`
pizza

Irumudi Press Meet At Chennai
‘ఇరుముడి’ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్. తప్పకుండా అందరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. ఈ సినిమా మీ మనసులో నిలిచిపోతుంది: చెన్నై ప్రెస్‌మీట్‌లో మాస్ మహారాజా రవితేజ

You are at idlebrain.com > News > Functions
Follow Us


22 August 026
Hyderabad

మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ప్రెస్‌మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. నాకు తమిళ్ సినిమాతో చాలా అనుబంధం ఉంది. నటుడిగా సినిమా పరిశ్రమలో నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. ముందుగా టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్ చెప్పాలి. ప్రొడక్షన్ డిజైనర్ సురేష్, డీఓపీ విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. క్లైమాక్స్‌లో జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఇది హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్. నక్షత్ర ఫ్యూచర్‌లో ఇంకా పెద్ద స్టార్ అవుతుంది. తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ప్రియా చాలా సహజంగా నటించింది. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలు రవి, నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. నేను ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనే సక్సెస్ మీట్‌లో మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా మీద మాకు మొదటి నుంచి అంత నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ తమిళనాడులో కూడా ఉండాలని కోరుకున్నాను. మా డైరెక్టర్ శివ సినిమా అద్భుతంగా తీశాడు. తప్పకుండా అందరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. కచ్చితంగా ఈ సినిమా ఇష్టపడతారు. ఈ సినిమాని మీతో పాటు మనసులో పెట్టుకుంటారు. అందరికీ థాంక్యూ సో మచ్.

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను మైత్రి మూవీ మేకర్స్‌తో తమిళ్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా చేశాను. అది చాలా పెద్ద విజయం సాధించింది. డైరెక్టర్ గారు ‘ఇరుముడి’ కథ చెప్పగానే కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఇది ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని చెప్పాను. రవితేజ గారి సినిమాల్లో ‘విక్రమార్కుడు’ సినిమా నాకు చాలా ఇష్టం. అందులో ఆయన పెర్ఫార్మెన్స్ వేరే లెవల్‌లో ఉంటుంది. కమర్షియల్ సినిమాలు చేయడంలో రవితేజ గారి స్టైలే వేరు. ‘ఇరుముడి’ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో రవితేజ గారి పెర్ఫార్మెన్స్ అద్భుతం. అలాగే ప్రియా నటన కూడా చాలా సహజంగా ఉంది. నక్షత్రకు నేషనల్ అవార్డు వస్తుందని నేను ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనే చెప్పాను. మైత్రి మూవీ మేకర్స్‌లో మరో విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా పెద్ద హిట్ సినిమా. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. తమిళ్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మణిరత్నం గారు, భారతీరాజా గారు, శంకర్ గారు సినిమాలన్నీ చూస్తూ పెరిగాను. డైరెక్టర్ అయిన తర్వాత నా సినిమా కూడా తమిళ్‌లో ఆడాలని కోరుకున్నాను. ఖుషి సినిమా నాకు చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అందులో పాటలను చాలా ఇష్టపడ్డారు. ‘ఇరుముడి’ కథ అనుకున్నప్పుడే కచ్చితంగా ఈ సినిమాని తమిళ్‌లో చేయాలని అనుకున్నాం. జీవీ ప్రకాష్ గారు ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘ఇరుముడి’లో డివోషనల్, ఫ్యామిలీ, క్రైమ్ ఇలా మూడు లేయర్స్ ఉన్నాయి. ఈ మూడు లేయర్స్ మిమ్మల్ని షాక్ చేస్తాయి. సర్‌ప్రైజ్‌లు వస్తాయి. మీరు సినిమా చూస్తే కచ్చితంగా ఆ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుగు ఆడియన్స్ సినిమాని చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు. అలాంటి సెలబ్రేషన్స్ తమిళనాడులో కూడా చూడాలని అనుకుంటున్నాను. రవితేజ గారు మాస్‌ని థియేటర్‌లోకి తీసుకొచ్చే స్టార్. అదే సమయంలో ఆయనలో అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నారు. త్రినాథ్ పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని షాక్ చేస్తుంది. ఆయన పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. అలాగే కావేరి పాత్రకు ప్రియా భవాని శంకర్ గారు పూర్తిగా న్యాయం చేశారు. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ జీవీ ప్రకాష్ గారు మాత్రమే చేయగలరు. ఆయన ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు. వారితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమాలో చాలా మంచి సందేశం కూడా ఉంది. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ.. నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ కథ విన్నప్పుడే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్‌లో ప్రతి ఒక్కరు కూడా సినిమా అద్భుతంగా ఆడుతుందని బిలీవ్ చేశాం. అదే ఈరోజు నిజమైంది. జీవీ ప్రకాష్ గారు కథ విన్నప్పుడే నాకు కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారు. నిన్ననే సినిమా థియేటర్‌లో చూశాను. ప్రేక్షకులు సినిమాని ఎంతో ఇష్టపడుతున్నారు. సినిమాని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నక్షత్ర చాలా అద్భుతంగా నటించింది. రవితేజ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉంటారు. షూటింగ్ సమయంలో నాకు త్రినాథ్ పాత్రలోనే కనిపించారు. కచ్చితంగా ఇది రవితేజ గారికి మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్. ఈ సినిమాని ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.

నక్షత్ర మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాలో భాగమవడం చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా మా నాన్న రవితేజ గారికి, అలాగే ఈ సినిమాలో మా అమ్మగా నటించిన ప్రియా మేడమ్ గారికి థాంక్యూ నన్ను ఈ పాత్రలో ఎంపిక చేసిన డైరెక్టర్‌కి థాంక్యూ. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ ఫ్యామిలీ, థ్రిల్లర్, డివోషన్ ఇలా మూడు లేయర్స్ ఉన్న కథతో వచ్చారు. ఇలాంటి అద్భుతమైన కథకు న్యాయం చేయగల ఏకైక హీరో రవితేజ గారు. ఆయన ఈ సినిమాని అద్భుతంగా చేశారు. అలాగే ప్రియా భవాని శంకర్ గారు కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. బేబీ నక్షత్ర పాత్ర ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. ఈ సినిమా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. జీవీ ప్రకాష్ గారు ఈ కథ వినగానే సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారు. మేము ఏదైతే సినిమా విజయం సాధిస్తుందని ఆశించామో, దానికి మూడు రెట్లు ఎక్కువ విజయాన్ని అయ్యప్ప స్వామి మాకు అందించారు. బుక్‌మైషోలో టికెట్లు అద్భుతంగా అమ్ముడవుతున్నాయి. మొదటి రోజుకి, రెండో రోజుకి అలా పెరుగుతూనే ఉన్నాయి. అయ్యప్ప స్వామి సౌత్ ఇండియాలో బిగ్ ఎమోషన్. తమిళ్‌లో కూడా సినిమా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఇది కల్ట్ క్లాసిక్ ఫిల్మ్. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రవితేజ గారి పెర్ఫార్మెన్స్‌ని ఆడియన్స్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకులో సినిమా


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved