుధీర్‌ పూదోటదర్శకత్వం: కాంచీ 5497.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved