pizza
Anubandham movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 December 2015
Hyderabad

అనుబంధం (శాటిలైట్‌తో) మూవీ ప్రారంభం

శ్రీ సాయి సినిమాస్‌ బ్యానర్‌పై యం. మహేంద్రవర్మ సమర్పణలో సాయి, నాగుల్‌ మీర నిర్మాతలుగా.. సత్యనారాయణ సజ్జనపు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ''అనుబంధం''. 'శాటిలైట్‌తో' అనేది ఉపశీర్షిక. సారథి, నజీర్‌లు సహనిర్మాతలు. ఈ చిత్రం డిశంబర్‌ 10వ తేదీన ముహుర్తం జరుపుకుంది. ప్రముఖ తత్వవేత్త శ్రీశ్రీ రామశివ చైతన్యంగారు టీమ్‌ని ఆశీర్వదించి చిత్రానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడు నగేష్‌ నారదాశి దర్శకనిర్మాతలకు శుభాభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్యనారాయణ సజ్జనపు మాట్లాడుతూ..''నేటి యువతరంలోని అనబంధాలను, శాటిలైట్‌తో వాటి సంబంధాలను కొత్తదనంతో చూపించే వైవిధ్యభరిత చిత్రమే 'అనుబంధం'. నిర్మాతలు సాయి, నాగుల్‌ మీర గార్లు..ఈ స్టోరీ విని ఎంతో ఆసక్తిని కనబర్చారు. వెంటనే ఈ చిత్రం తెరకెక్కిద్దామని ఇలా ముందుకొచ్చారు. నా కథ నమ్మి, ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన వారికి ముందుగా ధన్యవాదాలు. అందరినీ అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి..'' అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ..''ముందుగా మా ఈ 'అనుబంధం' చిత్రానికి శ్రీకారం చుట్టిన శ్రీశ్రీ రామశివ చైతన్యం గార్కి, మా శ్రేయోభిలాషి, దర్శకుడు నగేష్‌ నారదాశి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. సత్యనారాయణ సజ్జనపు చెప్పిన కథ మాకు ఎంతగానో నచ్చింది. అందుకే ఈ సినిమా చేయాలని ముందుకొచ్చాము. ప్రముఖ హీరో నటించే ఈ చిత్రంలో మిగిలిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. జనవరి 20 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది..'' అని అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved