pizza
Devi Sri Prasad launches Nenorakam song teaser
"నేనోరకం " సాంగ్ టీజర్ ను లాంఛ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్..
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 July 2016
Hyderabad

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్దమయింది.కాగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నేనోరకం సాంగ్ టీజర్ ను ఈ రోజు లాంఛ్ చేశారు. త్వరలో ఈ సినిమా పాటలను విడుదల చెయనున్నారు..

ఈసందర్బంగా ..
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేనోరకం టీజర్, సాంగ్స్ ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. చిత్ర యూనిట్ కు నా అభినందనలు. సాయి రామ్ శంకర్ కెరీర్ లో "నేనోరకం " బెస్ట్ మూవీ అవుతుందన్నారు..

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. నేనోరకం సాంగ్ టీజర్ ను దేవిశ్రీ ప్రసాద్ లాంఛ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు..

దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ.. నేనోరకం సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే సరికొత్త ట్రీట్ మెంట్ తో రూపొందించటం జరిగింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను అందించే చిత్రమిదని అన్నారు.

నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ నెలలొనె పాటలను విడుదల చెయనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా ను సిద్దం చేయటం జరిగింది. రాధిక శరత్ కుమార్ గారు తమిళ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెసెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్ర విజయంపై 100% కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు..

రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు

కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved