pizza
Yenta Pani Chesave Sirisha Banner & Logo Launch
`ఎంత‌ప‌ని చేశావే శిరీషా` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

08 June 2016
Hyderabad

ఓవ‌ర్సీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నెట్ వ‌ర్క్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఎంత‌ప‌ని చేశావే శిరీషా`. శివ‌రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప‌ట్లూరి బాల‌కృష్ణ‌, రామ్ ప్ర‌సాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కాన‌ల నిర్మాత‌లు. మ‌హ‌త్ రాఘ‌వేంద్ర క‌థానాయ‌కుడు. పున‌ర్న‌వి భూపాళం నాయిక‌. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో బుధ‌వారం జ‌రిగింది. బ్యాన‌ర్ లోగోను తెలంగాణ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు పి.రామ్మోహ‌న్ విడుద‌ల చేశారు. టైటిల్ లోగోను అనిల్ సుంక‌ర ఆవిష్క‌రించారు.

బాల‌కృష్ణ మాట్లాడుతూ ``అనిల్ సుంక‌ర నాకు స్ఫూర్తి. ఆయ‌న మార్గంలోనే వెళ్లి తీసిన ఈ సినిమా హిట్ కావాలి. మా యూనిట్ స‌భ్యులంద‌రూ కృషి చేసి ఈ సినిమాను చాలా బాగా చేశారు. ఇంటిల్లిపాదీ చూసేలా తెర‌కెక్కించాం. ఆద్యంతం న‌వ్వులు తెప్పిస్తూనే ఉంటుంది`` అని చెప్పారు.

అనిల్ సుంక‌ర మాట్లాడుతూ ``బాల‌కృష్ణ, నేను క్లాస్ మేట్స్. బెంచ్ మేట్స్. అయితే బ్యాక్ బెంచ్ మాత్రం కాదు. కానీ ఈ సినిమా బ్యాక్‌బెంచ్ సినిమా హీరో మ‌హ‌త్ రాఘ‌వేంద్ర న‌టించారు. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ సినిమా రావ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాకు స‌పోర్ట్ చేయాల‌ని ఆకాంక్షిస్తున్నాను`` అని తెలిపారు.

పి.రామ్మోహ‌న్ మాట్లాడుతూ ``ఈ సంస్థ బ్యాన‌ర్ లోగో చాలా బావుంది. ఈ సంస్థ మీద ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వీళ్లు సినిమాలు చేస్తూనే ఉండాలి`` అని చెప్పారు.

Punarnavi Bhupalam Glam gallery from the event

దిలీప్ కుమార్ మాట్లాడుతూ ``చిన్న ఇన్సిడెంట్ మీద తీసిన చిత్ర‌మిది. డైలాగులు కూడా కంటెంట్ మీద బేస్ అయి ఉంటాయి. మ‌హ‌త్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. హీరోయిన్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. మంచి లొకేష‌న్లలో చిత్రీక‌రించాం`` అని తెలిపారు.

సుద‌ర్శ‌న్ మాట్లాడుతూ ``మ‌హ‌త్ ఈ సినిమాతో చాలా బాగా ఫ్రెండ్ అయ్యారు. ఈ చిత్రాన్ని చూస్తుంటే మంచి స‌న్నిహితుల మ‌ధ్య ఆనందంగా గ‌డిపిన‌ట్టు ఉంటుంది. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు.

పున‌ర్న‌వి మాట్లాడుతూ ``క‌థ బాగా న‌చ్చింది. క‌థ విన్నంత సేపూ ఎగ్జ‌యిట్ అయ్యాను. షూటింగ్ కూడా పూర్త‌యింది. సినిమా ఎంత క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుందో టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది`` అని తెలిపారు.

సుద‌ర్శ‌న్‌, అన్న‌పూర్ణ‌, సూర్య‌, అనితా చౌద‌రి, సుడిగాలి సుధీర్‌, ప్రియ‌, జోగి బ్ర‌ద‌ర్స్ అశోక్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ సినిమాకు స‌హ నిర్మాత‌లు: విజ‌య్‌.కె.మ‌డ‌ల‌, రామ్‌ల‌క్ష్మ‌ణ్ మునిగంటి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: దిలీప్ బొలుగోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: శ్యామ్ బోనాలా,సంగీతం: పూర్ణ‌చంద‌ర్ భైరి, కెమెరా: శ్యామ్ ప్ర‌సాద్‌, ఎడిట‌ర్‌: స‌త్య గిడుటూరి, ఆర్ట్: రామ్ కుమార్, కెమెరా: ర‌మేష్ ఎర్రోళ్ల‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved